న్యూఢిల్లీ: లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు ప్రభుత్వ సాయంగా రూ. 6,000 అందించాలని కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి ప్రధాని మోదీకి లేఖ రాశారు. లాక్‌డౌన్ కారణంగా పేదలు, దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల వారికి ప్రభుత్వం నుంచి సాయం అందాల్సిన అవసరం ఉందన్నారు. అది కేవలం సహాయం మాత్రమే కాదని, దాని వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అన్నారు.
అర్హులైన పేదలందరికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే డబ్బు జమ చేయాలని ఆయన మోదీని కోరారు. లాక్‌డౌన్‌లో ఏ పనులూ లేకపోవడం వల్ల ప్రజలు తమ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడిందని, అందువల్ల సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా చెప్పారని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment