ఢిల్లీ : దేశ వ్యాప్తంగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ బడ్జెట్‌పై ప్రసంగించారు.
కురుక్షేత్రంలో అభిమన్యుడిని బంధించి చంపారు. పధ్మవ్యూహలాంటి కమలం పార్టీ రూపంలో దేశంలో అధికారంలో ఉందని వ్యాఖ్యానించారు. కాబట్టే రైతులు కార్మికులు భయపడుతున్నారు. వారే కాదు.. దేశంలోని అన్నీ వర్గాలను బీజేపీ బయపెడుతోందని వ్యాఖ్యానించారు.
అప్పుడు ఫద్మవ్యూహాన్ని ఆరుగురు కంట్రోల్ చేశారు. ఇప్పుడు మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదానీ లాంటి వారు కంట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. అయితే రాహుల్ ప్రసంగంపై బీజేపీ ఎంపీలు అభ‍్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ ఓం బిర్లా సైతం రాహుల్ గాంధీ నిజాలు మాట్లాడాలంటూ అభ్యంతరం తెలిపారు.
#WATCH | Lok Sabha LoP Rahul Gandhi says, "My expectation was that this Budget would weaken the power of this 'Chakravyuh', that this Budget would help the farmers of this country, would help the youth of this country, would help the labourers, small business of this country. But… pic.twitter.com/t5RaQn4jBq
— ANI (@ANI) July 29, 2024
రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే
👉రాజకీయ ఏకస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోంది.
👉ట్యాక్స్ టెర్రరిజం ఆపేందుకు కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు.
👉బీజేపీ ప్రభుత్వం వల్ల అదానీ, అంబానీలకే లాభం
👉ఇంటర్న్‌షిప్‌ల వల్ల యువతకు ఒరిగేదేం లేదు.
👉కాళ్లు విరగొట్టి బ్లాంకెట్ వేసినట్లుంది
👉అగ్నివీరులను కేంద్రం మోసం చేస్తోంది
👉బడ్జెట్‌లో అగ్నివీర్‌ల పెన్షన్‌కు బడ్జెట్‌లో ఒక్కరూపాయి కేటాయించలేదు.
👉రైతు సంఘాలతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా లేదు
👉రైతులు పంటలకు కనీస మద్దతు కావాలను కోరుతున్నారు.. రైతుల విషయంలో ఇప్పటికీ కేంద్రం స్పష్టతలేదు
👉కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల్ని పట్టించుకోవడం లేదు
👉పదేళ్లలో 70 సార్లు ప్రశ్న పత్రాన్ని లీక్ చేశారు
👉పేపర్ లీకేజీతో యువత నష్టపోయారు
👉విద్య పైన కేవలం అతి తక్కువగా 2.5% బడ్జెట్ మాత్రమే కేటాయించారు
👉ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితులు లేవు
Comments
Please login to add a commentAdd a comment