divija
-
యూనివర్సల్ 2020 టైటిల్‌కు దివిజ
ఆదిలాబాద్‌టౌన్: ఆమె ఓ నాట్యమయూరి.. తన ప్రదర్శనలతో అందర్ని ఇట్టే ఆకట్టుకుంటోంది.. తాను నృత్యం చేస్తే కనురెప్పలు తిప్పకుండా చూస్తుండిపోవాల్సిందే. లలిత కళలతో పాటు చదువుల్లో కూడా ముందంజలో ఉంది. కర్ణాటక సంగీతం, కూచిపుడి నృత్యం, వీణా, క్యాషియో, గిటార్ వాయించడంలో ఆమె మేటి అని చెప్పడం అతిశయోక్తి కాదు. చిన్ననాటి నుంచే కళల వైపు మొగ్గు చూపుతుండడంతో తల్లిదండ్రులు సైతం ప్రోత్సాహం అందిస్తున్నారు. తండ్రి మహేష్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తుండగా, తల్లి కవిత డ్యాన్స్ మాస్టర్‌గా ఉన్నారు. దీంతో తల్లి చిన్ననాటి నుంచే ఆమెకు కళలను నేర్పించడంతో గురువును మించిన శిశురాలిగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు అందుకుంది. దీంతో పలు అవార్డులతో పాటు గిన్నీస్‌బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. యూనివర్సల్ మల్టీ ట్యాలెంట్‌కు ఎంపిక.. ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణవాడకు చెందిన దివిజ యూనివర్సల్ 2020 మల్టీ ట్యాలెంట్‌కు ఎంపికైంది. తానా, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు ఆమెను అభినందించారు. గత నెల 24, 25 తేదీల్లో ఆన్లైన్లో తానా, తెలుగు సాంస్కృతిక కార్యక్రమం ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఆస్ట్రేలియా, కువైట్, న్యూజిలాండ్, యూఎస్ఏతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. సౌందర్య లహరి నైపుణ్యాలు, కూచిపూడి, వీణా, గిటార్, క్యాషియో, తదితర రంగాలకు సంబంధించి 700మంది కళాకారులు పాల్గొన్నారు. అయితే మొదటి దశలో 25మందిని ఎంపిక చేశారు. వీరి ప్రదర్శనలు ఈ–మెయిల్ ద్వారా పంపారు. రెండో దశలో 25నుంచి 11మందిని ఎంపిక చేశారు. ఆ 11మందిలో దివిజ స్థానం సాధించింది. ప్రస్తుతం ఈమె డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. పలు రంగాల్లో ప్రావీణ్యం.. ♦2014లో హైదరాబాద్‌లోని గచ్చిబౌళిలో నిర్వహించిన సిలికాన్ ఆంధ్ర కూచిపుడి నృత్య సమ్మేళనంలో ప్రతిభ కనబర్చింది. వరల్డ్ గిన్నిస్‌బుక్‌లో రికార్డుకెక్కింది. ♦2016లో విజయవాడలో నిర్వహించిన సిలికాన్ ఆంధ్ర కూచిపుడి నృత్య సమ్మేళనంలో ప్రతిభ కనబర్చి మరోసారి గిన్నిస్‌బుక్‌లో రికార్డు సాధించింది. ♦2016లో గోదావరి పుష్కరాల్లో భాగంగా సరస్వతి దేవి పుణ్య క్షేత్రంలో స్వర సంగీత, శాస్త్రీయ నృత్య, కూచిపుడి నృత్య సమ్మేళన ప్రదర్శనతో ఆకట్టుకుంది. గోదావరి పుష్కర అవార్డును అందుకుంది. ♦2016లో జైనథ్‌లోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించిన శాస్త్రీయ నృత్య పోటీల్లో ప్రతిభ కనబర్చి ప్రముఖ కవి సుద్దాల అశోక్‌తేజ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ♦2017లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన శాస్త్రీయ నృత్య పోటీల్లో నాట్య కిరణం అవార్డును తమిళనాడు రాష్ట్ర గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా అందుకుంది. ♦2017లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించి ఏబీసీ ఫౌండేషన్, భారత్ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ కల్చరల్ ఫెస్టివల్లో తెలుగు వరల్డ్ రికార్డుకెక్కింది. ఆ అవార్డును లక్ష్మీపార్వతి చేతుల మీదుగా అందుకుంది. ఇలా చెప్పుకుంటుపోతే అనేక అవార్డులు ఆమె సొంతం.. చిన్ననాటి నుంచే ఇష్టంగా ముందుకు అమ్మ డ్యాన్స్ మాస్టర్ కావడంతో చిన్నప్పటి నుంచే నాకు లలిత కళలు అంటే ఇష్టం. నా ఇష్టాన్ని తెలుసుకొని అమ్మనాన్న ప్రోత్సాహం అందించడంతోనే ముందుకు సాగుతున్నాను. కరోనా నేపథ్యంలో తానా, తెలంగాణ సాంస్కృతి కార్యక్రమాలు ఆన్లైన్లో జరిగాయి. ఇందులో మల్టీ ట్యాలెంట్ టెస్ట్‌కు ఎంపికయ్యాను. ఆ సంస్థ వారు నన్ను అభినందించడం జరిగింది.– దివిజ -
యూఎస్‌లో కారు ప్రమాదం, టెకీ, కూతురు మృతి
సాక్షి, బెంగళూరు: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన తండ్రీ కుమార్తెలు మృత్యువాత పడ్డారు. బీదర్‌కు చెందిన టెక్కీ ముఖేశ్ శివాజీవార దేశ్‌ముఖ్ (27), ఆయన రెండేళ్ల కుమార్తె దివిజా రోడ్డు ప్రమాదంలో అసువులు బాసినట్లు ఇక్కడికి సమాచారం అందింది. బీదర్ జిల్లా భాల్కి తాలూకా కొంగళ్లికి చెందిన ముఖేశ్ అమెరికాలోని ఉత్తర కరోలినాలో ఐటీ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. శుక్రవారం తన సతీమణి మౌనిక, కుమార్తె దివిజాలతో కారులో వెళుతున్నారు. ముఖేశ్ కారును డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సమయంలో కారు అదుపు తప్పి ఓ ట్రక్‌ను ఢీ కొట్టడంతో తండ్రీకుమార్తెలు ఇద్దరూ అక్కడికక్కడే మరణించగా, మౌనిక పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను త్వరగా స్వదేశానికి తీసుకొచ్చే విషయమై భారతీయ రాయబారి కార్యాలయంతో బీదర్ ఎంపీ భగవంత్ ఖోబా సంప్రదింపులు జరిపారు. -
తొలి రౌండ్లోనే దివిజ్–బోపన్న జంట ఓటమి
గత వారం స్వదేశంలో జరిగిన టాటా ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో టైటిల్ నెగ్గిన దివిజ్ శరణ్–రోహన్ బోపన్న జంటకు రెండో టోర్నమెంట్లో మాత్రం నిరాశ ఎదురైంది. సిడ్నీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో ఈ భారత జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–ఎడువార్డో రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయంతో జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–దివిజ్ జంట 2–6, 4–6తో ఓడిపోయింది. 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ రెండు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి రౌండ్లో ఓడినప్పటికీ భారత జంటకు 2,870 డాలర్ల (రూ. 2 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. -
సిటీ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు దివిజ్ శరణ్ జోడీ
భారత టెన్నిస్ అగ్రశ్రేణి డబుల్స్ ప్లేయర్ దివిజ్ శరణ్ సిటీ ఓపెన్ ఏటీపీ–500 టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. వాషింగ్టన్లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో శరణ్–అర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జోడీ 7–5, 7–6 (8/6)తో ఇల్యా ఇవాష్క (బెలారస్)–డానిల్ మెద్వెదేవ్ (రష్యా) ద్వయంపై విజయం సాధించింది. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)–జేమ్స్ సెరెటాని (అమెరికా)లతో శరణ్–సితాక్ తలపడతారు. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) 3–6, 3–6తో క్రుగెర్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. -
సృజనకు పట్టం
రెక్కలు తొడిగిన ఊహలకు ఆ చిట్టి కుంచెలు అద్భుతమైన రూపాన్నిచ్చాయి. అబ్బురపరిచే కళను రంగులతో కలగలిపి కాన్వాస్‌పై ఒలకబోసి అదరహో అనిపించారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్రస్థాయి పెయింటింగ్ పోటీలు చిన్నారుల ప్రతిభకు తార్కాణంగా నిలిచాయి. 50 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో హైదరాబాద్ చిన్నారులే మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. కోన సుధాకర్ రెడ్డి ఫుల్ హ్యాపీ గతంలో జరిగిన పోటీల్లో ప్రోత్సాహక బహుమతి వచ్చింది. ఈసారి ఫస్ట్ ప్రైజ్ రావడం ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు, టీచర్ల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించాను. భవిష్యత్తులో మంచి ఆర్టిస్ట్ అవుతాను. నీటికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ పెయింటింగ్ వేశాను. - కె.దివిజ, ఏడో తరగతి,డీఏవీ పబ్లిక్ స్కూల్, కూకట్పల్లి మొదటిసారైనా.. ఇలాంటి పోటీలో నేను పాల్గొనడం ఇదే తొలిసారి. సెకండ్ ప్లేస్‌లో నిలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ ఆనందాన్ని ఫ్యామిలీ, టీచర్లు, స్నేహితులతో పంచుకుంటా. చిన్నపిల్లలు-నీటి సంర క్షణ కాన్సెప్ట్‌ను కాన్వాస్‌పై చూపాను. - జి.అమృత లక్ష్మి, ఎనిమిదో తరగతి,కేంద్రియ విద్యాలయం, బేగంపేట్. ఇదే స్ఫూర్తితో.. రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీలో నాకు ప్రైజ్ రావడం ఆనందంగా ఉంది.లక్ష్మణుడి ప్రాణాలను కాపాడటానికి ఆంజనేయుడు సంజీవని పర్వతం తెచ్చిన ఘట్టాన్ని.. ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ చిత్రం గీశాను. ఇలాంటి పోటీలు చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. - ఇ.శ్వేత, తృతీయ బహుమతి విజేత, ఎనిమిదో తరగతి, ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్- 1, ఈసీఐఎల్