Rafael Nadal Withdraws from Barcelona Open - Sakshi
Sakshi News home page

Barcelona Open 2023: బార్సిలోనా ఓపెన్‌కు రాఫెల్‌ నాదల్‌ దూరం

Published Sat, Apr 15 2023 2:15 PM | Last Updated on Sat, Apr 15 2023 2:27 PM

Rafael Nadal withdraws from Barcelona Open - Sakshi

రాఫెల్‌ నాదల్‌

మాడ్రిడ్‌: ఎడమ తుంటి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో... ఈనెల 17న మొదలయ్యే బార్సిలోనా ఓపెన్‌ టోర్నీలో స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ బరిలోకి దిగడంలేదు. 36 ఏళ్ల నాదల్‌ బార్సిలోనా ఓపెన్‌లో రికార్డుస్థాయిలో 12 సార్లు చాంపియన్‌గా నిలిచాడు.

క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన సాకేత్‌ జోడీ ఫ్లోరిడాలో జరుగుతున్న సరసోటా ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్‌) జోడీ క్వార్టర్‌ ఫైనల్లో 2–6, 4–6తో డస్టిన్‌ బ్రౌన్‌ (జమైకా)–టిమ్‌ సాండ్‌కౌలెన్‌ (జర్మనీ) జంట చేతిలో ఓడిపోయింది. సాకేత్, యూకీలకు 1,930 డాలర్ల (రూ. 1 లక్షా 57 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది.

కాంస్యంతో ముగింపు 
అస్తానా (కజకిస్తాన్‌): ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను భారత జట్టు కాంస్య పతకంతో ముగించింది. టోర్నీ చివరిరోజు శుక్రవారం పురుషుల ఫ్రీస్టయిల్‌ 125 కేజీల విభాగంలో అనిరుధ్‌ కుమార్‌ కాంస్య పతకాన్ని సాధించాడు. కాంస్య పతక బౌట్‌లో అనిరుధ్‌ 12–2తో సర్దార్‌బెక్‌ ఖొల్మతోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై గెలుపొందాడు.

అంతకుముందు క్వాలిఫయింగ్‌లో అనిరుధ్‌ 8–2తో తైకి యామమోటో (జపాన్‌)పై నెగ్గి, క్వార్టర్‌ ఫైనల్లో 0–2తో బతిర్‌ముర్జయెవ్‌ యుసుప్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయాడు. బతిర్‌ముర్జయెవ్‌ ఫైనల్‌ చేరుకోవడంతో అనిరుధ్‌కు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం దక్కింది. భారత్‌కే చెందిన పంకజ్‌ (61 కేజీలు), యశ్‌ (74 కేజీలు), దీపక్‌ పూనియా (92 కేజీలు), జాంటీ కుమార్‌ (86 కేజీలు) పతకాల బౌట్‌లకు అర్హత పొందలేకపోయారు. ఫ్రీస్టయిల్‌ విభాగంలో భారత్‌ ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు సాధించింది. 

జొకోవిచ్‌కు షాక్‌
ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ మోంటెకార్లో ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ను దాటలేకపోయాడు. ఇటలీ ప్లేయర్‌ లొరెంజో ముసెట్టి 2 గంటల 54 నిమిషాల్లో 4–6, 7–5, 6–4తో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ను బోల్తా కొట్టించి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2013, 2015లలో ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జొకోవిచ్‌ ఈ మ్యాచ్‌లో ఆరు డబుల్‌ ఫాల్ట్‌లు చేసి, తన సర్వీస్‌ను ఎనిమిదిసార్లు కోల్పోయాడు.

మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌), మూడో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) కూడా ఇంటిముఖం పట్టారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా) 6–2, 6–4తో రెండో సీడ్‌ సిట్సిపాస్‌పై, హోల్గర్‌ రూన్‌ (డెన్మార్క్‌) 6–3, 6–4తో మెద్వెదెవ్‌పై నెగ్గి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement