
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ 11వ సారి బార్సిలోనా ఓపెన్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో నాదల్ 6–2, 6–1తో స్టెఫానోస్ సిట్‌సిపాస్ (గ్రీస్)పై గెలిచాడు. నాదల్ కెరీర్‌లో ఇది 77వ సింగిల్స్ టైటిల్. ఈ విజయంతో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో నాదల్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. జిమ్మీ కానర్స్ (అమెరికా–109 టైటిల్స్), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్– 97 టైటిల్స్), ఇవాన్ లెండిల్ (అమెరికా–94 టైటిల్స్) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment