చేతిరాత కూడా వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుంది. కావాలంటే మీరు సెల్ఫ్‌చెక్ చేసుకోండి. మీ చేతిరాత బట్టి మీరేమిటో స్వయంగా తెలుసు కోండి. ఇది సరదాగానే కానీ నిజాయితీగా సమా ధానాలు ఇవ్వడం కూడా ముఖ్యమే. ముందుగా మీ స్వదస్తూరీతో రాసిన దానిని ఎదురుగా ఉంచు కోవడం మరువకండి.
1. మీ చేతిరాత ఇలా ఉంటుంది
ఎ) వాలుగా.. బి) నిటారుగా.. సి) ఎడమవైపు వొంపుగా..
2. మీ రాతలో అక్షరాలు..
ఎ) గొలుసుకట్టు బి) పదాలు విడిగా.. సి) పొడి అక్షరాలు
3. వాక్యాలు ఎంత దగ్గరగా ఉంటాయి
ఎ) దూరంగా.. బి) పొందికగా.. సి) మరీ దగ్గరగా..
4. మీరు రాసినప్పుడు వాక్యాలు పేజీలో ఏ దిశగా ఉంటాయి?
ఎ) కింద నుంచి పై భాగానికి..
బి) తిన్నగా గీత గీసినట్టు.. సి) ఏటవాలుగా..
5. మొత్తంగా మీ దస్తూరీని చూస్తే ఎలా కనిపిస్తుంది?
ఎ) అందంగా.. పొందికగా.. బి) స్పష్టంగా.. పొడిపొడిగా
సి) భారంగా.. సంక్లిష్టంగా..
మీరిచ్చే సమాధానాలు బట్టి మీ చేతిరాతను ఇలా విశ్లేషించుకోవచ్చు.
1. అక్షరాలు ఎడమవైపు వాలుగా ఉంటే మీరు బిడియస్తులు. తిన్నగా ఉంటే ఎదుటివారిని ఆకట్టుకునే తత్త్వం ఉన్నవారు. అక్షరాలు కుడి వైపు వాలుగా ఉంటే గట్టి స్వభావం, సొంత నిర్ణయాల మీద ఆధారపడేవారు.
2. గొలుసుకట్టు రాత అయితే మీరు మంచి మాటకారి. విడి పదాలుగా రాస్తే మీరు బిడియస్తులు. పొడి అక్షరాలయితే మీరు తెలివిగా, స్పష్టంగా వ్యవహరించే స్వభాగం గలవారు.
3. వాక్యాల మధ్య దూరం ఎక్కువయితే మీరు ఏకాంతాన్ని ఇష్టపడతారు. పొందికగా రాసేవారయితే డబ్బు దుబారా చేసేవారు, ఎక్కువ మాట్లాడేవారు. బాగా దగ్గరగా రాస్తే మీరు చాలా ఆర్గనైజ్డ్‌గా వ్యవహరిస్తారు.
4. వాక్యాలు కింది నుంచి పైకి వెళ్తుంటే మీరు చాలా ఎనర్జిటిక్‌గా, ఆశావాదిగా, స్పష్టమైన అవగాహన ఉన్నవారిగా భావించవచ్చు. వాక్యాలు తిన్నగా రాస్తే మీరు ఒత్తిడికి లోనవుతుండవచ్చు. కింది వైపు వాలుగా ఉంటే మీరు దృఢచిత్తం గలవారిగా, ఒంటరితనాన్ని ఇష్టపడే వారిగా పరిగణించవచ్చు.
5. మీ దస్తూరీ పొందికగా ఉంటే మీరు సున్నిత స్వభావులని, మొహమాటస్తులని, ఆధ్యాత్మిక భావనలు గలవారిగా భావించ వచ్చు. స్పష్టంగా రాసేవారయితే పట్టుదల, దృఢచిత్తం గలవారవుతారు. రాత భారీగా కనిపిస్తుంటే, మీరు ఎనర్జిటిక్‌గా, చలాకీగా, ఏ పరిస్థితులకయినా ఇమిడిపోయే తత్త్వం గలవారిగా పరిగ ణించవచ్చు.
మీ రాతలో మీరు
Published Fri, Mar 2 2018 5:58 AM | Last Updated on Fri, Nov 9 2018 6:22 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment