reelections
-
మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారట! కాకుంటే మళ్లీ ఈమీఎంతోనేనట!!
-
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షునిగా గడప రమేష్ బాబు ఎన్నిక
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి గడపా రమేష్ బాబు ఎంపికయ్యారు. నవంబర్ 17వ తేదీన జరిగిన పదకొండో వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సభ ప్రారంభంలో సభ్యులందరు గోనె నరేందర్ రెడ్డి సొసైటీకి చేసిన సేవలను స్మరించుకుని నివాళులు అర్పించారు. అనంతరం 2023-2024 ఆర్థిక సంవత్సరపు రాబడి ఖర్చు వివరాలకు సభ ఆమోదం తెలిపింది.2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లు గార్లపాటి లక్ష్మా రెడ్డి, బండారు శ్రీధర్‌కు సభ్యులు కృతజ్ణతలు తెలిపారు. అలాగే రెండోసారి అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన గడప రమేశ్ బాబు, ఆయన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుండి నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారి దోర్నాల చంద్ర శేఖర్ ప్రకటించారు. తనకు రెండోసారి సేవచేసే అవకాశం ఇచ్చినందుకు గడప రమేష్ అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని అభివృద్ధి చేయడానికి మరింత కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా కార్య, కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దీనితో పాటు 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా కిరణ్ కైలాసపు , తెల్లదేవరపల్లి వెంకట కిషన్ రావును కొత్త ఆడిటర్లుగా ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో ముఖ్యమైన మార్పులు గత 8 సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన బసిక ప్రశాంత్ కుమార్ ఈ సారి ఉపాధ్యక్షులుగా, ప్రాంతీయ కార్యదర్శులుగా సేవలు అందించిన బొందుగుల రాము, నంగునూరు వెంకట రమణ ఈ సారి ప్రధాన కార్యదర్శి మరియు కోశాధికారిగా, కోశాధికారిగా సేవలు అందించిన జూలూరి సంతోష్ కుమార్ ఈ సారి ఉపాధ్యక్షులుగా సేవలు అందించబోతున్నారు. దీంతో నూతన కార్యవర్గం మరియు కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకట రమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, దుర్గ ప్రసాద్ ఎం, మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు, శశిధర్ రెడ్డి, బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, సంతోష్ వర్మ మాదారపు మరియు రవి కృష్ణ విజ్జాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్, శివ ప్రసాద్ ఆవుల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రవి చైతణ్య మైసా, చల్లా క్రిష్ణ మరియు సుగుణాకర్ రెడ్డి మొదలగు వారు ఉన్నట్టు తెలిపారు. సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న కార్యవర్గ సభ్యులు గర్రెపల్లి కస్తూరి శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, గింజల సురేందర్ రెడ్డి, ఆరూరి కవిత సంతోష్ రెడ్డి, నగమడ్ల దీప, కిరణ్ కుమార్ వీరమల్లు & రంగా పట్నాల గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఇండియాకు వెయిటేజీ పెంచిన సీఎల్ఎస్ఏ
న్యూఢిల్లీ: గరిష్టాల నుంచి 10% దిద్దుబాటుకు గురైన భారత ఈక్విటీల పట్ల అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సీఎల్ఎస్ఏ సానుకూల వైఖరి తీసుకుంది. లోగడ ఖరీదుగా మారిన భారత ఈక్విటీల నుంచి చౌకగా మారిన చైనా స్టాక్స్ వైపు మళ్లిన ఈ సంస్థ.. భారత ఈక్విటీ వ్యాల్యూ షన్లు దిగిరావడంతో ఇక్కడ ఎక్స్పోజర్ పెంచుకోవాలని నిర్ణయించింది. చైనా పెట్టుబడులు తగ్గించుకోనున్నట్టు ప్రకటించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయంతో చైనా మార్కెట్లు పెద్ద సవాళ్లు ఎదుర్కోనున్నాయంటూ, తన తాజా నిర్ణయానికి ఇదే కారణంగా పేర్కొంది.చైనా వృద్ధిలో ఎగుమతుల వాటాయే సింహభాగం ఉండడం, చైనా దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించడాన్ని గుర్తు చేసింది. భారత్‌లో అధికంగా ఉన్న ఎక్స్పోజర్ నుంచి కొంత మేర అక్టోబర్ మొదటి వారంలో చైనాకు మళ్లించినట్టు పేర్కొంది. భారత వెయిటేజీని 20% నుంచి 10%కి తగ్గించి, చైనా అలోకేషన్‌ను 5%కి సీఎల్ఎస్ఏ లోగడ పెంచుకోగా, ఇప్పుడు పూర్వపు స్థితికి మారుతున్నట్టు ప్రకటించింది. భారత్‌లో 20% ఇన్వెస్ట్ చేయాలని తాజాగా నిర్ణయించింది.నెలన్నర రోజుల్లో భారత ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు సుమారు రూ.లక్షన్నర కోట్లను తరలించుకుపోయిన నేపథ్యంలో సీఎల్ఎస్ఏ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. పలువురు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు తమ భారత ఈక్విటీ ఎక్స్పోజర్ను పెంచుకునేందుకు ఈ తరహా కరెక్షన్ కోసం చూస్తున్నట్టు తెలిపింది. చైనాకు ప్రతికూలతలు.. చైనా ఆరి్థక భవిష్యత్ అనిశి్చతిగా ఉన్నట్టు సీఎల్ఎస్ఏ తెలిపింది. చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన ఉద్దీపనలు ఆరి్థక వృద్ధికి కావాల్సినంత ప్రేరణనివ్వలేవని అభిప్రాయపడింది. యూఎస్ ఈల్డ్స్ పెరుగుతుండడం, ద్రవ్యోల్బణంపై అంచనాలు యూఎస్ ఫెడ్, చైనా సెంట్రల్ బ్యాంక్‌లు తమ పాలసీని మరింత సరళించే అవకాశాలను పరిమితం చేయనున్నట్టు పేర్కొంది. ఈ అంశాలతో చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఉద్దీపనల తర్వాత చైనా మార్కెట్ వైపు వెళ్లిన ఆఫ్‌షోర్ ఇన్వెస్టర్లు వెనక్కి రావొచ్చని అంచనా వేసింది. -
ఇజ్రాయెల్‌లో మళ్లీ ఎన్నికలు
గత రెండేళ్లుగా... ప్రత్యేకించి మొన్న ఫిబ్రవరి మొదలుకొని రాజకీయంగా వరస సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చివరికి మరోసారి జనం తీర్పు కోరడానికి సిద్ధపడ్డారు. బడ్జెట్ ఆమోదంపై రాజకీయ పక్షాల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఇజ్రాయెల్ పార్లమెంట్ కెన్సెట్ ఆ దేశ రాజ్యాంగ నిబంధన ప్రకారం రద్దయింది. నాలుగేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలు కాస్తా మొదటి రెండేళ్ల వ్యవధిలోనే నాలుగో దఫా నిర్వహించక తప్పడంలేదు. కొత్త సంవత్సరం మార్చిలో జరిగే ఈ ఎన్నికలు ఆయనకు అన్నివిధాలా అగ్నిపరీక్షే. నెతన్యాహూ సాధారణ రాజకీయవేత్త కాదు. వ్యూహరచనా నిపుణుడు. ఎత్తుగడల్లో ఆరితేరినవాడు. మొన్న మార్చిలో పార్లమెంటుకు మూడోసారి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఎవరికీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. 120 మంది సభ్యులుండే పార్లమెంటులో నెతన్యాహూ నేతృత్వంలోని మితవాద లికుడ్ పార్టీకి కేవలం 36 స్థానాలు మాత్రమే వచ్చాయి. మధ్యేవాద పక్షమైన బ్లూ అండ్ వైట్ పార్టీకి 33 స్థానాలు లభించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన కనీస మెజారిటీ 61. ఇతర పార్టీలకు చెప్పుకోదగ్గ రీతిలో సీట్లు రాలేదు. ఈ పరిస్థితుల్లో చివరికి తాను గట్టిగా వ్యతిరేకించే బ్లూ అండ్ వైట్ పార్టీతో చేతులు కలిపి నెతన్యాహూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో బ్లూ అండ్ వైట్ పార్టీ నేత బెన్నీ గాంట్జ్కూ, నెతన్యాహూకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 18 నెలలు నెతన్యాహూ, మిగిలిన నెలలు గాంట్జ్ పాలించాలి. కానీ దాన్ని కాస్తా నెతన్యాహూ బేఖాతరు చేయదల్చుకున్నారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన తాను ప్రధాని స్థానంలో వుండి ఆ కేసుల్ని ఎదుర్కొనాలి తప్ప మాజీగా మిగలకూడదని ఆయన గట్టిగా కోరుకున్నారు. అందుకే బడ్జెట్ ఆమోదానికి ప్రయత్నించి, ప్రధాని కావాలని ఆరాటపడిన గాంట్జ్ ఆశలకు ఆయన గండికొట్టారు. కెన్సెట్ రద్దుకు పరోక్షంగా కారకులయ్యారు. అయితే ఇద్దరికీ రెండు పార్టీల్లోనూ ప్రత్యర్థుల బెడద ఎక్కువే. నెతన్యాహూకు ఒకప్పుడు శిష్యుడిగా వుండి పార్టీలో గట్టి ప్రత్యర్థిగా ఎదిగిన గిడియన్ జార్ ఇటీవలే ఆ పార్టీనుంచి నిష్క్రమించి న్యూహోప్ పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. జార్ వెళ్లిపోయినా నెతన్యాహూకు పార్టీలో ప్రత్యర్థులు తక్కువేమీ లేరు. గాంట్జ్ పరిస్థితి కూడా అంతే. నెతన్యాహూతో చేరొద్దని, దానికి బదులు పార్లమెంటుకు మరోసారి ఎన్నికలు రావడమే మేలని నచ్చజెప్పారు. కానీ ఆయన వినలేదు. చివరకు ఈ చెలిమివల్ల రెండూ తీవ్రంగానే నష్టపోయాయి. అయితే నెతన్యాహూ పార్టీయే ఈసారి ఎన్నికల్లో కూడా అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని మీడియా సర్వేలు చెబుతున్నాయి. దానికి 27 సీట్లు రావొచ్చునని సర్వేలు చెబుతున్న మాట. గత ఎన్నికల్లో 33 స్థానాలు గెల్చుకున్న బ్లూ అండ్ వైట్ పార్టీ మాత్రం ఈసారి ఆరు స్థానాలకు పరిమితమవుతుందని అంటున్నాయి. ఏడు దశాబ్దాల ఇజ్రాయెల్ చరిత్రంతా అరబ్ వ్యతిరేకతతో, ముఖ్యంగా పాలస్తీనాపై కత్తులు నూరడంతో ముడిపడి వుంటుంది. అందుకే ప్రతి ఎన్నికలకూ ముందు పాలస్తీనాపై నిప్పులు కక్కడం లేదా దానిపై దాడులు చేయడం ఇజ్రాయెల్‌లో ఎవరు అధికారంలో వున్నా రివాజు. గత ఎన్నికల సమయంలో అయితే నెతన్యాహూ పాలస్తీనా అధీనంలో వున్న వెస్ట్‌బ్యాంకు ప్రాంతాలన్నిటినీ స్వాధీనం చేసుకుంటానని వాగ్దానం చేశారు. దేశంలో అరబ్ పార్టీల కూటమి జాయింట్ లిస్టును ఎలాగైనా అధికారంలోకి రానీకుండా చేయాలని ఇజ్రాయెల్ పార్టీలు శాయశక్తులా ప్రయత్నిస్తుంటాయి. వాస్తవానికి 2019 ఎన్నికల్లో జాయింట్ లిస్టు కింగ్ మేకర్‌గా ఆవిర్భవించింది. తమతో చేతులు కలిపితే ప్రధాని పదవి దక్కుతుందని, అవినీతిపరుడైన నెతన్యాహూను అధికారానికి దూరం పెట్టొచ్చునని జాయింట్ లిస్టు గాంట్జ్‌కు ప్రతిపాదన పంపినా అంగీకరించలేదు. జాయింట్ లిస్టుతో కలవొద్దన్న నిర్ణయాన్ని సమర్థిస్తూనే నెతన్యాహూను కూడా అంగీకరించొద్దని అనుచరులు సూచించినా గాంట్జ్ వినలేదు. ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు ముందు ఎప్పుడూ రాజకీయాలు వ్యక్తి కేంద్రంగా లేవు. తీవ్ర అరబ్ వ్యతిరేకతే అన్ని పార్టీలకూ ఊపిరి. అదే సమయంలో అరబ్ పార్టీల కూటమి చెప్పుకోదగ్గ స్థానాలు గెల్చుకుంటూ వుంటుంది. కానీ నెతన్యాహూ నాయకత్వ స్థానంలోకొచ్చాక అది మారింది. ఆయనకు వ్యతిరేకంగా కొత్త పార్టీలు పుట్టుకురావడం, ఆయన్ను వ్యతిరేకించడం మినహా వాటికి మరో రాజకీయ కార్యక్రమం లేకపోవడం రివాజైంది. ఇజ్రాయెల్‌కు లిఖితపూర్వక రాజ్యాంగం లేదు. అక్కడి పార్టీలకు నిర్దిష్టమైన రాజకీయ సిద్ధాంతం లేదు. పాలస్తీనా వ్యతిరేకత, యూదు జాత్యహంకారం, రాజకీయ నాయకుల స్వప్రయోజనాలు మాత్రమే మిగిలాయి. వీటికి గత రెండేళ్లుగా దేశాన్ని పీడిస్తున్న రాజకీయ అనిశ్చితి తోడైంది. దీనికి మూలాలు ఇజ్రాయెల్ ఆవిర్భావంలోనే వున్నాయి. వెస్ట్‌బ్యాంకు ప్రాంతంలోని యూదు కాలనీలను క్రమేపీ పెంచుకుంటూ పోవడం, అలా పెంచుతామని హామీ ఇవ్వడమే అన్ని పార్టీలకూ రివాజైంది. ఇదంతా క్రమేపీ దేశంలో మితవాద పక్షం బలపడటానికి దారితీసింది. అంతవరకూ పెద్దగా ప్రజాభిమానంలేని మితవాద పక్షం లికుడ్ పార్టీ 1977లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికొచ్చింది. వామపక్ష ప్రాభవం అంతరించడం మొదలైంది. 1995లో లేబర్ పార్టీ నేత ఇట్జాక్ రాబిన్‌ను మితవాద తీవ్రవాద పక్షం హత్య చేయడంతో దేశ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అన్ని పరిణామాల్లోనూ నెతన్యాహూ కీలక భూమిక పోషించి, లికుడ్ పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు తగిన ఆధారాలున్నాయని ఇప్పటికీ ఇజ్రాయెల్ సమాజం విశ్వసిస్తోంది. అదే సమయంలో ఆయన తప్ప గత్యంతరం లేదనుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే మార్చిలో జరగబోయే ఎన్నికల అనంతరం మళ్లీ నెతన్యాహూయే అధికారానికొస్తారా లేక ఈ అనిశ్చితి మరింత తీవ్రమవుతుందా అన్నది చూడాల్సివుంది. -
4 ఓట్లు గల్లంతు.. ఎన్నిక చెల్లదంటూ తీర్పు
నాగర్ కర్నూలు : కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, తాడూరు మండల ఎంపీటీసీ విజయలక్ష్మి ఎన్నిక చెల్లదంటూ నాగర్ కర్నూలు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు సూచించారు. 2014లో ఎంపీటీసీ ఎన్నికల సమయంలో పోలైన ఓట్లకు, కౌటింగ్ ఓట్లకు నాలుగు ఓట్లు తేడా రావడంతో న్యాయం కోసం టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి రేణుక కోర్టును ఆశ్రయించారు. మొత్తం పోలైన ఓట్లు 2589 కాగా, కౌంటింగ్ అయిన ఓట్లు 2585. నాలుగు ఓట్లు గల్లంతయ్యాయి. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ లక్ష్మి పై కేవలం 2 ఓట్ల తేడాతో రేణుక ఓడిపోయారు. దీంతో రేణుక 2014లో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. -
జంతర్ మంతర్ వద్ద ఆప్ ధర్నా
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నా నిర్వహించింది. ఆదివారం జంతర్ మంతర్ వద్ద ఆప్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోగా ఆప్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ మెజార్టీ సంఖ్యకు కాస్త దూరంలో ఆగిపోయింది. దీంతో కాంగ్రెస్ మద్దతుతో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్‌తో విభేదించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొన్ని నెలలకే పదవికి రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విధించారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది.