న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. లోక్‌సభలో ప్రతిపక్షనేతగా బాధ్యతలు చేపట్టి నేటికి(శుక్రవారం) 100 రోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పందిస్తూ.. దేశ రాజకీయాల్లో ప్రేమ, గౌరవం, వినయాన్ని పునరుద్దరించడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. మరింత న్యాయబద్దంగా, ఆర్థికంగా సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి మనం కలిసి పని చేస్తున్న సమయంలో ఈ సూత్రాలే తనకు మార్గనిర్దేశం చేస్తాయని చెప్పారు.
కాగా ప్రతిపక్ష నాయకుడిగా అవతరించిన తర్వాత గాంధీ.. ఎన్నో గుర్తుండిపోయే ప్రసంగాలు, బీజేపీపై పదునైన వ్యాఖ్యలతో విమర్శలు చేశారు. పార్లమెంటులో ఎన్నో సమస్యలపై ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ సమస్యపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హింసాత్మక మణిపూర్ వంటి అనేక సంఘటనలు జరిగిన ప్రాంతాలను సందర్శించి, అక్కడి వారితో సమావేశమయ్యారు. అంతేగాక జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించి ప్రచారం నిర్వహించారు.
ఇదిలా ఉండగా పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్‌కు లోక్‌సభలో ప్రతిపక్షనేత పదవిని పొందేందుకు అర్హత లభించింది. దీంతో ఆ పదవిని రాహుల్ గాంధీకి ఇవ్వాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జూన్‌లో తీర్మానాన్ని ఆమోదించింది. ఇక ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నకల్లో వయనాడ్‌తోపాటు రాయ్‌బరేలీ నుంచి 3.5 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందిన అనంతరం ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment