Committee chairman
-
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై కమిటీ ఏర్పాటు.. సభ్యులు వీరే..
సాక్షి, హైదరాబాద్: కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై తాజాగా హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఎనిమిది మంది సభ్యులతో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. వివరాల ప్రకారం.. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రక్రియపై కేంద్రం స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే శనివారం రామ్‌నాథ్ కోవింద్ ఛైర్మన్‌గా ఎనిమిది మంది సభ్యుల హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కేంద్రహోం అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ, గులాం నబీ ఆజాద్, సంజయ్ కొఠారి, హరీష్ సాల్వే, సుభాష్ కష్యప్, 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్కే సింగ్ ఉన్నారు. ఈ కమిటీకి కార్యదర్శిగా కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. Govt of India constitutes 8-member committee to examine ‘One nation, One election’. Former President Ram Nath Kovind appointed as Chairman of the committee. Union Home Minister Amit Shah, Congress MP Adhir Ranjan Chowdhury, Former Rajya Sabha LoP Ghulam Nabi Azad, and others… pic.twitter.com/Sk9sptonp0 — ANI (@ANI) September 2, 2023 ఇక, దేశంలోని వ్యక్తులు, సంస్థలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు సలహాలును హై లెవెల్ కమిటీ తీసుకోనుంది. కాగా, సాధ్యమైనంత త్వరగా కమిటీ సిఫార్సులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏడు కీలక అంశాలపై సిఫారసు చేయాలని కమిటీకి లక్ష్యం 1. ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణపై సాధ్యాసాధ్యాల పరిశీలన. ఏ రాజ్యాంగ సవరణలు చట్టాలకు సవరణ చేయాలో సిఫారసు చేయాలి. 2. రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరా? కాదా?. 3. హంగ్ అసెంబ్లీ, అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపుల సమయంలో ఏం చేయాలనే దానిపై సిఫారసు ఇవ్వాలి. 4. ఒకేసారి దేశమంతా ఎన్నికలు సాధ్యం కానీ పక్షంలో, విడతలవారీగా ఎన్నికలను జరిపి సమ్మిళితం చేసే అవకాశంపై సిఫారసు. 5. ఒకేసారి ఎన్నికల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత మళ్లీ ఈ సైకిల్ దెబ్బ తినకుండా అవసరమైన చర్యలపై సిఫారసులు. 6. ఒకేసారి ఎన్నికలకు అవసరమయ్యే ఈవీఎంలు, వీవీప్యాట్లు, మానవ వనరుల అవసరమెంతో తేల్చాలి. 7. లోకసభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు. ఇది కూడా చదవండి: మళ్ళీ అధికారంలోకి వస్తే వారిని తలకిందులుగా వేలాడదీస్తాం: అమిత్ షా -
కర్ణాటక ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా సీఎం బొమ్మై
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికలకు బీజేపీ సమాయత్తమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను నియమించింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజెను ప్రకటించింది. ఎన్నికల ప్రచార కమిటీ సభ్యుడిగా మాజీ సీఎం యెడియూరప్పను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు కమిటీలకు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన లింగాయత్, వొక్కలిగ కులాలకు చెందిన బొమ్మై, కరంద్లాజెలకు సారథ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా బీజేపీ జాతీయ నాయకత్వం సమతూకం సాధించేందుకు ప్రయత్నించింది. -
‘సత్తు’కే అవకాశం
♦ ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా వెంకటరమణారెడ్డి ♦ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడికే దక్కిన చైర్మన్ గిరీ ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తులేకలాన్ గ్రామానికి చెందిన సత్తు వెంకటరమణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ చైర్మన్‌గా దండికార్ రవి, సభ్యులుగా పొన్నాల జగదీశ్, ఎండీ జహీర్, చీమల జంగయ్య, జంబుల కిషన్‌రెడ్డి, సపవాట్ అనసూయ, ఓరుగంటి యాదయ్యగౌడ్, మచ్చ లక్ష్మయ్య, ఏనుగు బుచ్చిరెడ్డిలను నియమించారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి సత్తు వెంకటరమణారెడ్డి ముఖ్యఅనుచరుడు. -
రేషన్ కార్డులిక ‘స్మార్ట్’
శ్రీకాకుళం : ఇప్పటి వరకు నిత్యావసర సరకుల పంపిణీకి వినియోగించే రేషన్ కార్డులు మారనున్నాయి. వీటి స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సంబంధిత జీఓ 18ని ఈ నెల 1న రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. దీనిప్రకారం రాష్ట్రస్థాయిలో కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీలో ఎనిమిదిమంది సభ్యులుంటారు. కమిటీ చైర్మన్‌గా జె.సత్యనారాయణ వ్యవహరిస్తారు. మరో ఏడుగురు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. కార్డుల తయారీ, తదితర అంశాల బాధ్యతలను రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను 13 మంది ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. స్మార్ట్ కార్డుల తయారీలో మరింత నాణ్యతతో కూడిన కార్డులు, బహుళ ప్రయోజనం ఉండేలా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ స్మార్ట్ కార్డులను ప్రస్తుతం ఉన్న అన్ని కార్డు ల వినియోగదారులకు అందజేస్తారా? కొందరికేనా అనేది తెలియాల్సి ఉంది. నియమనిబంధనలు మరో 15రోజుల్లో విడుదల కానున్నాయి. స్మార్డు కార్డులో కొత్తగా ఆధార్ నంబరు, పింఛనుదారైతే వారి పింఛను ఐడీ నంబరు, ఫొటోతో కూడిన వ్యక్తిగత వివరాలు ఉంటాయి. -
న్యాయం జరగకపోతే ఆత్మహత్యే
-
అవని ధరలు ఆకాశానికి..
సత్తెనపల్లి:భూముల విలువల పెంపునకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో శనివారం నుంచి ధరలు భారీగా పెరగనున్నాయి. 2013 తరువాత భూముల ధరలు ప్రభుత్వం పెంచలేదు. రిజిస్ట్రేషన్ శాఖ ధరలతో పోల్చుకుంటే మార్కెట్ విలువ రెట్టింపుగా ఉంది. దీన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం, ఖాజానాకు ఆదాయం సమకూర్చే శాఖల్లో ఒకటైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా భూముల విలువలు పెంచి తద్వారా ఆదాయం పొందాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గ్రామస్థాయి నుంచి పట్టణం వరకు ధరల పెంపు ప్రతిపాదనలను అధికారులు మార్కెట్ విలువ రివిజన్ కమిటీ చైర్మన్, జిల్లా సంయుక్త కలెక్టర్‌కు సమర్పించారు. సబ్ రిజిస్ట్రార్ పెంపు ప్రతిపాదనలకు జేసీ ఆమోద ముద్ర వేశారు. పెంచిన విలువలపై ప్రజలు అభ్యంతరాలు తెలిపేందుకు రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో పొందుపరిచినా ప్రజల నుంచి పెద్దగా అభ్యంతరాలు రాలేదు. దీంతో జేసీ ఆమోదించిన ధరలే ఆగస్టు 1 నుంచి అమలు కానున్నాయి. అయితే రాజధాని కోర్ ఏరియా పరిధిలోని 29 గ్రామాల్లో భూముల ధరల పెంపు లేదు. మిగతా చోట్ల వ్యాల్యూని బట్టి 20 శాతం నుంచి 100 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. విలువలను నిర్ణయించింది ఇలా.. భూములను గ్రామీణ, పట్టణ ప్రాంతాలుగా విభజించి ప్రతిపాదించారు. గ్రామాల్లో మెట్ట, మాగాణి, తోటలు, నివాస స్థలాలుగా మారనున్న వ్యవసాయ భూములు, రహదారికి ఆనుకుని, సమీపాన ఉన్న, నివాస స్థలాల ప్రాతిపదికను పెంచారు. పట్టణంలో నివాస స్థలాలు, వాణిజ్య సముదాయాలు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న, స్థిరాస్థి వ్యాపారం బాగా జరుగుతున్న ప్రాంతాలు, ఇళ్ల స్థలాలు అనే ప్రాతిపదికన ధరలను నిర్ణయించారు. ప్రభుత్వ ఖజానాకు రూ.120 కోట్లు కొత్తపేట(గుంటూరు): జిల్లావ్యాప్తంగా 32 సబ్ రిజిస్ట్రారు కార్యాలయాలు ఉన్నాయి. ప్రభుత్వం లెక్కల ప్రకారం రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ నెలాఖరుకు రూ.120 కోట్ల ఆదాయం లక్ష్యం చేరవచ్చని అంచనా వేస్తున్నారు. గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని ఎనిమిది సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రభుత్వ లక్ష్యం రూ.40 కోట్లు ఇవ్వగా, మొదటి, రెండు వారాలు రూ.10 కోట్లు, మూడోవారం రూ.14 కోట్లు ఆర్జించగా, చివరివారం రూ.18 కోట్ల ఆదాయాన్ని పొందవచ్చని డీఐజీ బి.సత్యనారాయణ విలేకరులకు తెలిపారు. -
రబీకి నీరివ్వకుంటే ఎలా?
కాలువల మరమ్మతులు గురించి పట్టించుకోరు.. రబీలో వరికి నీరు ఇవ్వబోమని ఇప్పుడు చెబితే ఎలా.. ఇప్పటికే చాలా మంది రైతులు నారుపోసుకొని నాట్లు వేసుకుంటున్నారు.. సాగునీరు అందించని వారు వ్యవసాయశాఖ విత్తనాలు పంపిణీ చేస్తుంటే ఎందుకుఊరుకున్నారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు...కొందరు రైతుల వద్ద డబ్బులు తీసుకొని దొంగతూములు ఏర్పాటు చేస్తుంటే ఆయా అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోరు...ఇవి నాగార్జున సాగర్ లింగంగుంట్ల సర్కిల్ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ల ఆగ్రహావేశాలు. నరసరావుపేటరూరల్, న్యూస్‌లైన్: ఎన్ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం ‘వాలంతరి’(నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధిశాఖ క్షేత్రస్థాయి శిక్షణా సంస్థ) ఆధ్వర్యంలో నీటి పన్ను అంచనా, వసూలు, పంటల దిగుబడిపై నీటి పారుదల, రెవెన్యూ, వ్యవసాయ శాఖల సమన్వయ సమావేశం జరిగింది. వాలంతరి అధికారి శంకర్‌బాబు అధ్యక్షత వహించగా, ఎన్ఎస్పీ ఎస్ఈ సన్యాసినాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సాగునీటి వినియోగంపై రైతులందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. జూన్, జూలైలో నాట్లు వేసుకుంటే ఖరీఫ్ అనంతరం రబీలో వరిసాగుకు ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. పంట కాలువలకు మరమ్మతులు జరిగితేనే నీరు సక్రమంగా అందుతుందన్నారు. అనంతరం డిస్ట్రిబ్యూటరీ కమిటీ (డీసీ) చైర్మన్లు ఒక్కొక్కరుగా ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత అనుపాలెం డీసీ చైర్మన్ బాలసైదులు మాట్లాడుతూ రబీలో వరిసాగు వద్దని చెబుతున్నారు, వ్యవసాయశాఖ వరి వంగడాలను ఎందుకు పంపిణీ చేసినట్టు అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన వ్యవసాయ శాఖ ఏడీఏ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ డిసెంబర్ 10 నుంచి విత్తనాల పంపిణీ నిలిపివేశామని, అలాగే బహిరంగ మార్కెట్లో వరివంగడాలు అమ్మవద్దని దుకాణదారులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. దీనిపై డీసీ సభ్యులు మాట్లాడుతూ మార్చి 31 వరకు సాగునీరు విడుదల చేయాలని, లేకుంటే రైతులు ఇబ్బందులు పడతారని కోరారు. ఎన్ఎస్పీ ఎస్ఈ మాట్లాడుతూ అది అధికారుల చేతుల్లో లేదని, ఒకసారి నీటి విడుదల తగ్గించిన తరువాత పెంపు నిర్ణయం ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందన్నారు. త్రిపురాపురం మేజరు డీసీ చైర్మన్ గంగినేని చంద్రశేఖర రావు మాట్లాడుతూ సొంత నిధులతో రెండేళ్ళ క్రితం రూ.4 లక్షలు వెచ్చించి కాలువల్లో పూడికతీత పనులు నిర్వహిస్తే ఇంతవరకు బిల్లులు రాలేదన్నారు. ఐనవోలు డీసీ చైర్మన్ చంద్రయ్య మాట్లాడుతూ కాలువల మరమ్మతులకు తాను వెచ్చించిన నగదును మార్చి 31లోగా ఇవ్వకుంటే నిరాహారదీక్ష చేస్తానని, అదీ కాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. దీనిపై స్పందించిన ఎస్ఈ ఆవేశపడినందు వల్ల ప్రయోజనం ఉండదని, పరిస్థితులు గమనించాలన్నారు. అమరావతి మేజరు డీసీ చైర్మన్ యర్రగుంట్ల రమేష్ మాట్లాడుతూ మేజరు పరిధిలోని కెమైనర్ హెడ్ వద్ద కొందరు దొంగతూములు ఏర్పాటు చేసుకున్నారని, దీనికి డీఈ భరోసా ఇచ్చారని, అసలు తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎన్ఎస్పీ అధికారులు ఇలా వ్యవహరించడ భావ్యం కాదంటూ ఆరోపించారు. దీనిపై ఎస్ఈ మాట్లాడుతూ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. తుర్లపాడు మేజరు డీసీ చైర్మన్ ఉడతా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓగేరు, కుప్పగంజివాగుల పరిధిలోని కాలువలకు నీరు విడుదల చేస్తే ఎత్తిపోతల పథకాల వల్ల రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. ఎస్ఈ సమాధానం ఇస్తూ ఉన్నతాధికారుల అనుమతితో నీరు విడుదల చేస్తామన్నారు. సమావేశంలో వినుకొండ ఈఈ శ్రీనివాసరావు, నరసరావుపేట సర్కిల్ డీఈ రమణరావు, మాచర్ల ఈఈ బి.చిట్టిబాబు సత్తెనపల్లి ఈఈ నాగార్జున, వాలంతరి అధికారులు, డీసీ చైర్మన్లు పాల్గొన్నారు.