రాంగోపాల్‌పేట్: హుస్సేన్ సాగర్‌లో తేలియాడుతున్న గుర్తు తెలి యని వ్యక్తి మృతదేహాన్ని రాంగోపాల్‌పేట పోలీసులు వెలికితీశారు. ఎస్‌ఐ రఘు కథనం ప్రకారం... ట్యాంక్‌బండ్‌పై ఉన్న నన్నయ విగ్రహం ఎదురుగా సాగర్ జలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుండగా పోలీసులు వెలికి తీయించారు. మృతుడి వయసు 25–30 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఒంటిపై బూడిద రంగు గళ్ల చొక్కా, నలుపు రంగు ఫ్యాంటు ఉన్నాయి. మృతదేహాన్ని గుర్తింపు నిమిత్తం గాంధీ మార్చురీలో భద్రపరిచారు. సంబంధీకులుంటే రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ నంబర్ 040–27853595ను సంప్రదించాలని సూచించారు.