‘మధ్యంతరం’లో ఒబామాకు గడ్డుకాలం
వాషింగ్టన్: మంగళవారం జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రెసిడెంట్ ఒబామా సారథ్యంలోని డెమోక్రాట్ అభ్యర్థులకు గడ్డుకాలం తప్పదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అమెరికా ప్రతినిధుల సభలోని మెుత్తం 435 సీట్లకు, సేనేట్‌లోని వందసీట్లకుగాను 36సీట్లకు, 50రాష్ట్రాల్లోని 36రాష్ట్రాల గవర్నర్ పదవులకు, ఆయా రాష్ట్రాల్లోని లెజిస్లేచర్ సీట్లకు, సిటీ కౌన్సిళ్లకు మంగళవారం ఎన్నికలు జరిగారుు. ప్రతినిధుల సభలో ఇప్పటికే 233-199తో రిపబ్లికన్లకు గల ఆధిక్యత ఈ ఎన్నికల్లో మరింత పెరిగే సూచనలున్నాయని, సెనేట్‌లో 53-45 సీట్ల తేడాతో స్వల్పంగా ఉండే ఆధిక్యతను కూడా డెమోక్రాట్లు కోల్పోరుు, రిపబ్లికన్లు పైచేయి సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సెనేట్‌లో రెండు సీట్లు ఇండిపెండెంట్ల చేతిలో ఉన్నారుు. ఎన్నికల్లో ఆరు సీట్లు గెలుచుకోగలమన్న ధీమాతో రిపబ్లికన్లు ఉన్నారని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక తెలిపింది.
జార్జియా, లూసియానా, అలాస్కా, కొలరాడో వంటి చోట్ల రిపబ్లికన్లతో పోటీ తీవ్రంగా ఉన్న తరుణంలో నెనేట్‌లో డెమోక్రాట్లకు ఆధిక్యం దక్కేది అనుమానమేనని వ్యాఖ్యానించింది. కొలరాడో, న్యూ హ్యాంప్‌షైర్, జార్జియూ, ఫ్లోరిడా రాష్ట్రాల గవర్నర్ పదవులకు జరిగే ఎన్నికల్లో కూడా డెమోక్రాట్లకు ఇదే ప్రతికూలత ఎదురుకావచ్చని ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. అరుుతే, అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఈ అంచనాలను కొట్టిపారేశారు. సెనేట్‌లో ఆధిక్యతను నిలుపుకుంటావుని ధీమా వ్యక్తంచేశారు.
హేలీ, బెరా, ఖన్నాల గెలుపుపై ఆశలు
వాషింగ్టన్: అమెరికాలో జరుగుతున్న కీలకమైన ఎన్నికల్లో భారతీయు సంతతికి చెందిన అమెరికన్లు రెండు డజన్లకుపైగా పోటీచేస్తున్నప్పటి కీ , అమెరికా రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన ముగ్గురు యుువనేతలపైనే 30లక్షల మంది భారతీయ అమెరికన్లు ఆశలు పెట్టుకున్నారు. దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ, కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా, స్టేట్ లెజిస్లేచర్ కోసం పోటీ పడుతున్న ఎంఓ ఖన్నాల భవితవ్యం గురించే వారు ఎదురుచూస్తున్నారు. గవర్నర్ పదవినుంచి స్టేట్ లెజిస్లేచర్, సిటీ కౌన్సిల్ సభ్యత్వాల వరకూ జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడే అవకాశం ఉంది. దక్షిణ కరోలినా గవర్నర్‌గా రెండవసారి ఎన్నికకోసం నిక్కీ హేలీ పోటీలో ఉండగా, కాలిఫోర్నియానుంచి ప్రతినిధుల సభకు అమీ బెరా పోటీలో ఉన్నారు. ఇక ఇల్లినారుుస్ లెజిస్లేచర్ సీటుకోసం ఆర్ ఖన్నా పోటీలో ఉన్నారు.