గత నిర్ణయం నుంచి వెనక్కి
తిరిగి 20% వెయిటేజీ
చైనా ఎక్స్‌పోజర్‌కు కోత
న్యూఢిల్లీ: గరిష్టాల నుంచి 10% దిద్దుబాటుకు గురైన భారత ఈక్విటీల పట్ల అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ సానుకూల వైఖరి తీసుకుంది. లోగడ ఖరీదుగా మారిన భారత ఈక్విటీల నుంచి చౌకగా మారిన చైనా స్టాక్స్ వైపు మళ్లిన ఈ సంస్థ.. భారత ఈక్విటీ వ్యాల్యూ షన్లు దిగిరావడంతో ఇక్కడ ఎక్స్‌పోజర్ పెంచుకోవాలని నిర్ణయించింది. చైనా పెట్టుబడులు తగ్గించుకోనున్నట్టు ప్రకటించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయంతో చైనా మార్కెట్లు పెద్ద సవాళ్లు ఎదుర్కోనున్నాయంటూ, తన తాజా నిర్ణయానికి ఇదే కారణంగా పేర్కొంది.
చైనా వృద్ధిలో ఎగుమతుల వాటాయే సింహభాగం ఉండడం, చైనా దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించడాన్ని గుర్తు చేసింది. భారత్‌లో అధికంగా ఉన్న ఎక్స్‌పోజర్ నుంచి కొంత మేర అక్టోబర్ మొదటి వారంలో చైనాకు మళ్లించినట్టు పేర్కొంది. భారత వెయిటేజీని 20% నుంచి 10%కి తగ్గించి, చైనా అలోకేషన్‌ను 5%కి సీఎల్‌ఎస్‌ఏ లోగడ పెంచుకోగా, ఇప్పుడు పూర్వపు స్థితికి మారుతున్నట్టు ప్రకటించింది. భారత్‌లో 20% ఇన్వెస్ట్ చేయాలని తాజాగా నిర్ణయించింది.
నెలన్నర రోజుల్లో భారత ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు సుమారు రూ.లక్షన్నర కోట్లను తరలించుకుపోయిన నేపథ్యంలో సీఎల్‌ఎస్‌ఏ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. పలువురు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు తమ భారత ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ను పెంచుకునేందుకు ఈ తరహా కరెక్షన్ కోసం చూస్తున్నట్టు తెలిపింది.
చైనాకు ప్రతికూలతలు..
చైనా ఆరి్థక భవిష్యత్ అనిశి్చతిగా ఉన్నట్టు సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన ఉద్దీపనలు ఆరి్థక వృద్ధికి కావాల్సినంత ప్రేరణనివ్వలేవని అభిప్రాయపడింది. యూఎస్ ఈల్డ్స్ పెరుగుతుండడం, ద్రవ్యోల్బణంపై అంచనాలు యూఎస్ ఫెడ్, చైనా సెంట్రల్ బ్యాంక్‌లు తమ పాలసీని మరింత సరళించే అవకాశాలను పరిమితం చేయనున్నట్టు పేర్కొంది. ఈ అంశాలతో చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఉద్దీపనల తర్వాత చైనా మార్కెట్ వైపు వెళ్లిన ఆఫ్‌షోర్ ఇన్వెస్టర్లు వెనక్కి రావొచ్చని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment