
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి గడపా రమేష్ బాబు ఎంపికయ్యారు. నవంబర్ 17వ తేదీన జరిగిన పదకొండో వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సభ ప్రారంభంలో సభ్యులందరు గోనె నరేందర్ రెడ్డి సొసైటీకి చేసిన సేవలను స్మరించుకుని నివాళులు అర్పించారు. అనంతరం 2023-2024 ఆర్థిక సంవత్సరపు రాబడి ఖర్చు వివరాలకు సభ ఆమోదం తెలిపింది.
2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లు గార్లపాటి లక్ష్మా రెడ్డి, బండారు శ్రీధర్‌కు సభ్యులు కృతజ్ణతలు తెలిపారు. అలాగే రెండోసారి అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన గడప రమేశ్ బాబు, ఆయన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుండి నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారి దోర్నాల చంద్ర శేఖర్ ప్రకటించారు. తనకు రెండోసారి సేవచేసే అవకాశం ఇచ్చినందుకు గడప రమేష్ అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని అభివృద్ధి చేయడానికి మరింత కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా కార్య, కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దీనితో పాటు 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా కిరణ్ కైలాసపు , తెల్లదేవరపల్లి వెంకట కిషన్ రావును కొత్త ఆడిటర్లుగా ఎన్నుకున్నారు.

ఈ సమావేశంలో ముఖ్యమైన మార్పులు
గత 8 సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన బసిక ప్రశాంత్ కుమార్ ఈ సారి ఉపాధ్యక్షులుగా, ప్రాంతీయ కార్యదర్శులుగా సేవలు అందించిన బొందుగుల రాము, నంగునూరు వెంకట రమణ ఈ సారి ప్రధాన కార్యదర్శి మరియు కోశాధికారిగా, కోశాధికారిగా సేవలు అందించిన జూలూరి సంతోష్ కుమార్ ఈ సారి ఉపాధ్యక్షులుగా సేవలు అందించబోతున్నారు. దీంతో నూతన కార్యవర్గం మరియు కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకట రమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, దుర్గ ప్రసాద్ ఎం, మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు, శశిధర్ రెడ్డి, బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, సంతోష్ వర్మ మాదారపు మరియు రవి కృష్ణ విజ్జాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్, శివ ప్రసాద్ ఆవుల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రవి చైతణ్య మైసా, చల్లా క్రిష్ణ మరియు సుగుణాకర్ రెడ్డి మొదలగు వారు ఉన్నట్టు తెలిపారు. సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న కార్యవర్గ సభ్యులు గర్రెపల్లి కస్తూరి శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, గింజల సురేందర్ రెడ్డి, ఆరూరి కవిత సంతోష్ రెడ్డి, నగమడ్ల దీప, కిరణ్ కుమార్ వీరమల్లు & రంగా పట్నాల గార్లకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment