Hussian sagar
-
హైదరాబాద్ హుసేన్ సాగర్ లో సెయిలింగ్ సందడి
-
హైదరాబాద్‌లో ఆకాశమంత అంబేడ్కరుడు.. విగ్రహం విశేషాలు ఇవే!
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్ సాగర్ తీరాన సగర్వంగా కొలువైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా పేరు దక్కించుకుంది. ఈ విగ్రహాన్ని రాష్ట్ర సెక్రటేరియట్ పక్కన, బుద్ధ విగ్రహానికి సమీపంలో తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం పక్కన ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న (శుక్రవారం) సీఎం కేసీఆర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహం విశేషాలపై ఓ లుక్కేద్దాం! ►తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంబేడ్కర్ విగ్రహాం నిర్మాణాన్ని చేపట్టింది. భారీ ఎత్తున రూపొందిన ఈ విగ్రహం బరువు 465 టన్నులు ఉంటుంది. దీని కోసం 96 టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు, వెడల్పు 45.5 అడుగులు. విగ్రహం ఢిల్లీలో తయారు చేసి విడి భాగాలుగా తెచ్చి హైదరాబాద్‌లో అమర్చారు. పార్లమెంటు ఆకారంలో నిర్మించిన పీఠం లోపల సందర్శనాలయం ఉంటుంది. ►విగ్రహం ఖర్చు రూ.146 కోట్లు. ఈ ప్రాజెక్టులో మొత్తం 791 టన్నుల స్టీల్ వాడారు. విగ్రహం తయారీ కోసం 425 మంది శ్రామికులు పని చేశారు. ఇందులో 2 లిఫ్ల్లను ఏర్పాటు చేశారు. ( ఒక్కోదానిలో 15 మంది సామర్థ్యం) ►విగ్రహం ఏర్పాటు కోసం 11.7 ఎకరాలు, ప్రధాన, అనుబంధ భవనాలు కోసం 1.35 ఎకరాలు, చుట్టు పచ్చదనం కోసం 2.93 ఎకరాలు, చుట్టూ అభివృద్ధి చేసిన ప్రాంతం కోసం 1.23 ఎకరాలు, కామన్ పార్కింగ్ కొరకు 4.82 ఎకరాలను కేటాయించారు. ►ఈ విగ్రహం ఉన్న పీఠం ఎత్తు 50 అడుగులు, మొత్తం ఎత్తు 175 అడుగులు. ►11.04 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. అందులో 2.93 ఎకరాల్లో థీమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. ►అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి సాంకేతిక, తయారీ చర్యలను ఖరారు చేసేందుకు రెండేళ్లు పట్టింది. ►ఈ కార్యక్రమానికి పద్మభూషణ్ అవార్డు గ్రహీత, విగ్రహ శిల్పి 98 ఏళ్ల రామ్ వంజీ సుతార్‌ను ఆహ్వానించారు. ►అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35 వేల మందికి పైగా హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ►750 రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ప్రజల రావాణా కోసం ఉపయోగించనున్నారు. ►ఈ కార్యక్రమం కోసం హాజరయ్యే ప్రజల కోసం లక్ష స్వీట్ ప్యాకెట్లు, 1.50 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హమ్మయ్య.. హైదరాబాద్ వాహనదారులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో శని, ఆదివారాల్లో ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) నిర్వహించారు. దీంతో ఇటువైపుగా వచ్చే వాహనాలను దారి మళ్లించారు. కార్ రేసింగ్ ముగియడంతో సోమవారం వాహనాలను కొత్తగా నిర్మిస్తున్న రాష్ట్ర కొత్త సచివాలయం ముందు నుంచి అనుమతించారు. రెండురోజుల పాటు ఇబ్బందులకు గురైన వాహన చోదకులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, కార్ రేసింగ్ కోసం ఈ మార్గంలో ప్రత్యేకంగా ట్రాక్‌ను నిర్మించారు. దేశంలోనే తొలి స్ట్రీట్ సర్క్యూట్ ఇండియన్ రేసింగ్ లీగ్‌ను హుస్సేన్ సాగర్ తీరంలో శని, ఆదివారాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే చెన్నై జట్టుకు చెందిన కారు ప్రమాదానికి గురికావడంతో రేసింగ్‌ను నిర్వాహకులు నిలిపివేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. డిసెంబర్ 10, 11 తేదీల్లో మళ్లీ ఇక్కడ కార్ రేసింగ్ నిర్వహిస్తారు. (క్లిక్ చేయండి: రేస్ లేకుండానే ముగిసిన లీగ్...) -
హుస్సేన్ సాగర్ వద్ద ఫార్ములా ఈ రేసింగ్ ట్రాక్ నిర్మాణం
-
క్రతువు ముగిసింది.. కాలుష్యం మిగిలింది!
సాక్షి, హైదరాబాద్: మహా నగరంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. హుస్సేన్‌సాగర్ సహా సుమారు వంద జలాశయాల్లో వేలాదిగా గణపతి ప్రతిమలను నిమజ్జనం చేశారు. నిమజ్జన క్రతువు ముగిసిన వెంటనే వ్యర్థాలను గణనీయంగా తొలగించినట్లు బల్దియా యంత్రాంగం ప్రకటించినప్పటికీ.. ప్లాస్టర్‌ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం కారణంగా టన్నుల కొద్దీ ఘన వ్యర్థాలు, అధిక గాఢత రసాయనాలు, హానికారక మూలకాలు, ఇనుము, కలప, పీఓపీ ఆయా జలాశయాల్లో కలిసినట్లు పీసీబీ నిపుణులు చెబుతున్నారు. త్వరలో నిమజ్జన కాలుష్యంపై తుది నివేదిక విడుదల చేయనున్నట్లు తెలిపారు. హుస్సేన్‌సాగర్‌లో అంచనా ఇలా.. జలాశయంలోకి సుమారు 5 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 30 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 2 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ సాగరంలో కలిసినట్లు పీసీబీ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ఇనుము, కలపను బల్దియా ఆధ్వర్యంలో తొలగించినా.. పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో హుస్సేన్‌సాగర్ మరింత గరళమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధిక మోతాదులో హానికారక రసాయనాలు, వ్యర్థాలు, మూలకాలు ప్రవేశించడంతో జలాశయంలో ప్రతి లీటరు నీటిలో జీవరాశుల మనుగడకు అత్యావశ్యకమైన బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్లు పరిమితులకు మించి నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. రసాయనాలు, మూలకాలిలా.. రసాయన రంగుల అవశేషాలు: లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టరీ్పన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్ని‹Ù. హానికారక మూలకాలు: కోబాల్ట్, మాంగనీస్, డయాక్సైడ్, మాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జిక్ సలై్ఫడ్, మెర్క్యురీ, మైకా. తలెత్తే అనర్థాలు.. ఆయా జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను పలువురు మత్స్యకారులు నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసి తిన్న వారికి శరీరంలోకి హానికారక మూలకాలు చేరుతున్నాయి. మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం మాలిబ్డనమ్, సిలికాన్లు జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికారక మూలకాలు అవక్షేపాలుగా ఏర్పడతాయి. (చదవండి: రూబీ లాడ్జీ: ఎనమిదికి చేరిన మృతుల సంఖ్య..ఫైర్ అధికారి కీలక వ్యాఖ్యలు) -
హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
-
కరోనా భయంతో సాగర్‌లో దూకాడు
సాక్షి, హైదరాబాద్ : కరోనా లక్షణాలతో పది రోజుల నుంచి బాధపడుతున్నాడు...చికిత్స చేయాలని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాడు. కానీ ఆ ఆస్పత్రిలో చేర్చుకునేందుకు వారు నిరాకరించి గాంధీకి వెళ్లమన్నారు. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. తాను ఎన్నో రోజులు బతకలేనని భావించిన ఓ వ్యక్తి హుస్సేన్ సాగర్‌లో దూకి గల్లంతయ్యాడు. ఈ ఘటన రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. వెస్ట్ బెంగాల్‌కు చెందిన పల్టుపాన్ (34) కొద్ది సంవత్సరాల క్రితం భార్య రోమాపాన్‌తో సహా నగరానికి వచ్చి దూద్‌బౌలిలో స్థిరపడ్డారు. పల్టుపాన్ గోల్డ్‌స్మిత్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆయన 10 రోజుల నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడు. స్థానికంగా ఉండే ఓ క్లినిక్‌లో చికిత్స తీసుకుంటున్నా తగ్గలేదు. అయితే అక్కడి వైద్యుల సూచన మేరకు గురువారం, శుక్రవారం చికిత్స కోసం మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఉదయం నుంచి రాత్రి వరకు రెండు రోజుల పాటు ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నా బెడ్లు లేవని చెప్పి అతన్ని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. తనకు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది అవుతుందని కాళ్ల వేళ్ల పడినా కనికరించకుండా గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. శుక్రవారం సమస్య మరింత తీవ్రం కావడంతో పాటు శ్వాస తీసుకోవడానికి మరింత ఇబ్బంది వచ్చింది. తీవ్ర భయాందోళనకు గురైన ఆయన శుక్రవారం సాయంత్రం తన స్నేహితుడు శ్రీరాములుకు ఫోన్ చేశాడు. అతడు రాగానే తనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని హుస్సేన్ సాగర్ వద్దకు వెళితే చల్లటి గాలి వస్తుందని అక్కడికి తీసుకుని వెళ్లాలని కోరాడు. దీంతో ఇద్దరు కలిసి రాత్రి 7.55 గంటల సమయంలో ఆటోలో ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. ఆటోను ట్యాంక్‌బండ్‌పై ఉండే పూజా స్టాల్ లేపాక్షి మధ్యలో నిలిపి తాను కొద్దిసేపు అలా తిరిగి వస్తానని పల్టు పాన్ ముందుకు నడుచుకుంటూ వెళ్లి హుస్సేన్ సాగర్‌లో దూకాడు. వెంటనే శ్రీరాములు దీన్ని గమనించి రాంగోపాల్‌పేట్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వాళ్లు అక్కడికి చేరుకుని నీళ్లలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అతని ఆచూకీ మాత్రం తెలియలేదు. -
హుస్సేన్ సాగర్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం
రాంగోపాల్‌పేట్: హుస్సేన్ సాగర్‌లో తేలియాడుతున్న గుర్తు తెలి యని వ్యక్తి మృతదేహాన్ని రాంగోపాల్‌పేట పోలీసులు వెలికితీశారు. ఎస్ఐ రఘు కథనం ప్రకారం... ట్యాంక్‌బండ్‌పై ఉన్న నన్నయ విగ్రహం ఎదురుగా సాగర్ జలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుండగా పోలీసులు వెలికి తీయించారు. మృతుడి వయసు 25–30 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఒంటిపై బూడిద రంగు గళ్ల చొక్కా, నలుపు రంగు ఫ్యాంటు ఉన్నాయి. మృతదేహాన్ని గుర్తింపు నిమిత్తం గాంధీ మార్చురీలో భద్రపరిచారు. సంబంధీకులుంటే రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ నంబర్ 040–27853595ను సంప్రదించాలని సూచించారు. -
శివ.. హుస్సేన్ సాగర్ హీరో!
సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారానికై వినబడే పేరు.. శివ! జీవితం మీద విరక్తితో హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకోవాలని వచ్చే వారిని కాపాడటంతోపాటు.. రకరకాల కారణాలతో హుస్సేన్ సాగర్ లో దూకి చనిపోయినవారి మృతదేహాలను వెలికి తీయడం వరకు అన్ని పనులు చేస్తాడు శివ. అందుకే తోటి కార్మికులు అతణ్ని 'హుస్సేన్ సాగర్ కా హీరో' అని పిలుచుకుంటారు. కార్మికుడిగా శివ చేస్తోన్న పనులను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ మెచ్చుకున్నారు. శుక్రవారం తన చాంబర్ కు పిలిపించుకుని శివకు శాలువా కప్పి సన్మానించారు. ఎందరినో కాపాడి, ఎన్నో మృతదేహాలను వెలికితీస్తూ శివ చేస్తున్న పని సామాన్యమైనదేమీకాదని డిప్యూటీ మేయర్ ప్రశంసించారు. -
నేడే నిమజ్జనం
⇒ సగానికిపైగా హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం ⇒ నగరం చుట్టూ మరో 24 చెరువుల వద్ద ఏర్పాట్లు ⇒ ప్రతి 3 కి.మీ.కు ఒక గణేశ్ యాక్షన్ టీం ⇒ 400 ప్రత్యేక బస్సులు, 8 ఎంఎంటీఎస్ రైళ్లు ⇒ శోభాయాత్రలో పాల్గొనే మొత్తం విగ్రహాలు 60,000 ⇒ బందోబస్తు విధుల్లో పోలీసులు 30,000 ⇒ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య (సుమారుగా) 2,500 సాక్షి, హైదరాబాద్: పదకొండు రోజులపాటు భక్తకోటి పూజలందుకున్న విఘ్నేశ్వరుడు నేడు నిమజ్జనానికి కదలనున్నాడు! ఆదివారం జరిగే నిమజ్జన మహాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు ప్రభుత్వ యంత్రాంగాలన్నీ రంగంలోకి దిగాయి. జీహెచ్ఎంసీ, పోలీసు, రవాణా, విద్యుత్, వైద్య, ఆరోగ్యశాఖ, జలమండలి, హెచ్ఎండీఏ, ఆర్టీసీ తదితర విభాగాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా నిఘా కెమెరాలు, గస్తీ బృందాలను ఏర్పాటు చేశారు. ఈసారి షీటీమ్స్ సైతం రంగంలోకి దిగాయి. భక్తులతో కిక్కిరిసిపోనున్న హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. శనివారం పోలీసులు ఖైరతాబాద్, బాలాపూర్ మహాగణపతుల నిమజ్జనానికి సంబంధించిన ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. ఈ ఏడాది సుమారు 60 వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలనున్నాయి. వీటిలో 50 శాతానికిపైగా హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం కానున్నాయి. ఈసారి బాలాపూర్ శోభాయాత్రతో నిమిత్తం లేకుండానే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తారు. మిగతా విగ్రహాలను నగరం చుట్టూ ఉన్న 24 చెరువుల్లో నిమజ్జనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మీరాలం ట్యాంకు, పల్లెచెరువు, పత్తికుంట చెరువు, దుర్గం చెరువు,సఫిల్‌గూడ చెరువు, రామసముద్రం, ఐడీఎల్ చెరువు, సున్నం చెరువుల వద్ద నిమజ్జన వేడుకలు జరుగనున్నాయి. జీహెచ్ఎంసీ సన్నద్ధం ట్యాంక్‌బండ్‌తోపాటు మిగతా చెరువుల వద్ద నిమజ్జనం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. పారిశుధ్య పనుల కోసం 545 మంది శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, 5,793 మంది కార్మికులు విధులు నిర్వహించనున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్, ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లు, 21 మంది కార్మికులతో ‘గణేశ్ యాక్షన్ టీమ్’ ఏర్పాటు చేశారు. ప్రతి 3 నుంచి 4 కిలోమీటర్లకు ఒక టీమ్ పని చేస్తుంది. మొత్తం 180 బృందాలు 24 గంటల పాటు పారిశుధ్య పనుల్లో నిమగ్నమై ఉంటాయి. ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేందుకు అదనంగా కొన్ని వాహనాలను సైతం అద్దెకు తీసుకున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. శోభాయాత్ర సాగే మార్గంలో రూ.13.55 కోట్లతో ఇప్పటికే రహదారులు మరమ్మతు చేశారు. రూ.39 లక్షలతో 23,353 తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్ మార్గంలో 21 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గంలో మరో 21 క్రేన్లను నీటిపారుదల శాఖ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్లను కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. 30 వేల మంది పోలీసులతో భద్రత జంట పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 30 వేల మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 2,500కు పైగా నిఘా కెమెరాలు, మరో 10 మౌంటెడ్ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. సుమారు 150 షీటీమ్స్ రంగంలోకి దిగాయి. 60 బాంబు నిర్వీర్య బృందాలను మోహరించారు. 60 స్నిఫర్డాగ్స్ను కూడా రంగంలోకి దించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మొత్తం నిమజ్జన యాత్రను ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ‘భగవంతుని సేవలో భక్తులు.. భక్తుల సేవలో పోలీసులు’ అనే నినాదంతో పోలీసుల బలగాలు రంగంలోకి దిగాయి. 120 పెట్రోలింగ్ వాహనాలు, 17 ఇంటర్సెప్టర్లు, 88 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. ఘాట్ల వద్ద మరో 50 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు సీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. 400 ప్రత్యేక బస్సులు: ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనోత్సవాన్ని వీక్షించేందుకు తరలి వచ్చేవారి కోసం ఆర్టీసీ 400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నగరం నలుమూలల నుంచి బస్సులు లక్డీకాఫూల్, ఖైరతాబాద్, ఇందిరాపార్కుకు రాకపోకలు సాగిస్తాయి. నిమజ్జన వేడుకలు పూర్తయ్యే వరకు ప్రయాణికులకు బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ఈడీ పురుషోత్తం నాయక్ తెలిపారు.దక్షిణ మధ్య రైల్వే 8 ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు ప్రతి అరగంటకు ఒకటి చొప్పున నాంపల్లి-సికింద్రాబాద్, ఫలక్‌నుమా-సికింద్రాబాద్, లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో తిరుగుతాయి. ఏర్పాట్లు పూర్తి చేశాం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గణేశ్ యాక్షన్ టీమ్‌లు 24 గంటల పాటు విధి నిర్వహణలో ఉంటాయి. రహదారులు, వీధిదీపాల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నాం.ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజలు జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040-21111111నంబర్‌కు ఫోన్ చేయొచ్చు. - సోమేశ్‌కుమార్, జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ పోలీసులు క్షణాల్లో చేరుకుంటారు బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు 400 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా పోలీసులు క్షణాల్లో చేరుకొనే విధంగా ఏర్పాట్లు చేశాం. - మహేందర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ -
భర్త మందలించాడని.. నవవధువు ఆత్మహత్యాయత్నం
రాంగోపాల్‌పేట్(హైదరాబాద్): భర్త మందలించాడని ఓ నవ వధువు హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు రక్షించారు. ఇన్స్పెక్టర్ కే శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం... కవాడిగూడకు చెందిన ఎస్.శాంతి అలియాస్ అశిరామల్ ఫాతిమా(20) అదే ప్రాంతానికి చెందిన తులసీరాం మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో మే 6వ తేదీ ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. తులసీరాం ట్రాన్స్‌కోలో అటెండర్‌గా పనిచేస్తుండగా శాంతి డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తుంది. ఈ పెళ్లి ఇష్టంలేక పోవడంతో తులసీరాం తండ్రి ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఇద్దరూ ఎవరి ఇళ్లలో వారుంటున్నారు. కాగా, శాంతి ఇటీవల అత్తా మామలపై బేగంపేట్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వారికి కౌన్సెలింగ్ నిర్వహించి అందరినీ కలసి ఉండాలని ఒప్పించి పంపారు. ఈ విషయంపై తులసీరాం భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనై మధ్యాహ్నం ట్యాంక్‌బండ్‌కు చేరుకుని హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా గస్తీ నిర్వహిస్తున్న లేక్ పోలీసులు రక్షించారు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత భర్తను పిలిపించి ఆమెను అప్పగించారు. -
ఆపరేషన్ సాగర్
-
అమరుల త్యాగాలపై రాజకీయాలొద్దు: హరీశ్‌రావు
వారి కుటుంబాలన్నింటికీ సాయం అందిస్తాం సంఖ్య తగ్గించే ఆలోచన లేదు: హరీశ్‌రావు 1969 అమరుల కుటుంబాలకూ ఆర్థిక సాయం: డిప్యూటీ సీఎం హుస్సేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహం పక్కన అమరుల స్మృతి స్తూపం నిర్మించాలి: ఎర్రబెల్లి నల్లగొండలో కొత్త జిల్లాకు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి: జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘‘అమరుల కుటుంబాలకు ఎంత చేసినా తక్కువే.. వారి త్యాగాలను వెల కట్టలేం. త్యాగాలను రాజకీయం చేయకండి. చరిత్ర మనల్ని క్షమించదు’’ అని శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు విపక్షాలకు హితవు పలికారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాల న్నింటికీ ప్రభుత్వపరంగా సాయం అందిస్తామన్నారు. అమరుల సంఖ్యను తగ్గించలేదని.. మొదటి విడతలో జిల్లా కలెక్టర్ల నుంచి 459పేర్లు మాత్రమే ప్రభుత్వానికి అందినట్లు చెప్పారు. ఈ సంఖ్య తక్కువగా వచ్చినట్లు గుర్తించిన ప్రభుత్వం.. కలెక్టర్లను రీ వెరిఫికేషన్‌కు ఆదేశిం చిందన్నారు. అమరుల విషయంలో సంఖ్యా నిబంధన ఏదీ లేదన్నారు. తమ నియోజకవర్గాల్లో అమరులైన కుటుంబాలుంటే సభ్యులు కలెక్టర్ల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఉద్యమంలో నమోదైన కేసులన్నీ ఎత్తివేసేందుకు హోంశాఖ చర్య లు చేపట్టిందన్నారు. రైల్వే విభాగం నమోదు చేసిన కేసులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేవని.. వాటిని ఎత్తివేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిందన్నారు. మరణ వాంగ్మూలాల్లో ఎవరి పేర్లున్నాయో అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల వ్యవధిలో అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టత ఇవ్వాలని టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి ప్రశ్నించారు. చనిపోయిన కుటుంబాలకు శాశ్వత గౌరవం కల్పించే చర్యలు చేపట్టాలని ఉద్యోగం, పింఛన్‌తో పాటు రాయితీలు కల్పిం చాలన్నారు. హుస్సేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహం పక్కన ప్రపంచంలోనే పెద్దదిగా అమరుల స్మృతి స్తూపం నిర్మించాలని సూచించారు. అమరుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేస్తే తాము సహకరిస్తామన్నారు. ఈ సందర్భంగా.. ‘శ్రీకాంతాచారి కుటుంబానికి టిక్కెట్టు ఇచ్చింది మేమే..’ అంటూ అధికార పార్టీ సభ్యులు నినాదాలు చేయటంతో ‘అది ఓడిపోయేదో.. గెలిసేదో అందరికీ తెలుసు’ అని దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకొని ‘అక్కడ వారిపై పోటీ పెట్టింది ఎవరో, ఎందుకు పెట్టారో, ఎందరు అమరులు తమ మరణ వాంగ్మూలాల్లో ఎవరి పేర్లు రాశారో.. ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది’ అని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. అమరుల కుటుంబాల్లోని పిల్లలకు ఉచిత విద్య అందించాలని, వారి సంక్షేమానికి ప్రత్యేకంగా శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామాన్ని ప్రభుత్వం దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమం కేసుల్లో ఇరుక్కొని.. జైలుపాలైన వారిని తెలంగాణ సమరయోధులుగా గుర్తించాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. నల్లగొండలో ఏర్పాటు చేసే కొత్త జిల్లాకు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని సూచిం చారు. ఇందుకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ బదులిస్తూ.. 