శ్రీకాకుళం : ఇప్పటి వరకు నిత్యావసర సరకుల పంపిణీకి వినియోగించే రేషన్ కార్డులు మారనున్నాయి. వీటి స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సంబంధిత జీఓ 18ని ఈ నెల 1న రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. దీనిప్రకారం రాష్ట్రస్థాయిలో కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీలో ఎనిమిదిమంది సభ్యులుంటారు. కమిటీ చైర్మన్‌గా జె.సత్యనారాయణ వ్యవహరిస్తారు. మరో ఏడుగురు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. కార్డుల తయారీ, తదితర అంశాల బాధ్యతలను రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను 13 మంది ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. స్మార్ట్ కార్డుల తయారీలో మరింత నాణ్యతతో కూడిన కార్డులు, బహుళ ప్రయోజనం ఉండేలా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ స్మార్ట్ కార్డులను ప్రస్తుతం ఉన్న అన్ని కార్డు ల వినియోగదారులకు అందజేస్తారా? కొందరికేనా అనేది తెలియాల్సి ఉంది. నియమనిబంధనలు మరో 15రోజుల్లో విడుదల కానున్నాయి. స్మార్డు కార్డులో కొత్తగా ఆధార్ నంబరు, పింఛనుదారైతే వారి పింఛను ఐడీ నంబరు, ఫొటోతో కూడిన వ్యక్తిగత వివరాలు ఉంటాయి.
రేషన్ కార్డులిక ‘స్మార్ట్’
Published Sat, Sep 5 2015 12:28 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement