
ఇరోం షర్మిల మళ్లీ అరెస్టు
ఇంఫాల్: సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలని 14 ఏళ్లుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఇరోం షర్మిలను పోలీసులు శుక్రవారం మళ్లీ అరెస్టు చేశారు. ఆమెపై ఆత్మాహత్యాయత్నం అభియోగాలను తిరస్కరించిన కోర్టు, షర్మిలను గురువారం విడుదల చేసింది. ఆమె విడుదలైన తర్వాత మళ్లీ నిరశనకు దిగారు. దాంతో మళ్లీ అదే అభియోగంపై పోలీసులు అరెస్టు చేశారు. అదే అభియోగంపై అరెస్టు చేసినప్పటికీ, ఇది వేరే కేసు అని తెలిపారు.