సాక్షి, కృష్ణా : ఏపీలో నేటి నుంచి 7వ ఆర్థిక గణాంక శాఖ సర్వే అధికారికంగా ప్రారంభమైందని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. నేటి నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ఈ ఆర్థిక గణాంక సర్వే జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 13 వేల గ్రామపంచాయతీలు, పట్టణ స్థాయిలో 1200 ఇన్విస్టిగేషన్ యూనిట్ల ద్వారా 15 వేల మందితో సర్వే జరుగుతుందని, రెండు స్థాయిల్లో పర్యవేక్షణ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. గణాంక శాఖ సర్వేకు సంబంధించి ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేసామని తెలిపారు. ఈ సర్వేను రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖ, జాతీయ శాంపిల్ సర్వే సంయుక్తంగా నిర్వహించనున్నాయని పేర్కొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ సర్వేను నిర్వహించే సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఇంతియాజ్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment