కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి ఢిల్లీలో ప్రభుత్వం కొత్త బంగ్లాను కేటాయించినట్లు తెలుస్తోంది. సునేహ్రీ బాగ్ రోడ్‌లోని నెంబర్ 5 బంగ్లాను రాహుల్‌కు హౌస్ కమిటీ ఆఫర్ కల్పించినట్లు సమాచారం. ఈ మేరకు రాహుల్ సోదారి ప్రియాంకాగాంధీ కొత్త బంగ్లాను పరిశీలించి వెళ్లినట్లు వినికిడి. మరీ ఈ బంగ్లాను రాహుల్ అంగీకరిస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.
కాగా పరువునష్టం కేసులో రాహుల్‌కు సూరత్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో నిబంధనల ప్రకారం దిల్లీలోని 12-తుగ్లక్ లేన్‌లోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని పార్లమెంటరీ హౌసింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ ఆ ఇంటిని ఖాళీ చేసి.. 10 జన్‌పథ్‌లోని తన తల్లి, కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ నివాసానికి మారారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు.
ఇదిలా ఉండగా 2004లో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి గతేడాది ఏప్రిల్ వరకు రాహుల్.. 12- తుగ్లక్ లేన్ బంగ్లాలోనే ఉన్నారు. అయితే ప్రస్తుతం రాహుల్ లోక్‌సభలో ప్రతిపక్షనేతగా ఉన్నారు. దీంతో ఆయన కేబినెట్ హోదాను కలిగి ఉన్నందున టైప్ 8 బంగ్లాకు రాహుల్ అర్హుడు.
Comments
Please login to add a commentAdd a comment