సాక్షి, హైదరాబాద్: కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై తాజాగా హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఎనిమిది మంది సభ్యులతో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.
వివరాల ప్రకారం.. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రక్రియపై కేంద్రం స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే శనివారం రామ్‌నాథ్ కోవింద్ ఛైర్మన్‌గా ఎనిమిది మంది సభ్యుల హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కేంద్రహోం అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ, గులాం నబీ ఆజాద్, సంజయ్ కొఠారి, హరీష్ సాల్వే, సుభాష్ కష్యప్, 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్‌కే సింగ్ ఉన్నారు. ఈ కమిటీకి కార్యదర్శిగా కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.
Govt of India constitutes 8-member committee to examine ‘One nation, One election’.
— ANI (@ANI) September 2, 2023
Former President Ram Nath Kovind appointed as Chairman of the committee. Union Home Minister Amit Shah, Congress MP Adhir Ranjan Chowdhury, Former Rajya Sabha LoP Ghulam Nabi Azad, and others… pic.twitter.com/Sk9sptonp0
ఇక, దేశంలోని వ్యక్తులు, సంస్థలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు సలహాలును హై లెవెల్ కమిటీ తీసుకోనుంది. కాగా, సాధ్యమైనంత త్వరగా కమిటీ సిఫార్సులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఏడు కీలక అంశాలపై సిఫారసు చేయాలని కమిటీకి లక్ష్యం
1. ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణపై సాధ్యాసాధ్యాల పరిశీలన. ఏ రాజ్యాంగ సవరణలు చట్టాలకు సవరణ చేయాలో సిఫారసు చేయాలి.
2. రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరా? కాదా?.
3. హంగ్ అసెంబ్లీ, అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపుల సమయంలో ఏం చేయాలనే దానిపై సిఫారసు ఇవ్వాలి.
4. ఒకేసారి దేశమంతా ఎన్నికలు సాధ్యం కానీ పక్షంలో, విడతలవారీగా ఎన్నికలను జరిపి సమ్మిళితం చేసే అవకాశంపై సిఫారసు.
5. ఒకేసారి ఎన్నికల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత మళ్లీ ఈ సైకిల్ దెబ్బ తినకుండా అవసరమైన చర్యలపై సిఫారసులు.
6. ఒకేసారి ఎన్నికలకు అవసరమయ్యే ఈవీఎంలు, వీవీప్యాట్లు, మానవ వనరుల అవసరమెంతో తేల్చాలి.
7. లోకసభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు.
ఇది కూడా చదవండి: మళ్ళీ అధికారంలోకి వస్తే వారిని తలకిందులుగా వేలాడదీస్తాం: అమిత్ షా
Comments
Please login to add a commentAdd a comment