న్యూఢిల్లీ: ోక్‌సభ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ తాజాగా పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తోంది. ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ సమా బీజేపీ నేతలంతా ఆ కాలం ప్రజలకు చీకటి రోజులుగా అభివర్ణిస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,, లోక్‌సభ స్పీకర్ సైతం ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు.
అయితే దీనిని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఇండియా కూటమి సీనియర్ సభ్యులు గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఎమర్జెన్సీని చీకటి రోజులుగా స్పీకర్ పార్లమెంటులో ప్రస్తావించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓం బిర్లా చర్యలు పార్లమెంట్ విశ్వసనీయతను ప్రభావితం చేసే తీవ్రమైన విషయంగా కాంగ్రెస్‌పేర్కొంది పార్లమెంటరీ సంప్రదాయాలను అపహాస్యం చేయడంపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది.
ఈ మేరకు ఓ ప్రటకటన విడుదల చేసింది కాంగ్రెస్. "26 జూన్ 2024న మీరు లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపే సమయంలో సభలో సాధారణ స్నేహభావం ఏర్పడింది. అలాంటి సందర్భాలు ఏర్పడతాయి. కానీ తీరువాత సభా వతి నుంచి ఎమర్జెన్సీ ప్రకటన రావడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.
సభాపతి నుంచి ఇలాంటి రాజకీయ ప్రస్తావన రావడం పార్లమెంటు చరిత్రలో అసహజమైనది. కొత్తగా ఎన్నుకైన స్పీకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. పార్లమెంట్ పనితీరు గురించి చాలా విషయాలు చర్చించారు. దీనిని స్పీకర్ మమాట్లాడకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఓం బిర్లాను సూచించారు. ఇది స్పష్టంగా రాజకీయ ప్రస్తావన అని, తప్పకుండా ఖండిచాల్సిందని కేసీ వేణుగోపాల్ పేరుతో ప్రకటన విడుదలైంది.
ఇందిరా గాంధీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని దూషిస్తూ తీర్మానాన్ని చదివిన ఓం బిర్లా రెండు నిమిషాల మౌనం పాటించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment