revoked
-
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దు
-
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్ ఎత్తివేత
ఢిల్లీ: ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు ప్రవేశపెట్టిన తీర్మాణంపై ధంఖర్ సానుకూలంగా స్పందించారు. ఎంపీ రాఘవ్ చద్దా ఇప్పటివరకు అనుభవించిన సస్పెన్షన్‌ను తగిన శిక్షగా పరిగణించాలని ఎంపీ జీవీఎల్ నరసింహరావు ప్రవేశపెట్టిన తీర్మాణంలో పేర్కొన్నారు. నేటి నుంచి రాఘవ్ చద్దా సస్పెన్షన్‌ను నిలిపివేయడాన్ని సభ పరిశీలించవచ్చని ధంఖర్‌ను కోరారు. AAP MP Raghav Chadha returns to the Parliament as his suspension was revoked by Rajya Sabha Chairman Jagdeep Dhankhar, after 115 days. pic.twitter.com/zDWWk80p2l — ANI (@ANI) December 4, 2023 తన సస్పెన్షన్‌ను రద్దు చేయడంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు. ఛైర్మన్ ధంఖర్ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఛైర్మన్ జగదీప్ ధంఖర్‌కు ధన్యవాదాలు తెలిపారు. "సుప్రీంకోర్టు జోక్యంతో నాపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు అయింది. నన్ను 115 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఆ సమయంలో ప్రజల గొంతును సభలో వినిపించలేకపోయాను. రాజ్యసభ ఛైర్మన్‌కు ధన్యావాదాలు తెలియజేస్తున్నాను" అని వీడియో సందేశంలో చెప్పారు. #WATCH | AAP MP Raghav Chadha's suspension revoked by Rajya Sabha Chairman Jagdeep Dhankhar on the motion moved by BJP MP GVL Narasimha Rao. pic.twitter.com/I0UlbnORTe — ANI (@ANI) December 4, 2023 దేశ రాజధాని ఢిల్లీ (సవరణ) బిల్లు-2023పై ప్రతిపాదిత సెలక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే కొందరు సభ్యుల పేర్లను చేర్చారంటూ గత వర్షాకాల సమావేశాల్లో రాఘవ్ చద్దాను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. రాఘవ్ చద్దాను సస్పెండ్ చేయాలంటూ పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. నిబంధనల ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన, ధిక్కార ఆరోపణలపై ఆయనపై సస్పెన్స్ వేటు పడింది. ఇదీ చదవండి: Madhya Pradesh: దిగ్విజయ్‌కు ఘోర పరాభవం.. -
అధీర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ రద్దు..
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం పార్లమెంటరీ కమిటీ ముందు ఎంపీ అధీర్ రంజన్ చౌదరి హాజరయ్యారు. ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. దీంతో బీజేపీ సభ్యుడు సునీల్ కుమార్ సింగ్ అధ్యక్షతన పార్లమెంట్ కమిటీ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ తన రిపోర్టును స్పీకర్‌కు సమర్పించింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని పట్టుబట్టాయి. ఈ క్రమంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టాయి. ఈ సందర్భంలో ఎంపీ అధీర్ రంజన్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని దృతరాష్ట్రునితో పోల్చుతూ గందరగోళం సృష్టించారు. దీంతో ఆగష్టు 11న ఆయనపై సస్పెన్షన్‌తో స్పీకర్ వేటు వేశారు. పార్లమెంట్ కమిటీ ముందు తాజాగా హాజరైన అధీర్ రంజన్ చౌదరి.. ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. పార్లమెంట్లో ఆ రోజు అన్నటువంటి మాటలకు పశ్చాత్తాపపడుతున్నానని అన్నారు. ఆగష్టు 11న సస్పెన్షన్ అయిన తర్వాత హాల్ నుంచి బయటకు వచ్చిన అధీర్ రంజన్ చౌదరి.. పార్లమెంట్లో ప్రజల తరుపున మాట్లాడేప్పుడు ఆవేదన ఉంటుందని, దాన్ని యాథావిధిగా బయటపెడతామని చెప్పారు. ఆ క్రమంలో మనసుకు ఏం అనిపిస్తే అది మాట్లాడుతామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఇతర రాష్ట్రాల్నీ కేంద్ర పాలితంగా మారుస్తారా?.. జమ్ము విభజనపై సుప్రీం -
Sujana : మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు
సాక్షి, అమరావతి: సుజనా చౌదరికి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ నిలిపివేస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘన్‌పూర్‌లోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట సుజనా చౌదరీ ఈ కాలేజీ ఏర్పాటు చేశారు. 2002లో ఏర్పాటు చేసిన ఈ కాలేజీ కింద ఏటా వంద మెడికల్ అడ్మిషన్లు యూనివర్సిటీ కౌన్సిలింగ్ ద్వారా కేటాయించేవారు. ఫిబ్రవరి 2017 నుంచి సీట్ల సంఖ్య 150కి పెరిగింది. ఈ కాలేజీ పలు అక్రమాలకు పాల్పడినట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) గుర్తించింది. 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెడికల్ కాలేజీని 2001-02లో నిర్మించగా 2012-13 విద్యా సంవత్సరం నుంచి ఈ కాలేజీలో మెడికల్ ఆడ్మిషన్లకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతించింది. ప్రస్తుతం ఈ కాలేజీలో 750 మంది MBBS విద్యార్థులు, 150 మంది PG విద్యార్థులు ఉన్నారు. మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉన్న ఆస్పత్రికి రోజూ ఔట్ పేషేంట్లు వస్తారు. ఆస్పత్రిలో 13 డిపార్ట్ మెంట్లు ఉన్నాయి. ప్రతీ ఏటా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని నేషనల్ మెడికల్ కమిషన్ వివిధ మెడికల్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ తనిఖీల్లో భాగంగా కాలేజీల్లో మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా? విద్యార్థుల సంఖ్యకు సరిపడా అధ్యాపకులు ఉన్నారా? కాలేజీల్లో ఉన్న టీచింగ్ ఆస్పత్రులకు పేషేంట్లు వస్తున్నారా? అన్న విషయాలను నేషనల్ మెడికల్ కమిషన్ టీం పరిశీలించింది. సుజనాకు సంబంధించిన ఈ మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పలు ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా మేనేజ్ మెంట్ వ్యవహరిస్తున్నట్టు తేలింది. దీంతో MCI ఈ కాలేజీకి నోటీసులిచ్చినట్టు తెలిసింది. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో కాలేజీ గుర్తింపు రద్దు చేసినట్టు సమాచారం. చదవండి: కీలక పరిణామం.. భారీగా ‘మార్గదర్శి’ చరాస్తుల జప్తు! -
నలుగురు లోక్‌సభ ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత
న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేశారు. తాజాగా నలుగురు లోక్‌సభ ఎంపీలపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేశారు స్పీకర్ ఓం బిర్లా. మరోవైపు.. విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో సోమవారం సభ రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత ధరల పెరుగుదలపై చర్చ చేపట్టారు. సభలో విపక్షాల ఆందోళనల నేపథ్యంలో సోమవారం ఉదయం అన్ని పార్టీల ఎంపీలతో సమావేశమయ్యారు స్పీకర్ ఓం బిర్లా. సభలో చర్చలు జరగాల్సిన సమయంలో ఆటంకాలు కలిగించటం దేశానికి నష్టం కలుగుతోందన్నారు స్పీకర్. సభామర్యాదను అంతా కలిసి కాపాడాలని పిలుపునిచ్చారు. సభలోకి ప్లకార్డులు తీసుకురావొద్దన్నారు. ఈ క్రమంలోనే నలుగురు సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు ప్రతిపాదనను సభ ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. దానిని ఆమోదించింది లోక్‌సభ. సస్పెన్షన్‌కు గురైన వారిలో కాంగ్రెస్ ఎంపీ మానికమ్ ఠాగూర్, జోతిమని, రమ్యా హరిదాస్, టీఎన్ ప్రతాపన్‌లు ఉన్నారు. ధరల పెరుగుదలపై ప్లకార్డులు పట్టుకుని నిరనసలు చేసిన క్రమంలో ఈ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. ఇదీ చదవండి: Amit Shah: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి మోదీ కాదా? అమిత్ షా క్లారిటీ -
మైనార్టీలో ప్రభుత్వం.. ఎమర్జెన్సీ ఎత్తివేత!
శ్రీ లంకలో పరిస్థితి మరింతగా దిగజారింది. ఒక్కో వ్యవస్థ దారుణంగా పతనమైపోతోంది. తాజాగా ఎమర్జెన్సీ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ప్రకటించడంతో పరిస్థితి మరింత అల్లకల్లోలంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చాక శ్రీ లంకలో ఈస్థాయి సంక్షోభం తలెత్తడం ఇప్పుడే కనిపిస్తోంది. ఆర్థిక సంక్షోభంతో మొదలై.. ప్రజలను ఆగమాగం చేస్తోంది. ప్రజా నిరసనలతో దేశం అట్టుడికి పోతుండగా.. మరోవైపు మంత్రుల రాజీనామా, మైనార్టీలోకి పడిపోయిన ప్రభుత్వంతో రాజకీయ సంక్షోభం కూడా తలెత్తింది. ఈ తరుణంలో మంగళవారం అర్ధరాత్రి ఎమర్జెన్సీని ఎత్తేస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించాడు. ► ప్రభుత్వం నుండి చట్టసభ సభ్యులు వాకౌట్ కావడంతో శ్రీలంక అధ్యక్షుడు ఎమర్జెన్సీ ఆర్డర్‌ను రద్దు చేశారు. దీంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రేట్లు ఆకాశాన్ని అంటాయి. చివరకు టీవీ ఛానెళ్లను, పత్రికలను సైతం మూసేశారు. శ్రీ లంకలో ఐపీఎల్ టెలికాస్టింగ్ ఆపేశారు. ► మందుల కొరతతో వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చివరకు ప్రాణాప్రాయ స్థితిలో ఉపయోగించే మందులకు సైతం కొరత ఏర్పడింది. దీంతో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతీ తెలిసిందే. ► ఇంకోవైపు ప్రభుత్వ కూటమి నుంచి మంది ప్రజాప్రతినిధులు బయటకు వచ్చేశారు. దీంతో 225 మంది సభ్యులున్న సభలో ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన 113 మ్యాజిక్ ఫిగర్‌కు మహీంద రాజపక్స ప్రభుత్వం దూరమైంది. ప్రభుత్వం మైనార్టీలో పడింది. ► శ్రీ లంక పరిస్థితులను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌తో పాటు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం సైతం నిశితంగా పరిశీలిస్తోంది. ఘటనపై దర్యాప్తు శ్రీ లంక పార్లమెంటు దగ్గర పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. అయితే ఆ నిరసనల్లో ముసుగులు ధరించిన సైనికుల బృందం.. బైక్‌లపై గుంపు గుండా వెళ్లడంపై శ్రీలంక ఆర్మీ చీఫ్ శవేంద్ర సిల్వా విచారణకు ఆదేశించినట్లు నివేదికలు వెల్లడించాయి. పార్లమెంటు ఆవరణలో జరిగిన నిరసనలో బైక్‌లపై వచ్చిన ఆర్మీ సైనికులకు, పోలీస్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు దృష్టికి రావడంతో ఆర్మీ కమాండర్ శవేంద్ర సిల్వా, ఐజిపిని ఘటనపై విచారణకు అభ్యర్థించినట్లు శ్రీలంక మీడియా తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ ఉంటుందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. -
‘బోనస్‌లు తిరిగి ఇచ్చేయండి’.. ఉద్యోగులకు కంపెనీ షాక్!
దేశంలోనే నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కంపెనీని ఏడాది మధ్యలో వీడుతున్న ఉద్యోగులను.. బోనస్ కింద చెల్లించిందంతా తిరిగి ఇచ్చేయమంటూ వేధిస్తోందన్న ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గినట్లు ప్రకటన ఇచ్చుకుంటున్నప్పటికీ.. అది ఉద్యోగులకు పూర్తి ఊరట ఇచ్చేదిగా లేదని తెలుస్తోంది!. తాజాగా భారత ఐటీ కంపెనీలు డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెసీఎల్పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. రిజైన్లు చేసి కంపెనీని వీడుతున్న ఉద్యోగులను ‘పర్ఫార్మెన్స్ బోనస్’ ఇచ్చిందంతా.. తిరిగి చెల్లించాకే బయటకు వెళ్లాలని కోరుతోంది. ఈ మేరకు హెచ్ఆర్ పాలసీలోని రూల్‌ను చూపించడంతో ఉద్యోగులు ఖంగుతింటున్నారు. ఈ విషయంపై ఐటీ ఎంప్లాయిస్ యూనియన్లను ఉద్యోగులు ఆశ్రయించినట్లు సమాచారం. లేబర్ మినిస్టర్ భూపేందర్ యాదవ్‌కి, హెచ్‌సీఎల్ చైర్‌పర్సన్‌కి సైతం లేఖలు రాశారు పుణే ఐటీ యూనియన్ ప్రతినిధి హర్మీత్ సలూజ. డబ్బులు తిరిగి చెల్లించని ఉద్యోగుల ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్లు, రిలీవింగ్ లెటర్లు ఇవ్వకుండా కంపెనీ వేధిస్తోందని సలూజ ఆ లేఖలో ప్రస్తావించారు. హెచ్‌సీఎల్ ప్రకటన అయితే హెచ్‌సీఎల్ మాత్రం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చుతోంది. ఉద్యోగులకు తెలియకుండా తామేం చేయట్లేదని పేర్కొంది. మంత్లీ బేసిస్ మీద చెల్లించే అడ్వాన్స్ విషయంలో హెచ్ఆర్ పాలసీ ప్రకారం.. అదీ ఉద్యోగులు సంతకాలు చేసిన కాలమ్ ప్రకారమే ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేసింది. నవంబర్ 2021న ఉద్యోగులకు పంపిన మెయిల్ ప్రకారం.. సెప్టెంబర్ 1, 2021 నుంచి మార్చ్ 31, 2022 మధ్య కంపెనీని వీడే ఉద్యోగులు ఎవరైనా సరే వాళ్ల నుంచి.. ఎంప్లాయి పర్ఫార్మెన్స్ బోనస్ (EFB) రికవరీ చేస్తామని తెలిపింది. ఇక వివాదాస్పదం కావడంతో ఆఘమేఘాల మీద ఆ పాలసీని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. వెనక్కి తగ్గలేదు! వివాదాస్పద ఈ పాలసీ విషయంలో హెచ్‌సీఎల్ ఒక స్పష్టమైన ప్రకటనంటూ ఇవ్వకపోవడం గమనార్హం. దశాబ్దానికి పైగా జూనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు జీతం కాకుండా.. అడ్వాన్స్‌గా చెల్లింపులు అందుకుంటున్నారు. అలాగే ఇకపై కంపెనీ మా ఉద్యోగుల కోసం ముందస్తు వేరియబుల్ చెల్లింపును కొనసాగిస్తుంది. అంతేకాదు డిసెంబర్ 22, 2021 నుంచి రికవరీలను కూడా మాఫీ చేసిందని హెచ్‌సీఎల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కానీ, ఇక్కడే గందరగోళం నెలకొంది. ఈఎఫ్‌బీ రికవరీ పాలసీని మాత్రమే హెచ్‌సీఎల్ వెనక్కి తీసుకుందని.. ఏపీఎంబీ (Advance Monthly Performance Bonus) విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సలూజ చెప్తున్నారు. ఈఎఫ్‌బీ అనేది ఉద్యోగులందరికీ వర్తించే బోనస్ కాగా.. ఏఎంపీబీ మాత్రం ప్రత్యేకించి ప్రాజెక్టుల కోసం పని చేసే ఉద్యోగులందరికీ జారీ చేస్తున్న బోనస్. సో.. రిజైన్ చేసిన ఉద్యోగులు ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్న మాట!. -
భయపెట్టే బోయింగ్‌కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు?
అతి పెద్ద విమానాలకు మరో పేరుగా స్థిరపడిన బోయింగ్ విమనాలు మళ్లీ భారత గగనతలంలో ప్రయాణానికి రెడీ అయ్యాయి. రెండున్నరేళ్ల నిషేధం తర్వాత బోయింగ్ ఫ్లైట్లను నడిపేందుకు విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతులు ఇచ్చింది. ప్రమాదాల జరగడం వల్లే జంబో విమానాల తయారీకి బోయింగ్ సంస్థ పెట్టింది పేరు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన విమానాలు ఏవియేషన్ సెక్టార్లో రాజ్యమేళాయి. అయితే బోయింగ్ 737 మ్యాక్స్ విమానంతో కథ అడ్డం తిగిరింది. యూరప్, అమెరికా, ఏషియా అని తేడా లేకుండా బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. దీంతో వరుసగా ఒక్కో దేశం ఈ విమానలను కమర్షియల్ సెక్టార్ నుంచి తొలగించాయి. భారత్ సైతం 2019 మార్చిలో బోయింగ్ విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఎప్పటి నుంచి రెండున్నరేళ్ల నిషేధం తర్వాత ఇటీవల బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడుపుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో స్పైస్ జెట్ సంస్థ సెప్టెంబరు చివరి వారం నుంచి బోయింగ్ విమానాలు నడిపేందుకు రెడీ అవుతోంది. మరోవైపు దుబాయ్ ఇండియా మధ్య సర్వీసులు అందిస్తున్న సంస్థలు సైతం బోయింగ్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ విమానాలపై ఉన్న నిషేధాన్ని ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాలు ఎత్తేయగా తాజగా ఆ జాబితాలో ఇండియా చేరింది. చైనా ఇప్పటికీ నిషేధాన్ని కొసాగిస్తోంది. పారదర్శకత ఏదీ బోయింగ్ విమానాల కమర్షియల్ ఆపరేషన్స్‌కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ అనుమతులు ఇవ్వడంపై ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అనుమతులు ఇవ్వడం, రద్దు చేయడం అనేది డీజీసీఏ సొంత వ్యవహారం కాదంటున్నారు. ఏ కారణాల చేత అనుమతులు రద్దు చేశారు ? విమానంలో ఏ లోపాలను గుర్తించారు ? వాటిని ఆ సంస్థ సవరించిందా లేదా ? అనే వివరాలు ప్రజల ముందు ఉంచకుండా ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం సరికాదంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బోయింగ్ విమానాలు తిరిగి అందుబాటులోకి రావడాన్ని కొందరు స్వాగతిస్తున్నారు. చదవండి: బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు -
ఎంపీల సస్పెన్షన్: సమావేశాలు బహిష్కరణ
ఢిల్లీ : రాజ్యసభలో 8 మంది సభ్యుల పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తి వేసేవరకు రాజ్యసభ సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నామని ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ మంగళవారం పేర్కొన్నారు. సభ్యులపై సస్పెన్షన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన సభ నుంచి వాకౌట్ చేశారు. ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ , తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యులు కూడా సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. 8 మంది సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తి వేసేవరకు రాజ్యసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ బిల్లులపై పునరాలోచించేవరకు సభలోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు.