న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నా నిర్వహించింది. ఆదివారం జంతర్ మంతర్ వద్ద ఆప్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోగా ఆప్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ మెజార్టీ సంఖ్యకు కాస్త దూరంలో ఆగిపోయింది. దీంతో కాంగ్రెస్ మద్దతుతో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్తో విభేదించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొన్ని నెలలకే పదవికి రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విధించారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది.
జంతర్ మంతర్ వద్ద ఆప్ ధర్నా
Published Sun, Aug 3 2014 3:46 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement