గత వారం స్వదేశంలో జరిగిన టాటా ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో టైటిల్ నెగ్గిన దివిజ్ శరణ్–రోహన్ బోపన్న జంటకు రెండో టోర్నమెంట్‌లో మాత్రం నిరాశ ఎదురైంది. సిడ్నీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో ఈ భారత జోడీ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–ఎడువార్డో రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయంతో జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో బోపన్న–దివిజ్ జంట 2–6, 4–6తో ఓడిపోయింది.
53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ రెండు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి రౌండ్‌లో ఓడినప్పటికీ భారత జంటకు 2,870 డాలర్ల (రూ. 2 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.
తొలి రౌండ్‌లోనే దివిజ్–బోపన్న జంట ఓటమి
Published Wed, Jan 9 2019 12:38 AM | Last Updated on Wed, Jan 9 2019 12:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment