
సాక్షి, విజయవాడ : మద్యం, డబ్బుల పంపిణీ లేకుండా చాలా పకడ్బందీగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. అధికార యంత్రాంగం ఎన్నికలకు సిద్ధంగా ఉంది. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి. 3 ఎన్నికలకు 30 వేల మంది కావాలి. 33 వేల మందిని మ్యాప్ చేసి పెట్టుకున్నాం. పీఓలు, ఆర్‌ఓలకు శిక్షణ ఇప్పటికే పూర్తయ్యింది. నామినేషన్ వేసేందుకు సహాయ డెస్కులు ఏర్పాటు చేశాం.
191 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం. బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తి కావచ్చింది. బాలాజీ రావు, ఎన్నికల పరిశీలకులు, రామకృష్ణ, ఎన్నికల వ్యయం పరిశీలకులు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎన్నికల సంఘం పరిశీలకులుగా నియమించింది. చాలా తక్కువ సమయం ఉంది, అందరూ సహకరించాలి. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాల’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment