
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి మరోసారి నోరుజారారు. లోక్‌సభలో సోమవారం అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ .. నిర్మల సీతారామన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కార్పొరేట్ పన్నుల తగ్గింపు గురించి వివరణ ఇచ్చిన నేపథ్యంలో అధిర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మీరంటే నాకు గౌరవం ఉంది కానీ, నిర్మల సీతారామన్ అనడానికి బదులుగా నిర్బలా సీతారామన్ అనడం సరైనదా.. కాదా..? అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాను. మీరు మంత్రి పదవిలో ఉన్నారు. అయితే మీరు మీ మనసు విప్పి మాట్లాడుతున్నారా.. లేదా అనే సందేహం కలుగుతోందని అధిర్ రంజన్ చౌదరి అన్నారు. గతంలో నరేంద్రమోదీ, అమిత్‌షా తాజాగా నిర్మలా సీతారామన్‌లపై చేసిన వ్యాఖ్యలకు అధిర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని లోక్‌సభలో బీజేపీ డిమాండ్ చేసింది.
ఇప్పటికే.. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా వలసదారులంటూ అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశమంతా ఎన్ఆర్‌సీని అమలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించడంపై అధిర్ రంజన్ చౌదరి సోమవారం మాట్లాడుతూ.. దేశంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. భారత్ ఏ ఒక్క మతానికో పరిమితం కాదన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సైతం వలసదారులేనని, వారి ఇళ్లు గుజరాత్‌లో ఉన్నాయని, కానీ వారు ఢిల్లీలో ఉంటున్నట్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment