ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం పార్లమెంటరీ కమిటీ ముందు ఎంపీ అధీర్ రంజన్ చౌదరి హాజరయ్యారు. ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. దీంతో బీజేపీ సభ్యుడు సునీల్ కుమార్ సింగ్ అధ్యక్షతన పార్లమెంట్ కమిటీ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ తన రిపోర్టును స్పీకర్‌కు సమర్పించింది.
ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని పట్టుబట్టాయి. ఈ క్రమంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టాయి. ఈ సందర్భంలో ఎంపీ అధీర్ రంజన్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని దృతరాష్ట్రునితో పోల్చుతూ గందరగోళం సృష్టించారు. దీంతో ఆగష్టు 11న ఆయనపై సస్పెన్షన్‌తో స్పీకర్ వేటు వేశారు.
పార్లమెంట్ కమిటీ ముందు తాజాగా హాజరైన అధీర్ రంజన్ చౌదరి.. ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. పార్లమెంట్‌లో ఆ రోజు అన్నటువంటి మాటలకు పశ్చాత్తాపపడుతున్నానని అన్నారు.
ఆగష్టు 11న సస్పెన్షన్ అయిన తర్వాత హాల్ నుంచి బయటకు వచ్చిన అధీర్ రంజన్ చౌదరి.. పార్లమెంట్‌లో ప్రజల తరుపున మాట్లాడేప్పుడు ఆవేదన ఉంటుందని, దాన్ని యాథావిధిగా బయటపెడతామని చెప్పారు. ఆ క్రమంలో మనసుకు ఏం అనిపిస్తే అది మాట్లాడుతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఇతర రాష్ట్రాల్నీ కేంద్ర పాలితంగా మారుస్తారా?.. జమ్ము విభజనపై సుప్రీం
Comments
Please login to add a commentAdd a comment