చేతిరాత పుస్తకాలు పంపిణీ చేస్తున్న నిర్వాహకులు
- చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్
జగదేవ్‌పూర్: చేతిరాత విద్యార్థుల తలరాత మారుస్తుందని చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ అన్నారు. సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు చేతిరాతపై గురువారం అవగాహన కల్పించారు. సిద్దిపేటకు చెందిన ఫయాజ్ ఆహ్మద్ విద్యార్థులకు 210 చేతిరాత పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎజాజ్ ఆహ్మద్ విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ చేతిరాతపై అవగాహన కల్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల చేతిరాత బాగుంటే భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగడం ఖాయమన్నారు. చదువు ఎంత ముఖ్యమో, రాత కూడా అంతే ముఖ్యమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ భాగ్య, ఎస్‌ఎంసీ చైర్మన్ తుమ్మ కృష్ణ, వీడీసీ అధ్యక్షుడు కిష్టారెడ్డి, సభ్యులు వెంకటయ్య, భిక్షపతి, శ్రీశైలం, ఉపాధ్యాయులు కుమార్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు.