కోల్‌కతా: దేశంలో లోక్‌సభ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అభ్యర్ధులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచార జోరును పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు, బహరంపూర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్ధి అధీర్ రంజన్ చౌదరి తన సొంత నియోజక వర్గంలో నిరసన సెగ తగిలింది.
బహరంపూర్‌లో ప్రచారం చేసి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అధీర్ రంజన్ చౌదరి వాహనాన్ని నిలిపివేశారు. గోబ్యాక్ గోబ్యాక్ అంటూ నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన అధిర్ రంజన్ సదరు నిరసన కారులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో నిరసనకారులు తమ చెంపని చూపిస్తూ కొట్టమని హెచ్చరిస్తున్న విజువల్స్ వెలుగులోకి వచ్చాయి.
అధీర్ రంజన్ తీరుపై పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బహరంపూర్‌లో మీ దౌర్జన్యం సరికాదు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయం మీలో స్పష్టంగా మీ చర్యల ద్వారా కనిపిస్తోంది. కానీ మా కార్యకర్తలను భయపెట్టడానికి కండబలం ఉపయోగించడం మీకు ఏమాత్రం సరైంది కాదని ట్వీట్‌లో తెలిపింది.
అయితే ఈ వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి స్పందించారు. ఇది నన్ను ఆపడానికి చేసిన పన్నాగం తప్ప మరొకటి కాదు. దీని వెనుక అధికార పార్టీ టీఎంసీ ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పని చేయకూడదని వారు కోరుకుంటున్నారు. గత ఏడాది జరిగిన ఓ ఎన్నికల్లో ఇలాగే వ్యవహరించారంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా 1999 నుంచి బహరంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుస విజయాన్ని సొంతం చేసుకుంటున్న అధీర్ రంజన్ చౌదరిపై అధికార పార్టీ టీఎంసీ తరుపున లోక్‌సభ అభ్యర్ధి ఇండియన్ మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను రంగంలోకి దించింది.
SHEER DISPLAY OF HOOLIGANISM BY ADHIR RANJAN CHOWDHURY
— All India Trinamool Congress (@AITCofficial) April 13, 2024
Your thuggery in Baharampur won't go unnoticed. Your fear of losing elections is pretty evident from your actions. But using muscle power to intimidate our workers won't help you in anyway!
SHAME! pic.twitter.com/eQFgFD0IRD
Comments
Please login to add a commentAdd a comment