మమతా లేని ఇండియా కూటమిని ఊహించలేము: కాంగ్రెస్ | Canno Iimagine INDIA Block Without Mamata Banerjee: Congress | Sakshi
Sakshi News home page

మమతా లేని ఇండియా కూటమిని ఊహించలేము: కాంగ్రెస్

Published Wed, Jan 24 2024 3:22 PM | Last Updated on Wed, Jan 24 2024 3:47 PM

Canno Iimagine INDIA Block Without Mamata Banerjee: Congress - Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయంపై ప్రతిపక్ష ఇండియా కూటమి అయోమయ స్థితిలో పడేసింది. బెంగాల్‌లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు లేకుండా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తుందన్న మమతా ప్రకటనతో కూటమిలోని పార్టీలో టెన్షన్‌ మొదలైంది. దిది నిర్ణయంపై తాజాగా కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది.

ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ మాట్లాడుతూ.. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ లేని ఇండియా కూటమిని ఊహించలేమని అన్నారు, ఈ మేరకు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమికి టీఎంసీ బలమైన పిల్లర్‌గా అభివర్ణించారు. భవిష్యత్తులో టీఎంసీతో సీట్ల పంపకాల చర్చలు ఫలప్రదంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

బీజేపీని ఓడించాలని మమతా బెనర్జీ అన్నారు. ఓడించేందుకు మేము ఏమైనా చేస్తాం. మమతా బెనర్జీ, టీఎంసీ పార్టీ భారత కూటమికి బలమైన మూల స్తంభాలని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు. దిది  లేని భారత కూటమిని మనం ఊహించలేం. ఈ  కూటమి పశ్చిమ బెంగాల్‌లో కూటమిలా పోరాడుతుంది. రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ యాత్రలో భాగమయ్యేందుకు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలను ఆహ్వానిస్తన్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చాలాసార్లు కోరారు’ అని తెలిపారు.

సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయన్న జైరాం రమేష్‌.. పశ్చిమ బెంగాల్‌లో భారత కూటమి ఏకమై ఎన్నికల్లో పోటీ చేస్తుందని, దానిపై తమకు పూర్తి విశ్వాసముంది. బీజేపీని ఓడించేందుకు తాము ఏ అవకాశాన్ని వదలదని ఆయన అన్నారు. అదే ఆలోచనతో ప్రస్తుతం అస్సాంలో ఉన్న  భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశిస్తుందని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement