నెలాఖరున త్రివిధ దళాధిపతుల సమావేశం | Antony will hold a high-level meeting with the armed forces | Sakshi
Sakshi News home page

నెలాఖరున త్రివిధ దళాధిపతుల సమావేశం

Published Sun, Oct 20 2013 8:01 PM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM

Antony will hold a high-level meeting with the armed forces

 న్యూఢిల్లీ:  రక్షణ మంత్రి ఆంటోనీ ఈ నెల చివర్లో త్రివిధ దళాలతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ కేరన్ సెక్టార్‌లో ఆర్మీ 15 రోజులపాటు సాగించిన ఆపరేషన్‌పై ఎన్నో సందేహాలు నెలకొన్నందున ఈ అంశం ప్రధానంగా సమీక్షకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాక్ వైపు నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదుల చొరబాటును తాము భగ్నం చేశామని ఆర్మీ 15 రోజుల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత ప్రకటించింది. అయితే ఈ ఆపరేషన్లో  ఒక్క ఉగ్రవాది కూడా దొరకకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరగబోయే సమావేశంలో కేరన్ అంశం చర్చకు రావచ్చని తెలుస్తోంది.

త్రివిధ దళాల అధిపతులు, రక్షణ శాఖ కార్యదర్శి ఆర్‌కే మాథుర్ సమావేశానికి హాజరుకానున్నారు. జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ కూడా పాల్గొనవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 21 నుంచి ఆర్మీ కమాండర్ల నాలుగు రోజుల సదస్సు జరగనుంది. ఇందులో కేరన్ ఆపరేషన్‌కు సంబంధించి ఎన్నో అంశాలు చర్చించి.. అలాంటివి భవిష్యత్తులో ఎదురైనప్పుడు ఎదుర్కొనేందుకు వ్యూహాలు రూపొందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement