న్యూయార్క్ : ఈనెల 24, 25న రెండు రోజుల భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి బృందంలో భారత సంతతికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారు. ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) చైర్మన్ అజిత్ పాయ్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికారి కష్ పటేల్‌లు ఈ బృందంలో సభ్యులుగా అధ్యక్షుడి వెంట సోమవారం భారత్‌లో అడుగుపెట్టనున్నారు. పాయ్ తల్లితండ్రులు ఇద్దరూ మహారాష్ట్రకు చెందిన వైద్యులు కాగా 1971లో వారు అమెరికాకు వలస వెళ్లారు. కాన్సాస్‌లో జన్మించిన పాయ్ హార్వార్డ్, చికాగో యూనివర్సిటీల్లో విద్యాభ్యాసంతో న్యాయవాదిగా ఎదిగారు.
2012లో ఆయన ఎఫ్‌సీసీలో చేరి అనంతరం అయిదుగురు కమిషనర్లలో ఒకరిగా ఎంపికయ్యారు. 2017లో ట్రంప్ పాయ్‌ను ఎఫ్‌సీసీ చీఫ్‌గా నియమించారు. ఇక గుజరాత్ మూలాలున్న కష్ పటేల్ తల్లితండ్రులు తూర్పు ఆఫ్రికా, కెనడాల నుంచి న్యూయార్క్‌లో స్ధిరపడ్డారు. రష్యా జోక్యంపై దర్యాప్తును తోసిపుచ్చడం ద్వారా పటేల్ ఇటీవల వార్తల్లో నిలిచారు. 2018లో పటేల్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు చెదిన డైరెక్టరేట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అలయన్స్‌లో చేరారు. ఉగ్రవాద నిరోధక విభాదగం బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించారు. పటేల్ గతంలో రిపబ్లికన్ నాయకత్వానికి చెందిన హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీకి కూడా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment