ఆ దీక్షకు పదిహేనేళ్లు | manipur iron lady irom sharmila deeksha 15th year | Sakshi
Sakshi News home page

ఆ దీక్షకు పదిహేనేళ్లు

Published Wed, Nov 4 2015 1:44 AM | Last Updated on Tue, Oct 2 2018 8:44 PM

ఆ దీక్షకు పదిహేనేళ్లు - Sakshi

ఆ దీక్షకు పదిహేనేళ్లు

సందర్భం

మణిపూర్ సాయుధ బలగాల ప్రత్యేకాధికార చట్టం రద్దు కోసం ఒక స్త్రీ అన్నాహారాలు, మంచి నీళ్లు తీసుకోకుండా 700 వారాలుగా పోరాటం సలుపుతున్న ఘటన మానవాసక్తిని కలిగించకపోవడం బాధాకరం.

తడిసిమోపిడన్ని  వార్తా కథ నాలు ఇప్పటికే అల్లేశారు. లెక్కలేనన్ని కాలమ్‌లు రాసే శారు. బోలెడన్ని నిజనిర్ధార ణలు, బోలెడు విశ్లేషణలు పూర్తయ్యాయి. ఆ అమ్మాయి కథవెనుక ఉన్న రెండు వెర్షన్ లను ప్రపంచ జర్నలిస్టు మిత్రులు ఇకచాలు బాబో అన్నంత విస్తృతంగా ఇప్పటికే చూపించేశారు. కానీ నేను ఈరోజు ఈ కథనాన్ని ఒక జర్నలిస్టుగా రాయడం లేదు. జీవితంలో కాస్సేపు నా జర్నలిస్టు ఉడుపులను వదిలేస్తు న్నందుకు నా సహచరులకు క్షమాపణ చెబుతున్నాను. వృత్తిలో ఎన్నడూ ఏకపక్ష ధోరణిని కలిగి ఉండరాదని నాకు జర్నలిజం అధ్యయనం బోధించింది. కానీ ఆ నీతిని నేను ఇవ్వాళ ఉల్లంఘిస్తున్నాను. ఈరోజు నేను ఉద్దేశపూర్వకంగానే పాక్షిక దృక్పథంతో ఉండాలనుకుం టున్నాను. ఇవ్వాళ ఒక పక్షం కథనాన్నే చెప్పాలనుకుం టున్నాను. అది ఇరోమ్ షర్మిల గాథ.

పరమ నిరంకుశ పూరితమైన సాయుధ బలగాల ప్రత్యేకాధికార చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ)పై ఇరోమ్ షర్మిల చేస్తున్న అలుపెరుగని పోరాటం మరో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా నేను ఈ కథనాన్ని రాస్తు న్నాను. ఆమె పోరాటం 2000 నవంబర్‌లో ప్రారంభ మైంది. మణిపూర్ చరిత్రలో మాయని మచ్చలా మిగిలి పోయిన రోజది. మణిపూర్‌లోని ఇంఫాల్ లోయలో ఉన్న మలోమ్ పట్టణం ఆరోజు దారుణ మారణకాండకు నెలవైంది. భారత పారామిలటరీ బలగాల్లో ఒకటైన అస్సాం రైఫిల్స్ దళం బస్టాపులో వేచి ఉంటున్న ప్రయా ణికులపై కాల్పులు జరిపి పది మంది అమాయకులను పాశవికంగా కాల్చి చంపింది. మృతులలో మహిళలు, సీనియర్ పౌరులు, మైనర్ పిల్లలు ఉన్నారు. ఆ పది మంది అమాయక ఆత్మలు పెట్టిన విలాపం సాయుధ బలగాలు చిందించిన రక్తధారల్లో కొట్టుకుపోయింది. ఆ వీధి ఇప్పుడు భయంకర మౌనం పాటిస్తూ ఉండవచ్చు కానీ క్రూరమైన ఎన్‌కౌంటర్‌కు అది సాక్షీభూతంగా నిలి చిపోయింది. దానికి లెసైన్స్ ఇచ్చింది సాయుధ బల గాల ప్రత్యేకాధికార చట్టం.

ప్రతి గురువారం లాగే ఇరోమ్ చాను షర్మిల ఆ రోజు కూడా ఉపవాస దీక్షలో ఉండింది. కాని ఆ రోజు నుంచి ఆమె ఉపవాసం కొనసాగుతూనే ఉంది. 15 ఏళ్లు పూర్తయినా ఆమె నిరాహార దీక్ష ఆగటం లేదు. అన్నా హజారే 12 రోజులపాటు సాగించిన దీక్ష జాతిని కదిలిం చింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ షర్మిల 15 ఏళ్లుగా సాగిస్తున్న సుదీర్ఘ పోరాటం జనం జ్ఞాపకాల్లో కలిసిపోయింది. ఒక వ్యక్తి అన్నా హారాలు, నీళ్లు తీసుకోకుండా 700 వారాలుగా పోరాటం సలుపుతుండటం ఇప్పుడు మానవాసక్తిని కలిగించక పోవడం బాధాకరం.

సాయుధ బలగాల ప్రత్యేకాధికార చట్టం నిబంధ నల ప్రకారం వారంట్ లేకుండా సైన్యం దాడులు నిర్వహించవచ్చు. సాధారణ సైనికులకు కూడా ఈ చట్టం తిరుగులేని రక్షణ కల్పిస్తోంది. ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. అనుమానం వచ్చినా సరే అదుపులోకి తీసు కోవచ్చు. బలప్రయోగం కూడా చేయవచ్చు.
 ఈరోజు ప్రముఖ వార్తా వెబ్‌సైట్లను చూస్తుంటే ఒక వార్త కనిపించింది. ‘భారత్ ప్రపంచంలోనే 7వ అత్యంత విలువైన జాతీయ బ్రాండ్ కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. 2.1 బిలియన్ డాలర్లతో ఇండియా బ్రాండ్ విలువ 32 శాతం పెరుగుదల నమోదు చేసింది.’

అత్యంత విలువైన జాతి? నిజమే కావచ్చు. ఎందు కంటే ఆర్థికవ్యవస్థ మానవ వేదనను ఎన్నటికీ పరిగణన లోకి తీసుకోదు. బహుశా ఈ దేశంలో మానవ ప్రాణాల కంటే కరెన్సీకే ఎక్కువ విలువ ఉంటోందేమో మరి. ఈ దశాబ్దిన్నర కాలంలో ప్రభుత్వాలు మారాయి. ఆమె నిరాహారదీక్షపై అనేక సంప్రదింపులు జరిగాయి. కానీ 15 ఏళ్ల తర్వాత కూడా దానికి ఒక తార్కిక ముగింపు లభించడం లేదు. ఆమె పోరాటం చాలామందికి రాజ కీయ ప్రయోజనాలకు ఉపయోగపడి ఉండవచ్చు. కానీ గార్డుల పహారాలో ఉన్న ఆ ఆసుపత్రి గది ఇరోమ్ షర్మి లకు శాశ్వత ఖైదుగా మారిపోయింది. ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటోందన్న ఆరోపణపై పదేపదే ఆమె అరెస్టులకు గురవుతూనే ఉన్నారు.
 ఈ మొత్తం ఉదంతంలో లోపం ఎక్కడుంది? ప్రతి ఏడాది ఆమె ఉద్యమాన్ని, పోరాటాన్ని తలుచుకుంటూ అనేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, దురదృష్టవశాత్తూ మనం ఈవిషయంలో మరింత చేయలేకపోతున్నావేమో! ఇరోమ్ షర్మిలపై, ఈశాన్య భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై వందలాది వ్యాసాలు రాసి ఉంటారు. వారిలో నేనూ ఒకడిని. ఈ పదిహేనేళ్ల కాలంలో ఆమెకు దక్కిందేమిటి? ‘మణిపూర్ ఉక్కుమహిళ’, ‘ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ నిరా హార దీక్షాపరురాలు’, ‘ఠాగూర్ శాంతి బహుమతి’.  ఒక మనిషి ఆశయాన్ని ఫలింపచేయలేని పనికిరాని అవా ర్డులూ, గుర్తింపులు ఇవి. 28 ఏళ్ల ప్రాయంలో అత్యంత వేదనామయమైన పోరాటం మొదలెట్టిన షర్మిలకు ఇప్పుడు 43 ఏళ్లు. విషాదం ఏమిటంటే, ప్రభుత్వ పాలనాతీరును మార్చడంలో వైఫల్యం పొందిన అద్భుత స్త్రీమూర్తిగా ఆమె మిగిలిపోవడమే.

మనం కేవలం తలుపు తట్టగలం. కానీ తాళాన్ని తెరవవలసింది వ్యవస్థ మాత్రమే. మనం తలుపులు బద్దలు కొట్టవచ్చు. కానీ మనపై వ్యవస్థా వ్యతిరేకులనే ముద్రపడుతుంది. బహుశా ఇది చైతన్యవంతమైన కార్య క్రమాలు చేపట్టడానికి కాస్త ప్రోత్సాహం అందించ వచ్చు. మనం చేయవలసింది ఏమిటంటే, షర్మిల ఇప్పటికీ బలవంతంగా ఆహారం తీసుకుంటుండగా.. మన శాసనకర్తలు ఈ సమస్యపై మూసిన తలుపుల మధ్య అల్పాహారం తీసుకుంటూ, భోంచేస్తూనే చర్చలు జరుపుతూ అంతిమ పరిష్కారం వెదికేంతవరకు ఓపి కగా మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవడమే.
 (మణిపూర్‌లో సాయుధ బలగాల ప్రత్యేకాధికార చట్టం రద్దు డిమాండ్‌తో ఇరోమ్ షర్మిల చేస్తున్న ఆమ రణదీక్షకు 15 ఏళ్లు అయిన సందర్భంగా...)
 (countercurrents.org సౌజన్యంతో...)


 వ్యాసకర్త ఈశాన్య భారత జర్నలిస్టు, రచయిత  షమీమ్ జకారియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement