న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ప్రచార వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో భారతీయ అమెరికన్ల ఓటర్ల అధిక సంఖ్యలో పాల్గొనేలా కొన్ని స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి.
అందులో భాగంగానే ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (FIIDS) సంస్థ ‘ఇండో అమెరికన్ వోట్స్ మేటర్’ అనే ప్రచారాన్ని మంగళవారం ప్రారంభించింది. అమెరికా భవిష్యత్తును రూపొందించడంలో ఇండియన్ అమెరికన్లు కీలక పోషిస్తారని ఓ ప్రకటనలో తెలిపింది.
‘‘ఇండో అమెరికన్లు అమెరికాలో శక్తివంతమైన, పెరుగుతున్న మైనారిటీ కమ్యూనిటీగా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. అమెరికాగా అంతటా సుమారుగా 4.5 మిలియన్ల మంది ఇండో అమెరికన్లు ఉన్నారు. 2024 ఎన్నికలలో ఇండో అమెరికన్ ఓటర్లు గణనీయమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఫ్లోరిడా, జార్జియా, అరిజోనా, వర్జీనియా, న్యూజెర్సీ , పెన్సిల్వేనియా వంటి కీలకమైన రాష్ట్రాలలో ఇండో అమెకన్లు అధిక సంఖ్యలో ఉన్నారు. కీలకమైన అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలను నిర్ణయించడంలో ఇండో అమెరికన్లు నిర్ణయాత్మకంగా మారనున్నారు’’ అని ఎఫ్‌ఐఐడీఎస్ పేర్కొంది.
ఎన్నికల నేపథ్యంలో దేశీయంగా అమెరికా, ప్రపంచం విధానాలపై ఇండో అమెరికన్ల అభిప్రాయలు తెలుసుకోవడానికి సమగ్ర సర్వే చెపడుతున్నామని తెలిపారు. ‘అధ్యక్ష ఎన్నికలకు కీలకమైన రాష్ట్రాల్లో ఇండో అమెరికన్ జనాభా గణనీయంగా ఉంది. ఈ అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు ప్రభావం చూపే అవకాశం కలిగి ఉన్నారు’ అని ఎఫ్‌ఐఐడీఎస్ పాలసీ అండ్ స్ట్రాటజీ చీఫ్ ఖండేరావ్ కాండ్ తెలిపారు.
ఇక.. భారతీయు అమెరికన్లు ఈసారి ఏ పార్టీ అభ్యర్థివైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి. మరోవైపు.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఇండో అమెరికన్ కమలా హారిస్ బరిలో ఉండటంతో భారతీయ అమెరికన్ల ఓటర్లపై ప్రాధాన్యత పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment