indo americans
-
ఇండో-అమెరికన్లను ప్రసన్నం చేసుకునేందుకు..
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ప్రచార వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో భారతీయ అమెరికన్ల ఓటర్ల అధిక సంఖ్యలో పాల్గొనేలా కొన్ని స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి.అందులో భాగంగానే ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (FIIDS) సంస్థ ‘ఇండో అమెరికన్ వోట్స్ మేటర్’ అనే ప్రచారాన్ని మంగళవారం ప్రారంభించింది. అమెరికా భవిష్యత్తును రూపొందించడంలో ఇండియన్ అమెరికన్లు కీలక పోషిస్తారని ఓ ప్రకటనలో తెలిపింది.‘‘ఇండో అమెరికన్లు అమెరికాలో శక్తివంతమైన, పెరుగుతున్న మైనారిటీ కమ్యూనిటీగా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. అమెరికాగా అంతటా సుమారుగా 4.5 మిలియన్ల మంది ఇండో అమెరికన్లు ఉన్నారు. 2024 ఎన్నికలలో ఇండో అమెరికన్ ఓటర్లు గణనీయమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఫ్లోరిడా, జార్జియా, అరిజోనా, వర్జీనియా, న్యూజెర్సీ , పెన్సిల్వేనియా వంటి కీలకమైన రాష్ట్రాలలో ఇండో అమెకన్లు అధిక సంఖ్యలో ఉన్నారు. కీలకమైన అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలను నిర్ణయించడంలో ఇండో అమెరికన్లు నిర్ణయాత్మకంగా మారనున్నారు’’ అని ఎఫ్ఐఐడీఎస్ పేర్కొంది. ఎన్నికల నేపథ్యంలో దేశీయంగా అమెరికా, ప్రపంచం విధానాలపై ఇండో అమెరికన్ల అభిప్రాయలు తెలుసుకోవడానికి సమగ్ర సర్వే చెపడుతున్నామని తెలిపారు. ‘అధ్యక్ష ఎన్నికలకు కీలకమైన రాష్ట్రాల్లో ఇండో అమెరికన్ జనాభా గణనీయంగా ఉంది. ఈ అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు ప్రభావం చూపే అవకాశం కలిగి ఉన్నారు’ అని ఎఫ్ఐఐడీఎస్ పాలసీ అండ్ స్ట్రాటజీ చీఫ్ ఖండేరావ్ కాండ్ తెలిపారు.ఇక.. భారతీయు అమెరికన్లు ఈసారి ఏ పార్టీ అభ్యర్థివైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి. మరోవైపు.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఇండో అమెరికన్ కమలా హారిస్ బరిలో ఉండటంతో భారతీయ అమెరికన్ల ఓటర్లపై ప్రాధాన్యత పెరుగుతోంది. -
న్యూయార్క్ లో ప్రధాని మోదీకు ఇండో అమెరికన్ల స్వాగతం
-
మోదీకి ఘనస్వాగతం పలికేందుకు రెడీ అవుతున్న ఇండో-అమెరికన్లు
భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21న అమెరికాలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఇండో అమెరికన్లు సమాయత్తమవుతున్నారు.అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రసిద్ధి గాంచిన టైం స్క్వేర్ వద్ద ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో మోదీకి స్వాగతం అంటూ పెద్ద ఎత్తున ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమెరికాలో 20 పట్టణాల్లోని పాపులర్ నగరాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.జూన్ 21న న్యూయార్క్ నగరంలో నిర్వహించనున్న యోగా దినోత్సవంలో మోదీ పాల్గొననున్నారు. ఆ తర్వాత 22న వైట్‌హౌస్‌లో ఆయనకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ దంపతులు గౌరవ విందు ఇస్తారు. మోదీ చేపట్టనున్న ఈ పర్యటన కోసం యావత్ భారతీయ అమెరికన్లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని అడపా ప్రసాద్ తెలిపారు. జూన్ 21న వైమానిక స్థావరం వద్దకు వెళ్లి మోదీకి స్వాగతం చెప్పేందుకు ఇండో అమెరికన్లు సిద్ధమవుతున్నారని కృష్ణారెడ్డి ఏనుగుల, విలాస్ జంబుల పేర్కొన్నారు. -
అమెరికాలో భారత మహిళలపై దాడి.. ఇండియాకు వెళ్లిపోండి అంటూ..
-
ఇండియన్స్ గో బ్యాక్
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి జాతివివక్ష పడగవిప్పింది. ఈసారి ఏకంగా భారతీయ మహిళలపైనే దాడి జరగడం కలకలం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా అమెరికాలో ఉన్న భారతీయులు ఉలిక్కిపడ్డారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. టెక్సాస్‌లో ఉన్న డల్లాస్‌లో భారతీయ మహిళలజాతివివక్ష దాడి జరిగింది. మెక్సికన్‌కు చెందిన మహిళ ఓ పార్కింగ్ లాట్లో భారతీయ మహిళలను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ వారిపై దాడి చేసింది. కాగా, ఈ ఘటనను తన సెల్ఫోన్లో వీడియో తీస్తూనే సదరు మహిళలను కొడుతూ.. బూతులు తిట్టింది. నేను ఎక్కడికి వెళ్లినా ఇండియన్స్ కనిపిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే భారత మహిళలను.. మీరు ఇండియాకు వెళ్లిపోవాలంటూ బెదిరించింది. ఇండియాలో బెటర్ లైఫ్ లేకపోవడం వల్లే మీరు అమెరికాకు వస్తున్నారని ఆమె ఆరోపించింది. ఈ సందర్భంగానే తాను భారతీయులను ద్వేషిస్తానని చెప్పుకొచ్చింది. నేను ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను. కానీ, మీరు ఇండియాలో పుట్టి ఇక్కడికి వస్తున్నారు. ఒకవేళ ఇండియాలో లైఫ్ బాగా ఉంటే అప్పుడు మీరు ఇక్కడకి ఎందుకు వచ్చినట్లు ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, మహిళలపై దాడి వీడియో అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీలో వైరల్‌గా మారింది. దీంతో, పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేశారు. కాగా, మెక్సికన్ మహిళను ఎస్మరాల్డో ఉప్టన్‌గా గుర్తించారు. ఇది కూడా చదవండి: అది రష్యాకు వ్యతిరేకంగా ఓటేసినట్లు కాదు.. జెలెన్స్కీకి సపోర్ట్‌పై భారత్ ‘టెక్నికల్’ వివరణ -
కమలా హ్యారిస్ స్ఫూర్తితో పుస్తకం
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఎన్నిక కావడంతోపాటు అమెరికాలో భారత సంతతి ప్రజలు సంఖ్యాపరంగా తక్కువే అయినా, పలుకుబడి కలిగిన వర్గంగా ఎదిగిన తీరుపై ఒక పుస్తకం వెలువరించేందుకు రంగం సిద్ధమైంది. అగ్రరాజ్యంలో భారత సంతతికి చెందిన ప్రముఖ విద్యావేత్తలు, దౌత్యాధికారులు, వ్యాపారవేత్తలు, పలుకుబడి కలిగిన ప్రముఖుల బృందం ఇందుకోసం ముందుకు వచ్చింది.‘అమెరికాకు వచ్చి స్థిరపడిన మొదటి రెండుతరాల వారి ఆశలు, ఆశయాలకు కమలా హ్యారిస్ ప్రతీక. దేశ ఉపాధ్యక్షురాలి స్థాయికి కమల ఎదిగిన తీరు, ఆ క్రమంలో ఆమె పడిన కష్టం, ఎదురైన ఆటంకాలు, ఆమె విజయానికి భారత సంతతి ప్రజలు చేసిన కృషి వంటివి ఈ పుస్తకంలో ఉంటాయి’ అని ఈ పుస్తక రచయితల్లో ఒకరు, ప్రముఖ అమెరికన్– ఇండియన్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఎంఆర్ రంగస్వామి వెల్లడించారు. ‘కమలా హ్యారిస్ అండ్ ది రైజ్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్’ అనే ఈ పుస్తకంలో అమెరికాలో భారత సంతతి ప్రజలు స్వయం కృషితో ఎదిగిన క్రమం స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆయన అన్నారు.40 లక్షల వరకు భారతీయ అమెరికన్లుండగా, అందులో 18 లక్షల మంది అర్హులైన ఓటర్లున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయురాలు, మొట్టమొదటి దక్షిణాసియా సంతతి అమెరికన్‌గా కమలా హ్యారిస్(56) చరిత్ర సృష్టించారు. ఆమె తండ్రి జమైకాకు చెందిన డొనాల్డ్ హ్యారిస్, తల్లి చెన్నైకు చెందిన శ్యామలా గోపాలన్. -
అమెరికా గడ్డపై 14 భారతీయ భాషల్లో ప్రచారం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను ఢీకొంటున్న జో బిడెన్ ప్రచార కార్యక్రమం ఇండో-అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునేలా రూపొందింది. అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపే ఇండో-అమెరికన్ ఓటర్లను చేరుకునేందుకు 14 భాషల్లో జో బిడెన్ ప్రచార కార్యక్రమాన్ని పకడ్బందీగా ప్లాన్ చేశారు. కీలక రాష్ట్రాల్లో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల గెలుపు అవకాశాలను భారత సంతతికి చెందిన ఓటర్లు నిర్ధేశించనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన ఇండో-అమెరికన్ ఓటర్ల కోసం జో బిడెన్ ఆకట్టుకునే నినాదాలతో ముందుకొచ్చారు. ‘అమెరికా కా నేత..కైసా హో, జో బిడెన్ జైసా హో’ ( అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి) అంటూ హిందీ, తెలుగు సహా పలు భారతీయ భాషల్లో నినాదాలతో హోరెత్తించనున్నారు. చదవండి : అధ్యక్ష ఎన్నికల వాయిదాకు సంకేతాలు 2016లో ఆబ్ కీ ట్రంప్ సర్కార్ ( ఈసారి ట్రంప్ ప్రభుత్వం) నినాదం భారతీయుల మనసును తాకిన క్రమంలో డెమొక్రటిక్ పార్టీ ప్రచారాన్ని ఏకంగా 14 భారతీయ భాషల్లో చేపట్టేందుకు జో బిడెన్ క్యాంపెయిన్ వ్యూహకర్తలు సంసిద్ధమయ్యారు. ఇండో-అమెరికన్ ఓటర్లను వారి మాతృభాషలోనే చేరువయ్యేందుకు ప్రణాళికలు రూపొందించామని బిడెన్ క్యాంపెయిన్ బృందంలో ఒకరైన అజయ్ భుటోరియా తెలిపారు. తెలుగు, హిందీ, పంజాబీ, తమిళ్, బెంగాలీ, ఉర్దూ, కన్నడ, మళయాళీ, ఒరియా, మరాఠీ, నేపాలీ సహా 14 భాషల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు జో బిడెన్ ప్రచార బృందంతో అజయ్ కసరత్తు సాగిస్తున్నారు. భారత్‌లో హోరెత్తే ఎన్నికల ప్రచారాన్ని చూసిన అనుభవంతో జో బిడెన్ క్యాంపెయిన్‌లో ఆ సందడి ఉండేలా ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. అమెరికాలో నివసించే ఇండో-అమెరికన్ ఓటర్లలో ఆ ఉత్సుకత కనిపించేలా ‘అమెరికా కా నేత..కైసా హో, జో బిడెన్ జైసా హో’ నినాదాన్ని ముందుకుతెచ్చామని తెలిపారు. నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో డెమొక్రటికక్ అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్ తలపడనున్నారు. -
ట్రంప్ వెంట ఇద్దరు ఇండో అమెరికన్లు..
న్యూయార్క్ : ఈనెల 24, 25న రెండు రోజుల భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి బృందంలో భారత సంతతికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారు. ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) చైర్మన్ అజిత్ పాయ్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికారి కష్ పటేల్‌లు ఈ బృందంలో సభ్యులుగా అధ్యక్షుడి వెంట సోమవారం భారత్‌లో అడుగుపెట్టనున్నారు. పాయ్ తల్లితండ్రులు ఇద్దరూ మహారాష్ట్రకు చెందిన వైద్యులు కాగా 1971లో వారు అమెరికాకు వలస వెళ్లారు. కాన్సాస్‌లో జన్మించిన పాయ్ హార్వార్డ్, చికాగో యూనివర్సిటీల్లో విద్యాభ్యాసంతో న్యాయవాదిగా ఎదిగారు. 2012లో ఆయన ఎఫ్‌సీసీలో చేరి అనంతరం అయిదుగురు కమిషనర్లలో ఒకరిగా ఎంపికయ్యారు. 2017లో ట్రంప్ పాయ్‌ను ఎఫ్‌సీసీ చీఫ్‌గా నియమించారు. ఇక గుజరాత్ మూలాలున్న కష్ పటేల్ తల్లితండ్రులు తూర్పు ఆఫ్రికా, కెనడాల నుంచి న్యూయార్క్‌లో స్ధిరపడ్డారు. రష్యా జోక్యంపై దర్యాప్తును తోసిపుచ్చడం ద్వారా పటేల్ ఇటీవల వార్తల్లో నిలిచారు. 2018లో పటేల్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు చెదిన డైరెక్టరేట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అలయన్స్‌లో చేరారు. ఉగ్రవాద నిరోధక విభాదగం బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించారు. పటేల్ గతంలో రిపబ్లికన్ నాయకత్వానికి చెందిన హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీకి కూడా పనిచేశారు. చదవండి : వైరల్ : బాహుబలిగా అదరగొట్టిన ట్రంప్ -
భారత సంతతి డ్రగ్స్ ముఠా అరెస్ట్
న్యూయార్క్: నకిలీ బ్రాండింగ్‌తో భారీ ఎత్తున డ్రగ్స్ ఆధారిత మందుల వ్యాపారం సాగిస్తున్న ఓ ముఠా కుట్రను అమెరికా పోలీసులు భగ్నం చేశారు. న్యూయార్క్ పరిధిలోని క్వీన్స్ కేంద్రంగా ఈ ముఠా సాగిస్తున్న కార్యకలాపాలపై నిఘా పెట్టిన పోలీస్ అధికారులు, 8 మంది భారత సంతతి అమెరికన్లను అరెస్ట్ చేశారు. అమెరికాలోని కొరియర్, పోస్టల్ సర్వీసుల ద్వారా వీరు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలుసుకున్న అధికారులు విస్తుపోయారు. ఈ విషయమై న్యూయార్క్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘సెషిజాన్ కమల్ దాస్(46), ముకుల్(24), గులాబ్ (45), దీపక్ (43), నారాయణ స్వామి(58), బల్జీత్ సింగ్(29), హర్‌ప్రీత్ సింగ్(28) వికాస్ వర్మ (45)లు భారత్ నుంచి నకిలీ బ్రాండింగ్‌తో నల్ల మందు ఆధారిత మందుల్ని అమెరికాలోకి భారీగా దిగుమతి చేసుకున్నారు. ఈ మందుల్లో హెరా యిన్, ఆక్సికొంటిన్, వికోడిన్, ట్రమడాల్, ఫెంటానేల్ వంటి సింథటిక్ డ్రగ్స్ ఉంటాయి’ అని తెలిపారు. రీ–ప్యాకింగ్‌తో కోట్ల ఆదాయం.. నిందితులు తమ డ్రగ్స్ వ్యాపారానికి న్యూయార్క్ పరిధిలో క్వీన్స్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఈ పట్టణంలోని ఓ గోదామును అద్దెకు తీసుకున్న 8 మంది నిందితులు.. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న సరుకులను తమ వినియోగదారులకు పంపేవారు. ఇందుకోసం ప్రభుత్వ పోస్టల్ సర్వీసుతో పాటు ప్రైవేటు కొరియర్ సంస్థల సేవలను హాయిగా వాడుకున్నారు. మందులను రీప్యాక్ చేసి తమ వినియోగదారులకు, కొన్ని సంస్థలకు అందించడం మొదలుపెట్టారు. ఇలా 2018–19 మధ్యకాలంలో వీరు కోట్ల రూపాయలు ఆర్జించారు. అయితే 2018 జనవరి నుంచి దేశంలోకి భారీగా నల్లమందు ఆధారిత డ్రగ్స్ దిగుమతి కావడంపై అమెరికా విచారణ సంస్థలు దృష్టి సారించగా ఈ అక్రమ అమ్మకాలు వెలుగులోకి వచ్చాయి. డోస్ ఎక్కువైతే మరణమే.. సింథటిక్ డ్రగ్స్ ఉన్న మందులను వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడటం ప్రమాదకరం. డోస్ ఎక్కువైతే కోమాలోకి వెళ్లిపోతారు. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుంది. ఈ నేపథ్యంలో 8 మంది నిందితులను బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టులో హాజరుపర్చిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నేరం రుజువైతే కమల్దాస్కు 25 ఏళ్లు, మిగతా నిందితులకు ఐదేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. -
మాకివే ఒలింపిక్స్; కచ్చితంగా గెలవాలి!!
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే తమ ఉనికిని చాటుకోవడంలో భారతీయులు ఎల్లప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న ఎన్నారైలు తమ పిల్లలను కూడా అగ్రపథంలో నిలపడంలో విజయం సాధిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో గత దశాబ్దకాలంగా అమెరికాలోని భారత సంతతి విద్యార్థులు విజేతలుగా నిలవడమే ఇందుకు నిదర్శనం. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను వెనక్కినెట్టి మరీ మన చిన్నారులే విజేతలుగా నిలుస్తూ.. భారత మేథా స్థాయిని ప్రపంచానికి చాటిచెబుతున్నారు. కఠిన పదాల ఉచ్ఛారణను అనుసరించి వాటి స్పెల్లింగ్ చెప్పడం ఈ పోటీ ప్రధాన లక్షణం. మొదటి విన్నర్ ఫ్రాంక్.. స్పెల్లింగ్ బీ అనే పదం 1875లో మొదటిసారిగా అచ్చయింది. విద్యార్థుల్లో పోటీతత్త్వాన్ని పెంచేందుకు ద కొరియర్ జర్నల్ అనే వార్తా పత్రిక 1925లో యునైటెడ్ స్టేట్స్ స్పెల్లింగ్ బీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాషింగ్టన్లో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ పోటీలో ఫ్రాంక్ నౌహసర్ అనే పదకొండేళ్ల పిల్లాడు తొలి విజేతగా చరిత్రకెక్కాడు. గ్లాడియస్(లాటిన్లో ఖడ్గం అని అర్థం) అనే పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పి ట్రోఫీని అందుకున్నాడు. అమెరికాలోని కెంటెకీలో జన్మించిన ఫ్రాంక్ తదనంతర కాలంలో అమెరికన్ పేటెంట్ లాయర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందారు. జర్మన్ సంతతికి చెందిన ఆయన మార్చి 11, 2011లో మరణించారు. ఆ డాక్యుమెంటరీ స్ఫూర్తిగా.. 1941లో స్క్రిప్స్ హవార్డ్ న్యూస్ సర్వీస్ స్పెల్లింగ్ బీ స్పాన్సర్షిప్ బాధ్యతలు చేపట్టింది. అప్పటినుంచి ఈ పోటీని ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ గా వ్యవహరిస్తున్నారు. ప్రతీ ఏటా విధిగా నిర్వహించే ఈ పోటీల్లో 2008 నుంచి భారత సంతతి విద్యార్థులే విజేతలుగా నిలవడం విశేషం. ఇండియానాకు చెందిన సమీర్ మిశ్రా స్పెల్లింగ్ బీ-2008 ట్రోఫీ సాధించాడు. అయితే భారతీయులకు స్పెల్లింగ్ బీపై మక్కువ ఏర్పడింది మాత్రం స్పెల్‌బౌండ్ అనే డాక్యుమెంటరీతోనే అంటారు ఆంత్రపాలజిస్టులు. 1999 నేషనల్ బీ పోటీలో గెలుపొందిన నుపుర్ లాలా విజయగాథ ఇండో అమెరికన్లకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొంటున్నారు. సమీర్ మిశ్రా భారతీయుల్లో పోటీ తత్త్వం మెండు.. ‘ వలసదారులుగా పరాయి దేశంలో ఉన్నప్పటికీ.. మాతృభాషతో పాటు ఇతర భాషలపై పట్టు సాధించాలనే ఆసక్తి భారతీయుల్లో మెండుగా ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో అగ్రపథాన నిలిచే ఇండో అమెరికన్లలో చాలా మంది స్పెల్లింగ్ బీని ఎంతో ప్రతిష్టాత్మంగా భావిస్తారు. తమ పిల్లలను ఈ పోటీల్లో భాగస్వామ్యం చేయడాన్ని గర్వంగా ఫీలవుతారు. అంతేకాదు స్పెల్ బీ పోటీల్లో ఛాంపియన్లుగా నిలిచిన విద్యార్థులు ఇతర అంతర్జాతీయ స్పెల్లింగ్ పోటీల్లోనూ విజేతలుగా నిలుస్తున్నారు. ఫౌండేషన్ సహకారంతో.. నార్త్ సౌత్ ఫౌండేషన్ అనే నాన్ ప్రాఫిట్ సంస్థ 1993 నుంచి భారత సంతతి విద్యార్థులకు.. స్పెల్లింగ్, వొకాబులరీ, భూగోళశాస్త్రం, గణితం తదితర విభాగాల్లో శిక్షణ ఇస్తోంది. దాదాపు 92 దేశాలకు చెందిన పదాలు, వాటి చరిత్రకు సంబంధించిన వివరాలు సహా ఇందులో భాగంగా ఉంటాయి. వివిధ దేశాలకు చెందిన సుమారు 16 వేల మంది విద్యార్థులు పాల్గొనే ఈ పోటీలో ఇండో అమెరికన్లే ఛాంపియన్లుగా నిలవడంలో ఈ సంస్థ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఎటువంటి లాభాపేక్ష, పబ్లిసిటీ లేకుండా విద్యార్థులకు తన వంతు సహాయం చేస్తోంది. వారి పాత్ర అభినందనీయం అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ స్పెల్లింగ్ పోటీలో భారత సంతతి విద్యార్థులు విజేతలుగా నిలవడంలో వారి తల్లిదండ్రులదే కీలక పాత్ర అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ పోటీ కోసం ప్రత్యేకంగా కోచ్‌లను నియమించడం, వారే స్వయంగా పిల్లల కోసం సమయం కేటాయించడం ద్వారా పదేళ్లుగా ఈ విన్నింగ్ రికార్డును కొనసాగించడం సాధ్యమవుతోంది. ఇండో అమెరికన్ల పోటీతత్త్వం, వారి విజయం వెనుక రహస్యాల గురించిన పలు విషయాల గురించి బ్రేకింగ్ ద బీ అనే డాక్యుమెంటరీలో తల్లిందండ్రుల పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లు.. స్పెల్లింగ్ బీ పోటీలో దాదాపు శౌరవ్ దాసరి అనే ఇండో అమెరికన్ గత పదేళ్లుగా విసుగు చెందక పాల్గొంటూనే ఉన్నాడు. శౌరవ్‌తో పాటు అతడి సోదరిని కూడా ఈ పోటీలో భాగస్వామ్యం చేయడం గురించి వారి తండ్రి గణేష్ మాట్లాడుతూ.. ‘ విద్య ప్రాధాన్యత తెలిసిన తల్లిదండ్రుల నుంచే పిల్లలు స్ఫూర్తి పొందుతారు. నేను, నా భార్య ఉష సాంకేతిక రంగంలో పట్టా పొందిన మేము నిపుణుల కోటా కింద వీసా సంపాదించి ఇక్కడకు వచ్చాం. 2017లో మా పిల్లలకు స్పెల్ బీ వయోపరిమితి ముగిసింది. ఆ తర్వాత స్పెల్పండిట్ అనే కోచింగ్ కంపెనీ ప్రారంభించి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు. నుపుర్ లాలా 2025 నాటికే మనదే హవా ఇక డల్లాస్‌కు చెందిన విజయ్ రెడ్డి తన కొడుకును చాంపియన్‌గా తీర్చిదిద్దేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు. ఈ విషయంలో ఆయన భార్య కూడా తన వంతు సహాయం చేస్తున్నారు. అయితే వారి కుమారుడు చేతన్ ఏడోస్థానంలోనే నిలిచినప్పటికీ అతడిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇది మాకు ఒలంపిక్స్ వంటిది. తను కచ్చితంగా గెలవాలని మా ఆశ అని చెప్పే విజయ్‌రెడ్డి ప్రతీ అంశాన్ని చాలెంజింగ్‌గా తీసుకుంటారు. అందుకే స్పెల్‌బీ విద్యార్థుల కోసం జియోస్పెల్ అనే కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించి మెరికల్లా వారిని తీర్చిదిద్దుతున్నారు’ అని ఆంత్రపాలజిస్ట్ షాలినీ శంకర్ పేర్కొన్నారు. 2025 నాటికి స్పెల్లింగ్ బీలో పూర్తి స్థాయిలో భారతీయుల హవానే కొనసాగడం ఖాయమని అభిప్రాయపడ్డారు. కాగా తాజాగా జరిగిన స్పెల్లింగ్ పోటీల్లో భారత సంతతి విద్యార్థులు చాంపియన్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాకు చెందిన రిషిక్ గంధశ్రీ(13), మేరీల్యాండ్‌కు చెందిన సాకేత్ సుందర్(13), న్యూజెర్సీకి చెందిన శ్రుతికా పధి (13), టెక్సాస్‌కు చెందిన సోహుం సుఖ్తంకర్ (13), అభిజయ్ కొడాలి(12), రోహన్ రాజా (13), క్రిస్టఫర్ సెర్రావ్(13), అలబామాకు చెందిన ఎరిన్ హొవార్డ్(14)లు విజేతల జాబితాలో ఉన్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు, కెనడా, ఘనా, జమైకా తదితర దేశాల నుంచి వచ్చిన దాదాపు 562 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా, 8 మందిని నిర్ణేతలు విజేతలుగా ప్రకటించారు. అందులో ఇద్దరు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. కాగా ఇద్దరి కన్నా ఎక్కువ మందిని విజేతలుగా ప్రకటించడం 94 ఏళ్ల స్పెల్‌బీ చరిత్రలో ఇదే తొలిసారి. వీరిలో ఒక్కొక్కరు దాదాపు రూ.35 లక్షల చొప్పున నగదును, బహుమతులను గెలుచుకున్నారు. -
అమెరికా బరిలో‘ సమోసా’ సత్తా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు దేశంలోకి విదేశీయుల రాకను(వలసలు) నియంత్రించడానికి శతవిధాల ప్రయత్నిస్తోంటే మరోవైపు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచుకోవడానికి భారతీయ అమెరికన్లు పోటీ పడుతున్నారు. నవంబర్ ఆరో తేదీన జరిగే మధ్యంతర ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల నుంచి వంద మందికి పైగా భారతీయ అమెరికన్లు ప్రతినిధుల సభ, సెనెట్‌లతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగే శాసనసభ, స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికన్ కాంగ్రెస్‌లో ఐదుగురు భారతీయ అమెరికన్లు సభ్యులుగా ఉన్నారు. మధ్యంతర ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పోటీ చేయడం రాజకీయంగా బలపడాలన్న భారతీయ అమెరికన్ల ఆకాంక్షను ప్రతిఫలిస్తోందని భారతదేశంలో అమెరికా మాజీ రాయబారి రిచ్ వర్మ అన్నారు. ‘అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్ల హవా పెరుగుతుండటం నమ్మశక్యంకాని నిజం’అని ఆయన వ్యాఖ్యానించారు.దేశ జనాభాలో భారతీయ అమెరికన్లు ఒక శాతం వరకు (40లక్షలు)ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యులుగా ఉన్న ఐదుగురు భారతీయ అమెరికన్లు అమి బెరా, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీల జయపాల్,శివ అయ్యదురైలు మధ్యంతర ఎన్నికల్లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నలుగురిలో అమిబెరా కాలిఫోర్నియా నుంచి మూడుసార్లు కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు.ఖన్నా(కాలిఫోర్నియా), కృష్ణమూర్తి(ఇల్లినాయిస్),ప్రమీల(వాషింగ్టన్) మొదటి సారి ఎన్నికయ్యారు.అమిబెరా నాలుగోసారి, మిగతా ముగ్గురు రెండో సారి బరిలో దిగారు. అమెరికన్ కాంగ్రెస్‌లో ఉన్న ఐదుగురు భారతీయ అమెరికన్లనుఅనధికారికంగా ‘సమోసా కాకస్’గా పిలుస్తారు.కృష్ణమూర్తే తమ బృందానికి ఈ పేరు పెట్టారు.ప్రస్తుతం ఉన్న ఐదుగురు సభ్యులు మధ్యంతరంలో ఎన్నికవడం ఖాయమని చెబుతున్నారు.వీరు కాకుండా మరో ఏడుగురు భారతీయ అమెరికన్లు కూడా మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభకు పోటీ చేస్తున్నారు. శివ అయ్యదురై మసాచుసెట్స్ నుంచి సెనెట్‌కు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎలిజిబెత్ వారెన్‌తో ఆయన తలపడుతున్నారు. శివ ఎలిజిబెత్‌కు గట్టిపోటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.మిగతా వారిలో తిపిర్నేని, కులకర్ణి, పురేవాల్‌లు ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇస్తున్నారని ఎన్బీసీ న్యూస్ పేర్కొంది. ఈసారి ఎన్నికలు చాలా మంది కొత్త వారిని ప్రతినిధుల సభ, రాష్ట్ర శాసన సభలకు పంపుతున్నాయని వర్మ తెలిపారు. పలువురు భారతీయ అమెరికన్ల తరఫున ఆయన ప్రచారం చేస్తున్నారు.ఆరిజోనా నుంచి టెక్సాస్ వరకు ఒహియో, మిచిగాన్ తదితర రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.ఈ ఎన్నికల తర్వాత అమెరికన్ కాంగ్రెస్‌లో మన బలం పెరుగుతుందన్న నమ్మకం ఉందంటున్నారు కృష్ణమూర్తి. ఈ ఎన్నికల కోసం ఆయన 50 లక్షల డాలర్ల నిధి సంపాదించారు. ఈ సారి ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు ఎక్కువ మంది గెలిచే అవకాశం కనిపిస్తోంది.నా జీవితంలో ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు’అని వర్మ అన్నారు. ట్రంప్ జాత్యహంకార, వలసవాద వ్యతిరేక ధోరణులను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.ట్రంప్ విధానాలతో అమెరికన్లు, ముఖ్యంగా భారతీయ అమెరికన్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, తమ భయాన్ని, నిరసనను గట్టిగా చెప్పడం కోసమే ఈ సారి అనేక మంది భారతీయ అమెరికన్లు బరిలో దిగారని వర్మ స్పష్టం చేశారు. మధ్యంతరంలో పోటీ చేస్తున్న భారతీయ అమెరికన్లలో ఎక్కువ మంది డెమోక్రాట్ పార్టీ తరఫున నిలబడ్డారు. -
‘మధ్యంతరం’లో ఒబామాకు గడ్డుకాలం
వాషింగ్టన్: మంగళవారం జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రెసిడెంట్ ఒబామా సారథ్యంలోని డెమోక్రాట్ అభ్యర్థులకు గడ్డుకాలం తప్పదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అమెరికా ప్రతినిధుల సభలోని మెుత్తం 435 సీట్లకు, సేనేట్‌లోని వందసీట్లకుగాను 36సీట్లకు, 50రాష్ట్రాల్లోని 36రాష్ట్రాల గవర్నర్ పదవులకు, ఆయా రాష్ట్రాల్లోని లెజిస్లేచర్ సీట్లకు, సిటీ కౌన్సిళ్లకు మంగళవారం ఎన్నికలు జరిగారుు. ప్రతినిధుల సభలో ఇప్పటికే 233-199తో రిపబ్లికన్లకు గల ఆధిక్యత ఈ ఎన్నికల్లో మరింత పెరిగే సూచనలున్నాయని, సెనేట్‌లో 53-45 సీట్ల తేడాతో స్వల్పంగా ఉండే ఆధిక్యతను కూడా డెమోక్రాట్లు కోల్పోరుు, రిపబ్లికన్లు పైచేయి సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సెనేట్‌లో రెండు సీట్లు ఇండిపెండెంట్ల చేతిలో ఉన్నారుు. ఎన్నికల్లో ఆరు సీట్లు గెలుచుకోగలమన్న ధీమాతో రిపబ్లికన్లు ఉన్నారని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక తెలిపింది. జార్జియా, లూసియానా, అలాస్కా, కొలరాడో వంటి చోట్ల రిపబ్లికన్లతో పోటీ తీవ్రంగా ఉన్న తరుణంలో నెనేట్లో డెమోక్రాట్లకు ఆధిక్యం దక్కేది అనుమానమేనని వ్యాఖ్యానించింది. కొలరాడో, న్యూ హ్యాంప్‌షైర్, జార్జియూ, ఫ్లోరిడా రాష్ట్రాల గవర్నర్ పదవులకు జరిగే ఎన్నికల్లో కూడా డెమోక్రాట్లకు ఇదే ప్రతికూలత ఎదురుకావచ్చని ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. అరుుతే, అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఈ అంచనాలను కొట్టిపారేశారు. సెనేట్‌లో ఆధిక్యతను నిలుపుకుంటావుని ధీమా వ్యక్తంచేశారు. హేలీ, బెరా, ఖన్నాల గెలుపుపై ఆశలు వాషింగ్టన్: అమెరికాలో జరుగుతున్న కీలకమైన ఎన్నికల్లో భారతీయు సంతతికి చెందిన అమెరికన్లు రెండు డజన్లకుపైగా పోటీచేస్తున్నప్పటి కీ , అమెరికా రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన ముగ్గురు యుువనేతలపైనే 30లక్షల మంది భారతీయ అమెరికన్లు ఆశలు పెట్టుకున్నారు. దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ, కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా, స్టేట్ లెజిస్లేచర్ కోసం పోటీ పడుతున్న ఎంఓ ఖన్నాల భవితవ్యం గురించే వారు ఎదురుచూస్తున్నారు. గవర్నర్ పదవినుంచి స్టేట్ లెజిస్లేచర్, సిటీ కౌన్సిల్ సభ్యత్వాల వరకూ జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడే అవకాశం ఉంది. దక్షిణ కరోలినా గవర్నర్‌గా రెండవసారి ఎన్నికకోసం నిక్కీ హేలీ పోటీలో ఉండగా, కాలిఫోర్నియానుంచి ప్రతినిధుల సభకు అమీ బెరా పోటీలో ఉన్నారు. ఇక ఇల్లినారుుస్ లెజిస్లేచర్ సీటుకోసం ఆర్ ఖన్నా పోటీలో ఉన్నారు.