మరోవైపు సభ్యుల సస్పెన్షన్ పై తాను సంతోషంగా లేనని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. ఎంపీల ప్రవర్తన కారణంగానే చర్యలు తీసుకున్నామని.. ఏ సభ్యుడిపై కూడా వ్యతిరేకంగా వ్యవహరించడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. (చదవండి : 8 మంది ఎంపీల సస్పెన్షన్) కాగా వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం పలువురు విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి, డెప్యూటీ చైర్మన్ హరివంశ్‌తో అనుచితంగా ప్రవర్తించడం తెల్సిందే. బిల్లులను సభాసంఘానికి పంపించాలన్న తీర్మానంపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్‌ను తోసిపుచ్చడంతో ఆయన ముఖంపై రూల్ బుక్‌ను విసిరేయడం తెలిసిందే. అయితే రాజ్యసభలో ఈ అంశంపై రగడ సోమవారం కూడా కొనసాగింది. దీంతో సభా మర్యాదలకు భంగం కలిగించిన 8 మంది విపక్ష సభ్యులను సోమవారం సస్పెండ్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్, ఆప్ సభ్యులు సంజయ్ సింగ్, డోలాసేన్, కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ సత్వ, సయ్యద్ నాజిర్ హుస్సేన్, రిపున్ బోరా, సీపీఎం సభ్యులు కేకే రాగేశ్, ఎలమారమ్ కరీన్‌లను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు, హరివంశ్‌పై విపక్షపార్టీలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును చైర్మన్ వెంకయ్య నాయుడు తోసిపుచ్చారు. (చదవండి : ఎంపీల నిరసన : ఢిల్లీ పోలీసుల ఓవర్ యాక్షన్) -
నయీం కేసులో.. ఆ ఇద్దరిపై సస్పెన్షన్ ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన ఐదుగురు అధికారుల్లో ఇద్దరిపై వేటు ఎత్తేస్తూ రాష్ట్ర హోంశాఖ, డీజీపీ కార్యాలయం ఆదేశాలు జారీ చేశాయి. నయీంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్, ఏసీపీలు మలినేని శ్రీనివాస్‌రావు, చింతమనేని శ్రీనివాస్‌తోపాటు ఇద్దరు ఇన్స్పెక్టర్లను గతేడాది అప్పటి డీజీపీ అనురాగ్ శర్మ సస్పెండ్ చేశారు. గతేడాది మే నుంచి వీరంతా సస్పెన్షన్‌లోనే ఉంటూ వచ్చారు. తాజాగా తమ సస్పెన్షన్ ఎత్తివేసి, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్, ఏసీపీ మలినేని శ్రీనివాస్‌రావు డీజీపీ మహేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనిని పరిశీలించిన డీజీపీ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం వీరిద్దరినీ తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఆదేశాలు వెలువడ్డాయి. అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది ఉత్తర్వులు వెలువరించగా, ఏసీపీ మలినేని శ్రీనివాస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీరిద్దరు శుక్రవారం ఉదయం డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. సరిగ్గా ఏడాది తర్వాత తిరిగి విధుల్లోకి చేరినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే వీరికి ప్రస్తుతం ఏ పోస్టింగ్స్‌నూ డీజీపీ కార్యాలయం కేటాయించలేదు. అందుకు సంబంధించి త్వరలోనే ఆదేశాలిస్తారని రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయ వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ కాకుండా మిగిలిన ముగ్గురు అధికారులు సస్పెన్షన్‌లోనే ఉన్నారని, ప్రస్తుతం వీరి విజ్ఞప్తులు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. విచారణ జరుగుతోంది... అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్‌రావు వ్యవహారంపై కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ నియమించిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి సమ్మిరెడ్డి నేతృత్వంలో విచారణ జరుగుతోందని హోంశాఖ తెలిపింది. నయీం కేసులో ఆరోపణల నేపథ్యంలో కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ అనంతరం నివేదిక వస్తుందని, ఆ తర్వాత నివేదికలో పొందుపరిచిన అంశాలను బట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హోంశాఖ అధికారులు తెలిపారు. ఇకపోతే ఏసీపీ మలినేని శ్రీనివాస్‌రావు వ్యవహారంలో రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయం అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఎస్పీ ర్యాంకు అధికారి లేదా డీఐజీ ర్యాంకు అధికారి ఏసీపీ శ్రీనివాస్‌రావు వ్యవహారంలో మౌఖిక విచారణ జరిపి, నివేదిక అందిస్తారని హెడ్‌క్వార్టర్స్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ నివేదిక అనంతరం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపాయి. -
భారత్‌కు రావాలని ఉంది : మాల్యా
న్యూఢిల్లీ : బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా త్వరలోనే భారత్‌కు తిరుగుముఖం పట్టనున్నారట. తనకు భారత్‌కు రావాలని ఉందని పేర్కొంటూ.. పాస్‌పోర్టు రద్దును ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. తన పాస్‌పోర్టును ప్రభుత్వం రద్దు చేసిన క్రమంలో తాను భారత్‌కు రాలేకపోతున్నానని విజయ్ మాల్యా పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన ఓ అప్లికేషన్ ఫారంను మాల్యా ఢిల్లీ పాటియాల కోర్టు ముందు ఉంచినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది మార్చిలో మాల్యా పాస్ పోర్టును ప్రభుత్వం రద్దు చేసింది. 2000 ఫెరా ఉల్లంఘన కేసును కూడా ఉపసంహరించుకోవాలని మాల్యా అభ్యర్థిస్తున్నారు. రద్దైన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్(కేఏఎల్) ప్రమోటర్ విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా గతవారమే ముంబాయిలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేసింది. అదేవిధంగా దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ అగర్వాల్‌పై కూడా సర్వీసు టాక్స్ కేసు దాఖలు చేసింది. ఈ లిక్కర్ కింగ్‌కు సంబంధించిన రూ.6,630 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రకటించింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన అన్ని రకాల ఆస్తులు ఫామ్హోజ్, ఫ్లాట్స్‌ను ఈడీ జప్తుచేసింది. వివిధ బ్యాంకుల వద్ద తీసుకున్న రూ.9400 కోట్ల రుణాల చెల్లింపుల విషయంలో మాల్యా విఫలమవడంతో ఇప్పటికే రూ.1,141 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఈడీ, తాజాగా జప్తుతో మాల్యా ఆస్తుల విలువ రూ.8,044 కోట్లకు చేరుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) ప్రకారంగా అలీబాగ్ వద్ద ఉన్న రూ.25 కోట్ల విలువైన భవంతితోపాటు బెంగళూరులో రూ.565 కోట్ల విలువైన కింగ్‌ఫిషర్ టవర్, రూ.800 కోట్ల విలువైన మాల్, అపార్ట్మెంట్లు, పలుబ్యాంకుల్లో ఉన్న రూ.10 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, యూఎస్ఎల్, యునైటెడ్ బ్రెవరేజ్ లిమిటెడ్, మెక్‌డోనాల్డ్ హోల్డింగ్ కంపెనీ, యూబీహెచ్‌ఎల్‌లో ఉన్న వాటాలను ఈడీ అటాచ్ చేసింది. వీటి నికర విలువ రూ.3,635 కోట్లు. 2010లో విలువ ఆధారంగా సంస్థకు చెందిన రూ.4,234.84 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు అయింది. ప్రస్తుత ధరల ప్రకారం వీటి విలువ రూ.6,630 కోట్ల స్థాయిలో ఉంటుంది. -
మణిగాంధీ,శివప్రసాద్ పై సస్పెన్షన్ ఎత్తివేత