అధిర్ రంజన్ చౌదరి, మమతా బెనర్జీ
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మతిస్థిమితం కోల్పోయారని, ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించడం సరికాదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. శనివారం ఆయన ‘ఏఎన్‌ఐ’ మాట్లాడుతూ.. బీజేపీ ఏజెంట్‌గా మమతా బెనర్జీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
‘పిచ్చివాళ్లపై స్పందించడం సరికాదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 700 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీదీ దగ్గర ఉన్నారా? ప్రతిపక్షాల మొత్తం ఓట్లలో కాంగ్రెస్‌కు 20 శాతం ఓట్ షేర్ ఉంది. ఆమె వద్ద అంత ఓట్ షేర్ ఉందా? బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు, ఆ పార్టీ ఏజెంట్‌గా వ్యవహరించేందుకు ఆమె ఇలా మాట్లాడుతున్నార’ని అధిర్ రంజన్ చౌదరి అన్నారు. (క్లిక్: మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు)
కాంగ్రెస్ పార్టీ జీవం కోల్పోయిందని, ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తామని మమత వ్యాఖ్యానించిన నేపథ్యంలో అధిర్ స్పందించారు. ‘కాంగ్రెస్‌పై ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు? కాంగ్రెస్ లేకుంటే మమతా బెనర్జీ లాంటి నాయకులు వెలుగులోకి వచ్చివుండేవారు ఉండేవారు కాదు. ఈ విషయాన్ని ఆమె గుర్తుంచుకోవాలి. బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు గోవాలో పోటీ చేసి కాంగ్రెస్‌ను ఓడించారు. గోవాలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచారు, ఇది అందరికీ తెలుస’ని మండిపడ్డారు. (చదవండి: ప్రాంతీయ పార్టీలతో బీజేపీ వ్యతిరేక కూటమి)
Comments
Please login to add a commentAdd a comment