
వారి వల్లే మనం ఈ స్థితిలో ఉన్నాం: ధోని
ఢిల్లీ: దేశంలో భావప్రకటన స్వేచ్ఛపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని స్పందించాడు. భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ.. జేఎస్యూలో జాతీయవాద వ్యతిరేక నినాదాల వివాదం నేపథ్యంలో సైన్యం సేవలను గుర్తు చేయడం గమనార్హం.
సాయుధ బలగాల మూలంగానే మనం భావప్రకటన స్వేచ్చపై చర్చించుకునే స్థితిలో ఉన్నామని ధోని ట్విట్టర్ ద్వారా సైన్యం సేవలను గుర్తు చేశాడు. స్వప్రయోజనాల కంటే ముందుగా దేశం కోసం పాటుపడేలా ప్రేరణ, శిక్షణ పొందిన ప్రత్యేక బలగాలు, కమెండో యూనిట్లలో పనిచేసే సైనికులు కూడా మన లాగా సాధారణ పౌరులేనని ధోని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
As v have this debate on freedom of speech our forces r making sure v stay in position to keep debating.
— Mahendra Singh Dhoni (@msdhoni) February 21, 2016
Spl forces and commando unit's r normal ppl like u and me who r highly motivated and trained to put the interest of the nation before self
— Mahendra Singh Dhoni (@msdhoni) February 21, 2016