ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోన్న సైనికులు
టోక్యో: కుండపోత వర్షాల కారణంగా దక్షిణ జపాన్‌లో 38 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. మరో 50 మంది జాడ తెలియకుండా పోయింది. హ్యోగో, ఒకయామా, గిఫు ఫుకౌకా, నాగసాకి, సాగా, హిరోషిమా, టాట్టోరీ తదితర ప్రాంతాల్లో జపాన్ మెటియోరాలాజికల్ ఏజెన్సీ(జేఎంఏ) హైఅలర్ట్ ప్రకటించింది. సహాయక చర్యల్లో భాగంగా 650 మంది భద్రతా సిబ్బందిని ముంపు ప్రాంతాలకు పంపించింది. సుమారు 40 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
భారీ వర్షాల వల్ల పలుచోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశముందని జేఎంఏ హెచ్చరించింది. జపనీయుల ద్వీపసమూహం గురువారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా జలమయమైంది. ఆదివారం వరకు వర్షపాతం నమోదవుతుందని జేఎంఏ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం గంటకు 8 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతుందని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment