నాగర్ కర్నూలు : కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, తాడూరు మండల ఎంపీటీసీ విజయలక్ష్మి ఎన్నిక చెల్లదంటూ నాగర్ కర్నూలు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమీషన్కు సూచించారు. 2014లో ఎంపీటీసీ ఎన్నికల సమయంలో పోలైన ఓట్లకు, కౌటింగ్ ఓట్లకు నాలుగు ఓట్లు తేడా రావడంతో న్యాయం కోసం టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి రేణుక కోర్టును ఆశ్రయించారు. మొత్తం పోలైన ఓట్లు 2589 కాగా, కౌంటింగ్ అయిన ఓట్లు 2585. నాలుగు ఓట్లు గల్లంతయ్యాయి. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ లక్ష్మి పై కేవలం 2 ఓట్ల తేడాతో రేణుక ఓడిపోయారు. దీంతో రేణుక 2014లో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment