హైదరాబాద్: భారత జాతి కోసం ప్రాణ త్యాగాలు చేసిన జవాన్లను స్మరించుకోవడానికి డిసెంబర్ 7న ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ను నిర్వహించనున్నారు. దేశం కోసం పోరాడి అమరులైన వారి కుటుంబాలకు, అంగవైకల్యం పొందిన జవాన్లకు, మాజీ సైనికులకు చేయూత నివ్వడం కోసం ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ను ఏర్పాటు చేశామని, దాతలు సహాయం చేయవలసిందిగా తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ రమేష్ కుమార్ కోరారు.
ఆర్మీ ఫ్లాగ్ డేను హైదరాబాద్లో ఈనెల 7న ఉదయం11.30కు, సోమాజీ గూడలోని సైనిక్ ఆరమ్‌ఘర్ కాంప్లెక్స్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలు హాజరు కానున్నారు.