ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సైనిక సంక్షేమ నిధికి రూ.20 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ నెల 23న జరగనున్న ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో ఈ భారీ మొత్తాన్ని అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు త్రివిధ దళాలకు సంబంధించిన ఉన్నతాధికారిని మ్యాచ్‌కు అతిథిగా పిలిచి ఈ విరాళాన్ని అందించాలని బీసీసీఐ ఆలోచిస్తుంది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు ఉన్నతాధికారి తెలిపారు.
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలను బీసీసీఐ రద్దు చేసింది. ప్రారంభ వేడుకలకు అయ్యే ఖర్చు రూ. 15 కోట్ల(గతేడాది అయిన ఖర్చు)తో పాటు అదనంగా మరో ఐదు కోట్లు జతచేసి సంక్షేమ నిధికి ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. చెన్నై వేదికగా జరగనున్న ప్రారంభ మ్యాచ్‌లో ధోనీ, కోహ్లి సమక్షంలో భద్రతా దళాల అధికారులకు చెక్‌ను అందించనున్నారు. ఇక భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సందర్భంగా.. రాంచీ వన్డేలో ఆర్మీ క్యాప్‌తో బరిలో దిగిన టీమిండియా ఆటగాళ్లు.. మ్యాచ్ ఫీజును అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment