Amid
-
తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ‘వాకౌట్’
సాక్షి, చెన్నై: తమిళనాట గవర్నర్కు, డీఎంకే సర్కారుకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో కనీవినీ ఎరగని సంఘటనలు చోటుచేసుకున్నాయి. సోమవారం సమావేశాల తొలి రోజు సభనుద్దేశించి గవర్నర్ ఆర్.ఎన్.రవి చేసిన ప్రసంగంలో ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ పాఠాన్ని పలుచోట్ల విస్మరించడం వివాదం రాజేసింది. అందులో పేర్కొన్న పేర్లలో వివేకానందున్ని మాత్రం ప్రస్తావించి పెరియార్, అన్నాదురై వంటి ద్రవిడ దిగ్గజాలను ఆయన పక్కన పెట్టారు. ద్రవిడ మోడల్ ఆదర్శంగా పలు అభివృద్ధి పథకాలను చేపట్టాం వంటి పాయింట్లనూ ప్రస్తావించలేదు. పైగా పలు అంశాలపై తన అభిప్రాయాలను కూడా జోడిస్తూ ప్రసంగించారు. ఇలాంటి సందర్భాల్లో గవర్నర్లు ప్రసంగ పాఠానికి కట్టుబడటం సంప్రదాయం. ఈ నేపథ్యంలో రవి తీరుపై అధికార డీఎంకే సభ్యులు భగ్గుమన్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. వెల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అనంతరం ఏకంగా గవర్నర్కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టేందుకు సీఎం ఎంకే స్టాలిన్ సిద్ధమయ్యారు! ‘‘గవర్నర్ ప్రసంగంలోని అసంబద్ధ అంశాలను తిరస్కరించాలి. సభకు సమర్పించిన లిఖిత ప్రసంగ పాఠం మాత్రమే చెల్లుబాటవుతుందని ప్రకటించాలి’ అని అందులో కోరారు. కానీ స్టాలిన్ మాట్లాడుతుండగానే రవి హఠాత్తుగా లేచి సభ నుంచి నిష్క్రమించారు! అనంతరం తీర్మానాన్ని సభ ఆమోదించింది! రవి తీరు విచారకరమని, ద్రవిడ దిగ్గజాలతో పాటు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరునూ ప్రస్తావించకపోవడం శోచనీయమని స్పీకర్ అప్పవు అన్నారు. సభా సంప్రదాయాలను రవి తుంగలో తొక్కారంటూ మంత్రులు మీడియాతో మండిపడ్డారు. ‘‘జాతీయ గీతాలాపన జరగకుండానే సభను వీడారు. జాతీయ గీతాన్ని కూడా అవమానించారు’’ అని విమర్శించారు. డీఎంకే మద్దతుదారులు ట్విట్టర్లో ‘గెటౌట్రవి’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆయన బర్తరఫ్కు, రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ తీరును ఖండిస్తూ ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు డీఎంకే మిత్రపక్షాలు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, మనిదనేయ మక్కల్ కట్చి, తమిళర్ వాల్వురిమై కట్చి ప్రకటించాయి. బీజేపీ మాత్రం గవర్నర్కు మద్దతుగా నిలిచింది. గవర్నర్ సభలో ఉండగానే ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం పెడతారా అంటూ స్టాలిన్, స్పీకర్ తీరును తీవ్రంగా ఖండించింది. డీఎంకే, దాని మిత్రపక్షాలు రాజ్యాంగేతర శక్తుల్లా వ్యవహరిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై దుయ్యబట్టారు. గవర్నర్కు వ్యతిరేకంగా సీఎం తీర్మానం ప్రవేశపెట్టడాన్ని విపక్ష అన్నాడీఎంకే తప్పుబట్టింది. దీన్ని రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించింది. గవర్నర్, డీఎంకే సర్కారు మధ్య ఎంతోకాలంగా నిప్పూ ఉప్పు వంటి పరిస్థితి నెలకొని ఉంది. (చదవండి: యూత్ ఐకాన్గా రాహుల్ గాంధీ.. ఆ సత్తా ఉంది: శత్రుఘ్న సిన్హా) -
అగ్గి రాజేసిన అగ్రరాజ్యం... యుద్ధానికి సై అంటున్న దేశాలు: వీడియో వైరల్
China Amid Tension With Taiwan: అమెరికా సెనెట్ స్పీకర్ నాన్సీ పెలోసి పర్యటన చివరికి యుద్ధానికి తెరలేపినట్లు తెలుస్తోంది. తొలుత పెలోసి పర్యటన పెద్ద వివాదంగా మారింది. ఆ వివాదం కాస్త ముదరి ఇప్పుడూ ఇరు దేశాల మద్య నిప్పు రాజేసి యుద్ధానికి సంసిద్ధమయ్యేలా చేసింది. చైనా కూడా ఈ పర్యటన పలు పరిణామాలకు దారితీస్తుందంటూ అమెరికాని మొదట నుంచి హెచ్చరించింది. కానీ అమెరికా కూడా వెనక్కి తగ్గేదే లే అంటూ పర్యటించేందుకు సిద్ధం అయ్యింది. ఇది రెచ్చగొట్టే చర్య అని చైనా పదే పదే చెబుతున్న ఖతారు చేయలేదు. ఆఖరికి రష్యా కూడా చైనాకి మద్దతు ఇస్తూ ఇది కవ్వింపు చర్య అని అమెరికాని హెచ్చరించింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి హువాచున్యింగ్ ఈ పర్యటన వ్యక్తిగతమైనది కాదని, ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లితే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు. దీంతో అమెరికా అలర్ట్ అయ్యి పెలోసి పర్యటన నిమిత్తం తైవాన్ ద్వీప సమీపంలో నాలుగు యుద్ధ నౌకలను మోహరించింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రీక్త వాతావరణం నెలకొంది. ఈ మేరకు చైనా తైవాన్ పై యుద్ధానికి సిద్ధం అంటూ తైవాన్ సరిహద్దు సమీపంలో భారీగా సాయుధవాహానాలను, ఇతర సైనిక పరికరాలను మోహరించింది. మరోవైపు తైవాన్ కూడా యుద్ధానికి సై అంటూ తమ పోరాట పటిమను చూపించేలా తమ ఆయుధాలతో ప్రదర్శన ఇచ్చింది. ఈ మేరకు ఇరు దేశాల సాయుధ బలగాలకు సంబధించిన వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. In Fujian right now😯😯 pic.twitter.com/hHxfPTDQEo — Yin Sura 尹苏拉 (@yin_sura) August 2, 2022 ⚡ There was a video of a military exercise in China in the South China Sea on the eve of Nancy Pelosi’s visit to Taiwan. Reuters reports Taiwan’s defence ministry had “reinforced” its combat alertness level from Tuesday morning to Thursday noon pic.twitter.com/7Cru0hSL6u — Flash (@Flash43191300) August 2, 2022 (చదవండి: యూఎస్కి వార్నింగ్ ఇచ్చిన రష్యా! ముమ్మాటికి రెచ్చగొట్టే చర్యే!) -
జై.. ఆచూకీ చెప్తే 50,000 బహుమతి!
నాగ్ పూర్ః తప్పిపోయిన పులి ఆచూకీ తెలియాలంటూ ఇప్పటికే జనం పూజలు చేస్తుండగా.. మహరాష్ట్ర ప్రభుత్వం జై.. ఆచూకీ తెలిపిన వారికి 50 వేల రూపాయలు నగదు బహుమతి ఇస్తామంటూ ప్రకటించింది. ఉమ్ రెడ్-కర్హండా అభయారణ్యం నుంచి తప్పిపోయిన ప్రముఖ పులి జై.. ఆచూకీ కోసం ఇప్పటికే ప్రభుత్వం.. అటవీ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ప్రకటనలు ఇవ్వగా.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 50 వేల రివార్డు ప్రకటించింది. నాగ్ పూర్ అభయారణ్యం నుంచి ఈ యేడాది ఏప్రిల్ 18న ఏడేళ్ళ వయసున్న భారీకాయం గల పెద్దపులి జై.. తప్పిపోయిన నాటినుంచీ దాని సమాచారం కోసం అనేక విధాలుగా ప్రయత్నాలు జరుతుతూనే ఉన్నాయి. పులి ఆచూకీ, అడుగుజాడలు, అది సంచరించే ప్రదేశం వంటి వివరాలు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని, తెలిపినవారికి 50 వేల రూపాయల నగదు బహుమతిని అందిస్తామని కన్జర్వేషన్ లెన్సెస్ అండ్ వైల్డ్ లైఫ్ (సీఎల్ఏడబ్ల్యూ) స్వచ్ఛంద సంస్థ ఇప్పటికే ప్రకటించగా... తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం మరో 50 వేల బహుమానాన్ని ప్రకటించింది. అటవీశాఖ శుక్రవారం నిర్వహించిన 'ఇంటర్నేషనల్ టైగర్స్ డే' సందర్భంగా అడవి నుంచీ తప్పిపోయిన పులి ఎప్పటికైనా తిరిగివస్తుందంటూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దాని సమాచారం కోసం అన్ని ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందని ఆయన తెలిపారు. పెద్దపులి ఆచూకీకోసం ప్రజలు పడుతున్న తాపత్రయానికి ఆనందం వ్యక్తం చేశారు. ఒకప్పుడు నాగ్ జీరా టైగర్ రిజర్వ్ నుంచి ఉమ్రెడ్ కర్హండ్లా అభయారణ్యానికి వలస వచ్చిన జై.. అప్పట్నుంచీ స్థానికులు, పర్యటకుల అభిమానాన్ని అమితంగా చూరగొంది. రాచరికాన్ని ప్రదర్శించే జీవన విధానం, భారీ శరీరాకృతి కలిగిన జై... పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పులి జాతిలోనే విభిన్నంగా కనిపించే జై.. సుమారు 250 కేజీల బరువుంటుంది. ఇప్పటికే స్థానికులు జై.. ఆచూకీకోసం ప్రార్థనలు, పూజలు చేస్తుండగా... 100 మంది వరకూ జనం, వన్యప్రాణుల ఫోటోగ్రాఫర్లు, స్వచ్ఛందంగా గాలిస్తున్నారు. వన్యప్రాణుల పర్యవేక్షకులు, ఎన్జీవోలు కూడా జై.. ఆచూకీకోసం ప్రయత్నించాలని అటవీ అధికారులు సైతం కోరారు. శాంక్చరీ టోపోగ్రఫీ తెలిసిన బృందం ద్వారా కూడా పులి ఆచూకీ తెలుసుకొనేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.