హైదరాబాద్లో బుధవారం మధ్యాహ్నం ఓ నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది.
గాంధీ ఆస్పత్రి: హైదరాబాద్లో బుధవారం మధ్యాహ్నం ఓ నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. గాంధీ ఆస్పత్రి సమీపంలో ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఉంచిన ఆడ శిశువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మరణించిన శిశువు రెండు రోజుల క్రితం జన్మించినట్లు తెలుస్తుంది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించి భద్రపరిచారు.
గత మూడు రోజులలో ఆస్పత్రిలో జరిగిన ప్రసవాల గురించి పోలీసులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. శిశువు మరణించిన తరువాత తల్లిదండ్రులు అక్కడ వదిలేసి వెళ్లారా...లేక ఆడశిశువు పుట్టడం వల్ల తల్లిదండ్రులే చంపేసి ఉంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నవజాత శిశువు మృతదేహాన్ని రోడ్డుపై వదలి వెళ్లడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.