భారత త్రివిధ దళాలు గురువారం సాయంత్రం సంయుక్తంగా సమావేశం అయ్యారు. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పలు కీలక విషయాలపై మీడియాతో సమావేశం నిర్వహించారు. 'భారత సైనిక స్థావరాలపై పాక్ బాంబులు వేసింది. వాయుసేన వేగంగా స్పందించి వాటిని తిప్పికొట్టింది. ఫిబ్రవరి 27న ఉ.10 గంటలకు పాక్ విమానాలు చొరబడడాన్ని గమనించాము. వెంటనే వైమానిక దళం స్పందించింది. మిగ్ 21, సుఖోయ్, మిరాజ్ విమానాలు గగనతలంలోకి దూసుకెళ్లాయి.