1969 ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు సైతం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు వీరందరికీ రూ.10 లక్షల ఆర్థిక సాయం, ఆ కుటుంబంలో అర్హులైన ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయ వృత్తిలో ఉన్న కుటుంబానికి వ్యవసాయ భూమి, ఇల్లు లేకుంటే ఇల్లు ఇప్పిస్తామన్నారు. పాట పాడిన బాలకిషన్ అమరుల త్యాగాలను కొనియాడుతూ బాలకిష న్ పాడిన పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. ‘గుండెల్లో కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి.. అధ్యక్షా.. ఇక్కడ పాట పాడొచ్చో లేదో నాకు తెలియదు. అమరులశవాల మీద కైగట్టి పాటలు పాడిన వాణ్ని. వాళ్ల అమరత్వం మీద అసెంబ్లీ లో పాట పాడుతా అని ప్రమాణం చేసిన వాణ్ని... అందుకే పాట పాడుతున్నా’ అంటూ.. ‘నిప్పుల్ని నీళ్లలా తాగినోళ్లు... మంటనొంటికలుముకున్నవాళ్లు... నూనుగు మీసాల పోరగాళ్లు.. తెలంగాణకై ఒరిగినోళ్లు... ఒక్కరా.. ఇద్దరా విద్యార్థి వీరులు.. నేడు తెలంగాణ పోరులో నేల రాలిన తారలు..’ అని పాడారు. 1969 ఉద్యమంలో చనిపోయిన కుటుంబాల బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉందంటూ మరో చర ణం పాడారు. ‘కనుచూపుదారుల్లో కన్నీటి పాట ల్లో.. ఎన్నెలా దీపాలకెలుగులైనోళ్లకు.. ఏటీ పాయల నీటి ఊటలా జోహర్.. గట్ల మీద గడ్డి చిలుకలా జోహర్.. చిలుకలా జోహర్. వరి మొలకలా జోహర్.. అమరులకు జోహార్.. వీరులకు జోహర్...’అని పాడడంతో సభ్యులంద రూ.. జోహార్ అని నివాళులు అర్పించారు. సభలో బీజేపీ సభ్యుల నిరసన అమరుల కుటుంబాలకు ప్రభుత్వ సాయంపై ప్రశ్నోత్తరాల వ్యవధి ముగిసినా అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ కొనసాగింది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు పదే పదే పట్టుబట్టినా స్పీకర్ అంగీకరించలేదు. అప్పటికే ప్రశ్నోత్తరాల వ్యవధి ముగియటంతో జీరో అవర్ చేపట్టారు. తమ వాదన వినకుండా జీరోఅవర్ ప్రారంభించటంతో కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కకు, ఆ తర్వాత టీఆర్ఎస్ సభ్యుడు నల్లాల ఓదేలుకు మాట్లాడే అవకాశమిచ్చారు. అప్పటివరకు నిలబడి ఉన్న బీజేపీ సభ్యులకు స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. దీంతో బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీరే సభ నడుపుకోండి. అమరవీరులపై మాట్లాడే అర్హత మాకు లేదా..’ అంటూ ఆవేశంగా మాట్లాడారు. మీకు అవకాశమిచ్చాం కదా.. అని స్పీకర్ అన్నారు. ఇవ్వలేదంటూ బీజేపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్... ‘ఇచ్చాననుకుంటున్నాను. ఐ యామ్ సారీ. ఇప్పుడు మాట్లాడండి..’ అని కిషన్‌రెడ్డికి మాట్లాడే అవకాశమిచ్చారు. ‘అమర వీరుల అంశమే మాట్లాడుతా...‘ అని కిషన్‌రెడ్డి పట్టుబట్టారు. దీంతో మళ్లీ మైక్ కట్ చేశారు. ఇందుకు నిరసనగా కిషన్‌రెడ్డితోపాటు బీజేపీ సభ్యులు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్ హాల్లో బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. ‘అవకాశమిస్తాం.. ఏ అంశమైనా సరే మాట్లాడండి..’ అని స్పీకర్ కోరినా వినలేదు. దీంతో పది నిమిషాల పాటు సభను టీ బ్రేక్‌గా వాయిదా వేశారు. వాయిదా అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘అమరులపై చర్చకు అవకాశమివ్వకపోవటంతో బీజేపీ సభ్యులు మనస్తాపానికి గురయ్యారు.ఉద్యమంలో బీజేపీ అటు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కీలక భూమిక పోషించింది. అమరుల అంశంపై రేపు మళ్లీ చర్చించుకుందాం. బీజేపీ సభ్యులు సీట్లలో కూర్చోవాలి..’ అని విజ్ఞప్తి చేశారు. దీంతో బీజేపీ సభ్యులు శాంతించారు.