న్యూఢిల్లీ: బీజేపీపై ఐక్యంగా పోరాడడానికి ముందుకురావాలంటూ తన రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్, వామపక్షాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతాబెనర్జీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, బీజేపీని ఢీకొనేందుకు తమతో చేతులు కలుపాలన్న మమత ఆఫర్‌పై కాంగ్రెస్ పార్టీ ఒకింత విముఖత వ్యక్తం చేసింది.
బెంగాల్‌లో బీజేపీ పుంజుకోవడానికి అధికార టీఎంసీయే కారణమని కాంగ్రెస్ నిందించింది. మమత వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరగా.. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఆమెపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మమతా బెనర్జీ మాట మీద నిలబడరని, ఆమె స్వభావమే అంతా అని ఆయన ఎద్దేవా చేశారు. ‘కొంతమంది మాట మీద నిలబడరు. ఒక మాట అని దాని నుంచి తప్పుకుంటారు. ఇదీ ఆమె స్వభావం. ఆమెకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఈ విషయమై మా అధిష్టానంతో మాట్లాడాలి. అయినా, బెంగాల్‌లో బీజేపీ ఎదుగుతుందంటే అందుకు మమత వైఫల్యమే కారణం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment