
న్యూఢిల్లీ: ఆర్మీ, వాయు, నౌకాదళ సేనలు కలిసి ఒకే జట్టుగా పనిచేస్తాయని దేశ తొలి త్రివిధ దళాధిపతి(సీడీఎస్)గా నియమితులైన జనరల్ బిపిన్ రావత్ అన్నారు. సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నరవాణే, వాయుసేన అధిపతి రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా, నౌకాదళ అధిపతి కరంబీర్ సింగ్‌తో పాటు పలువురు సీనియర్ అధికారులతో కలిసి ఆయన ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చదవండి: 'సీడీఎస్‌గా భవిష్యత్ వ్యూహాలు రచిస్తా: బిపిన్ రావత్'
ఈ సందర్భంగా ఆర్మీ, వాయుసేన, నౌకాదళంలో రాజకీయాల జోక్యంపై బిపిన్ రావత్ స్పందిస్తూ.. రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని పేర్కొన్నారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్న వారి సూచనల ప్రకారం పనిచేస్తామని ఆయన తెలిపారు. ఆర్మీ, వాయు, నౌకాదళ సేనలు మధ్య మరింత సమన్వయం కోసం కృషి చేయనున్నట్లు చెప్పారు. కాగా గతంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడానికి నేతలే కారణమంటూ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment