మేడ్చల్: రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పెద్ద చెరువులో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని యువకుడి మృతదేహం వెలుగు చూసింది. మేడ్చల్ సీఐ శశాంక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెరువు నీటిలో మృతదేహన్ని వెలికితీయించారు. మృతుడి వయసు 20 ఏళ్లు ఉంటుందని తెలిపారు. ఈత కోసం వచ్చి చెరువులో మునిగి చనిపోయినట్లు భావిస్తున్నారు. మృతదేహన్ని పోలీసులు సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు.