![Indian Americans Organise Lavish Welcome For PM Modi In US - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/20/Indian%20Americans%20Organise%20Lavish%20Welcome%20For%20PM%C2%A0Modi%20In%20US-01.jpg.webp?itok=1p-1qyPK)
భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21న అమెరికాలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఇండో అమెరికన్లు సమాయత్తమవుతున్నారు.అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రసిద్ధి గాంచిన టైం స్క్వేర్ వద్ద ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో మోదీకి స్వాగతం అంటూ పెద్ద ఎత్తున ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అమెరికాలో 20 పట్టణాల్లోని పాపులర్ నగరాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.జూన్ 21న న్యూయార్క్ నగరంలో నిర్వహించనున్న యోగా దినోత్సవంలో మోదీ పాల్గొననున్నారు. ఆ తర్వాత 22న వైట్‌హౌస్‌లో ఆయనకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ దంపతులు గౌరవ విందు ఇస్తారు.
మోదీ చేపట్టనున్న ఈ పర్యటన కోసం యావత్ భారతీయ అమెరికన్లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని అడపా ప్రసాద్ తెలిపారు. జూన్ 21న వైమానిక స్థావరం వద్దకు వెళ్లి మోదీకి స్వాగతం చెప్పేందుకు ఇండో అమెరికన్లు సిద్ధమవుతున్నారని కృష్ణారెడ్డి ఏనుగుల, విలాస్ జంబుల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment