భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు చేరుకున్నారు. అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆహ్వానం మేరకు అక్కడికి చేరుకున్న మోదీకి గ్రాండ్ వెల్‌కమ్ లభించింది.న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మోదీకి అగ్రరాజ్య ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఇక ఎయిర్‌పోర్ట్ దగ్గర ఎన్నారైల సందడి నెలకొంది.
మోదీకి స్వాగతం పలికేందుకు ఎడిసన్ మేయర్ సామ్ జోషి, ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులతో పాటు ఎన్నారైలు భారీగా తరలివచ్చారు.మోదీతో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీపడ్డారు. జూన్ 21న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా సెషన్‌కు మోదీ నాయకత్వం వహించనున్నారు. అనంతరం మోదీ జూన్ 22న వైట్ హౌస్‌కు వెళతారు.
అక్కడ అమెరికా చీఫ్ జో బైడెన్ తో ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం.. బైడెన్ దంపతులు ఇచ్చే అధికారిక విందుకు హాజరవుతారు. 23న అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ తో పాటు సెక్రటరీ బ్లింకెన్ తో చర్చిస్తారు మోదీ.
Comments
Please login to add a commentAdd a comment