‘సత్తు’కే అవకాశం
♦ ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా వెంకటరమణారెడ్డి
♦ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడికే దక్కిన చైర్మన్ గిరీ
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తులేకలాన్ గ్రామానికి చెందిన సత్తు వెంకటరమణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ చైర్మన్‌గా దండికార్ రవి, సభ్యులుగా పొన్నాల జగదీశ్, ఎండీ జహీర్, చీమల జంగయ్య, జంబుల కిషన్‌రెడ్డి, సపవాట్ అనసూయ, ఓరుగంటి యాదయ్యగౌడ్, మచ్చ లక్ష్మయ్య, ఏనుగు బుచ్చిరెడ్డిలను నియమించారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి సత్తు వెంకటరమణారెడ్డి ముఖ్యఅనుచరుడు.