వాషింగ్టన్: గ్రీన్‌కార్డుల జారీలో దేశాల వారీ కోటాను ఎత్తివేయడంతోపాటు హెచ్–1బీ వీసాల జారీలో మార్పుల కోసం ఉద్దేశించిన అమెరికా పౌరసత్వ చట్టం–2023ను అధికార డెమొక్రాటిక్ పార్టీ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం 1 కోటి మందికిపైగా అమెరికా పౌరసత్వం కల్పించేందుకు రోడ్‌మ్యాప్ రూపొందిస్తారు.
అక్రమంగా వలస వచ్చిన వారికి, ధ్రువ పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారికి పౌరసత్వం లభించనుంది. గ్రీన్‌కార్డ్ జారీ సులభం కానుంది. దేశాలవారీ కోటా రద్దు చేస్తారు. తక్కువ వేతనం ఇచ్చే పరిశ్రమల్లో పనిచేసేవారు కూడా గ్రీన్‌కార్డులు సులువుగా పొందవచ్చు. హెచ్1బీ వీసాలు కలిగిన వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment